ఆకుకూరలతో జుట్టుకు పోషణ   * ఆకుకూరలు ఒంటికే కాదు జుట్టుకు కూడా చాల మంచివి. వాటితో జుట్టుకూ నిగారింపు ఇవ్వొచ్చు. చుండ్రు, జుట్టురాలడం తగ్గించుకునేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి.   * ఒక కప్పు పొనగంటి కూర, ఒక కప్పు గోరింటాకుపొడి, రెండు చెంచాల మెంతిపొడి, అరకప్పు పెరుగు, ఒక చెంచా నిమ్మరసం, నీళ్లు కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు రాలడం, చుండ్రు తగ్గుతుంది. * చుక్కకూర ఒక కప్పు, గోరింటాకు పొడి కప్పు, రెండు స్పూన్‌ల ముల్తాన్ మట్టీ, కప్పు పెరుగు బాగా కలిపి తలకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి. దీనివల్ల జుట్టు నిగనిగలాడడమే కాదు, చుండ్రు బాధ నుంచి దూరమవ్వచ్చు. * మజ్జిగలో చింతచిగురు, గోరింటాకుపొడి ఒక్కొక్క కప్పు తీసుకొని దాంట్లో అరకప్పు శనగపిండిని కలపాలి. దాన్ని మాడకు పట్టించాలి. 20నిమిషాల తర్వాత తలను కడిగేయాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్‌లా పనిచేస్తుంది. అయితే ఈ మిశ్రమాన్ని పెట్టుకునే ముందు తలకు నూనె పెట్టుకోవాలి. * ముందు తలకు నూనె పెట్టుకొని మర్దనా చేయాలి. ఇప్పుడు అవిసె ఆకులు రెండు కప్పులు, గోరింటాకు కప్పు, ఉసిరిపొడి అరకప్పు వేసి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 20నిమిషాల తర్వాత గోరు నీటితో కడిగేయాలి. ఇది వేడిని దూరం చేస్తుంది. దాంతో జుట్టు రాలడం తగ్గుతుంది. చుండ్రు బాధ కూడా తగ్గుతుంది. * గోరింటాకు పొడిలో ఒక స్పూన్ లవంగాలపొడి, కప్పు డికాషన్, కోడిగుడ్డు, కొంచెం పెరుగు, ఒక స్పూన్ ఆముదం నూనె కలిపి తలకు పెట్టుకోవాలి. 20నిమిషాల తర్వాత తలస్నానం చేయాలి. ఆ తర్వాత నూనె రాసి మర్దనా చేసుకోవాలి. దీనివల్ల తెల్ల జుట్టు మంచి రంగు వస్తుంది. అంతేకాదు, జుట్టు రాలకుండా ఉంటుంది.  

ఈ చిట్కాలతో అందమైన జుట్టు మీ సోంతం   జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మార్కెట్ లో లభించే చాలా రకాల ఉత్పత్తులను ప్రయత్నిస్తుంటారు. అక్కడ రింగు రింగుల జుట్టు కోసం, నేరుగా ఉండే జుట్టు కోసం, ఉత్తమమైన కేశాల కోసం, జిడ్డుగా ఉండే కేశాల కోసం, మాములుగా ఉండే జుట్టు కోసం అని చాలా రకాల ఉత్పత్తులలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల ఉత్పత్తులలో ఏది మన కేశాలకు సరిగా పని చేస్తుంది? అనే అనుమానం కలుగవచ్చు అవునా!. మీ కేశాలు ఆరోగ్యవంతంగా ఉండటానికి, రోజు మంచి ఆహార ప్రణాలికలను పాటించటం తప్పనిసరి. మార్కెట్'లో కేశాల ఆరోగ్యం కోసం చాలా రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, అందులో మీ జుట్టుకి సరిపోయే ఉత్పత్తులను ఎంచుకోవటం చాలా కష్టమే. మార్కెట్'లో లభించే ఉత్పత్తులన్ని మంచివో, చెడ్డవో లేదా జుట్టు ఎదోర్కొనే సమస్యలకు అక్కడ ఉన్న ఏ ఉత్పత్తి సరిగా పని చేస్తుందో ముందు తెలుసుకోవాలి. కావున మీ కేశాలు ఎదుర్కొంటున్న సమస్యల ఆధారితంగా మంచి ఉత్పత్తిని ఎంచుకోండి. కేశాల ఆరోగ్యం మరియు వాటి పరిస్థితులను బట్టి రసానిక లేదా మూలికలతో తయారు చేసిన ఉత్పత్తులను ఎంచుకోండి. కేశాలకు వాడే నూనెలు కేశాలకు వాడే నూనెలు, కండిషనర్'లు, షాంపూలు అన్ని ఒత్తిడిలను తగ్గించటానికి వివిధ రకాల సంస్థలు వాటికి తగిట్టుగా ఉత్పత్తులను తయారుచేస్తున్నారు. కేశాల కోసం వాడే నూనెలు సాధారణంగా సహజమైన కొబ్బరి, ఆమ్లా లేదా ఆవాలతో తయారు చేసిన వాటిని వాడటం మంచిది. కానీ ముందుగా మీ కేశాలకు కావలసిన పోషకాలను అందించే వాటిని మాత్రమె ఎంచుకోటానికి ప్రయత్నించండి. ఒకవేళ మీ వెంట్రుకలు రాలిపోతే మాత్రం ఆవాలతో చేసిన నూనె మంచిది, అంతేకాకుండా ఆమ్లాలతో చేసిన నూనెలు కేశాల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి మరియు గోరు వెచ్చని కొబ్బరి నూనె మీ కేశాల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇలా చాలా రకాల నూనెల ఉత్పత్తులు మార్కెట్'లో అందుబాటులో ఉన్నాయి. షాంపూ మార్కెట్'లో చాలా రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి, ఇందులో రసాయనిక, వైద్యపరమైన మరియు ఔషద గుణాలను కలిగి ఉన్న చాలా రకాల నూనెలు అందుబాటులో ఉన్నాయి. షాంపూలు కూడా కేశాల పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, కేశాల రకాలను బట్టి ఎంచుకోండి. ఉదాహరణకు- పొడి కేశాలకు, రంగు రంగుల జుట్టు కోసం మరియు ప్రమాదానికి గురయిన కేశాల కోసం వివిధ రకాల షాంపూలు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా, చూండ్రును త్రోలగించటానికి, జుట్టు రాలిపోవటాన్ని నివారించటానికి లేదా పొడి కేశాలకు కూడా పుష్కలమైన షాంపొ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఇలా వీటన్నిటిని చూసి ఏది వాడలో, ఏది కొనాలో తెలియక సతమతం అవుతుంటారు. మీ కేశాల పరిస్థుతులు, అవసరం అయ్యే రకం మరియు వెంట్రుకల ఆరోగ్యానికి, పెరుగుదలకు, దృడత్వానికి అవసరం అయ్యేది మీకు తెలిసే ఉంటుంది. కావున మీ కేశాలకు సరిపోయే రకాన్ని, ఇష్టమైన సంస్థ యొక్క ఉత్పత్తులను కొని వాడండి. కండిషనర్'లు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి, కావలసినంత తేమను అందించటానికి కండిషనర్'లు తప్పని సరి అవసరం. ఇక్కడ కూడా మీరు రసాయనిక లేదా మూలికల ఉత్పత్తులను ఎంచుకోవలసి వస్తుంది. మీరు ఎంచుకునే కండిషనర్'లలో హెన్న ఉండే ఉత్పత్తులను ఎంచుకోటానికి ప్రయత్నించండి, కారణం హెన్న ఒక సహజసిద్ద కండిషనర్'గా పనిచేస్తుంది అని చెప్పవచ్చు. ఆ తరువాత, మన జుట్టు కాలుష్యానికి, దుమ్ము మరియు సూర్యకాంతికి బహిర్గతం అవుతున్నాయి. ఇవి కేశాలను ప్రమాదానికి, అనారోగ్యానికి గురి చేస్తుంటాయి. మన కేశాలకు కావలసిన తేమ, వాటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం మన భాద్యత. మీరు వాడే కండిషనర్'లు ఈ విధులను నిర్వహిస్తాయి. మన కేశాలకు సహజసిద్ద కండిషనర్'లను వాడాలి అనుకున్నపుడు హెన్న లేదా గుడ్డు'లను రోజు వాడటం మంచిది. ఇవి జుట్టుకు చాలా మంచివి సహజ సిద్దంగా కేశాలు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన అన్ని రకాల పోషకాలను అందిస్తాయి. కానీ, కండిషనర్'లను వాడిన ప్రతిసారి షాంపూలను వాడటం మాత్రం మర్చిపోకండి. వీటిని వాడటానికి ముందుగా ఎంచుకున్న ఉత్పత్తులను గమనించటం మంచిది, కారణం కొన్ని రకాల ఉత్పత్తులలో గాడతలు ఎక్కువగా ఉన్న రసాయనాలు, కేశాలను ప్రమాదానికి గురి చేసే మూలకాలను లేదా రసాయనాలను కలిగి ఉంటాయి కావున మీ కేశాలకు అనుకూలంగా ఉండే ఉత్పత్తులను ఎంచుకోండి. మీరు ఎంచుకున్న రకం మీ కేశాల ఆరోగ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి అంతేకానీ అనారోగ్యానికి గురి చేసేదిగా ఉండకూడదు. ఒకవేళ ఏదైనా ఉత్పత్తులను వాడినపుడు అసాధారణ లక్షణాలు, చిరాకులు లేదా వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే ఆ ఉత్పత్తులను వాడకాన్ని వెంటనే మానేయటం చాలా మంచిది.

Glow your skin with Vitamin E     We all know that taking Vitamin E capsules is considered good for health benefits. But very few are aware that this nutrient is amazing for skin and hair health when it is directly applied on the affected areas. Vitamin –E does wonders that can rejuvenate our health and beauty. We get Vitamin E oil or Vitamin E capsules in any mediacal stores. You can cut them, and use the  inside serum for application. Here are  few  ideas  to try  Vitamin E on your skin which can bring absolute glow back to your skin which we all are looking for this wedding season. • If ou have rough facial skin or scars, then gently apply the liquid from the capsules or use Vitamin E oil on the scar and massage it softly for a minute. In that way, Vitamin E will go deep into the skin layers and start working on the skin tissues of the affected areas. Make sure you apply it daily for better and faster results. • Vitamin E oil works well as lip moisturizer and makes them smooth. Apply it regularly to make your lips supple and pink in color. • Mix  little amount of  Vitamin E liquid with your body lotion before applying it and it will keep your skin moisturized for a longer period of time. •    You can also pour some Vitamin E oil straight into a bottle filled with Rose water, shake it well, and apply  on the face with a cotton ball daily before going to bed. - Bhavana      

How to Use Turmeric on the Face   For centuries in India, a facial mask made with turmeric was applied to a bride's face before the wedding to make her skin radiant. Turmeric is also used to help cure acne, lighten and brighten the skin and fight age spots. It is fairly simple to make your own turmeric facial mask, using ingredients that are readily available. If it used weekly, this mask should produce positive results. Things You'll Need Coconut oil 1/4 teaspoon turmeric powder Moisturizer Clean towel Instructions 1 Clean your face and neck thoroughly with warm water. Remove all cosmetics, make-up and lotions. If necessary, use a gentle soap. Pat your skin dry when finished. 2 Mix ¼ teaspoon of turmeric powder into a small amount of coconut oil. Stir this until you form a smooth paste. 3 Apply the turmeric paste onto your face and neck. Gently smooth it on, starting at the forehead. Make sure to keep the mixture away from your eyes. 4 Lie down and rest for 20 minutes. Use this time to banish stressful thoughts from your mind and relax. You may wish to listen to music, but either way, try to make this time uninterrupted. 5 Wash off the mask with warm water. Once your face is clean, splash it with cold water to close the pores. Gently dry it with a clean towel. 6 Apply a moisturizer to your face. The moisturizer will help your skin to continue to absorb the turmeric.  

లిప్ స్టిక్ వేసుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....!   అందమైన ఆడపిల్ల అధరాలను ‘సుమధుర మధు కలశాలు’గా వర్ణించిన కవిపుంగవులెందురో! కేవలం అమ్మాయిల అధరాలపైనే వేల కవితలు పుట్టుకొచ్చాయంటే నమ్ముతారా? అతిశయోక్తి అనుకుంటారు కానీ... పిచ్చివాళ్లను పండితుల్ని చేసేశక్తి.. పండితులను పిచ్చివాళ్లుగా మార్చే యుక్తి అమ్మాయిల పెదవులకే ఉందండీ. ఆడవారి అందంలో అధరాల పాత్ర నిజంగా అమోఘం.  అలాంటి అందాల అధరాలను అలా వదిలేస్తే ఎలా? ఆ అధరాల అందాన్ని మరింత ఇనుమడింపజేయడానికి ప్రయత్నం చేయాలా.. వద్దా? అందుకే... రకరకాల లిప్ స్టిక్ లు మార్కెట్లో ఉన్నాయ్. అయితే... వాటిని ఎలా ఉపయోగించాలి? ఎవరు.. ఎలాంటి రంగు లిప్ స్టిక్ లను ఎంచుకోవాలి? సున్నితమైన పెదాలను మరింత అందంగా, ఆకర్షణీయంగా ఉంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ ప్రశ్నలకు ఈ వీడియో ద్వారా చక్కని సమాధానాలను అందిస్తోంది ‘తెలుగు వన్’. చూసి తెలుసుకోండి. తెలుసుకొని పిచ్చెక్కించేయండి!  https://www.youtube.com/watch?v=nVWHuo5UNAQ..      

ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్     స్ట్రాబెర్రీ ప్యాక్: జిడ్డు చర్మతత్వం వున్న వాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పనిచేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనెతో కలిపి పూతలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్న వాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్‌ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది. ఖర్జూర ప్యాక్‌: నాలుగైదు ఎండు ఖర్జూరాల్ని నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత మిక్సీలో వేసి చిక్కగా చేసుకుని, అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయ త్నించవచ్చు. ఆరెంజ్ ఫేస్ ప్యాక్:   ఈ ఫేస్ ప్యాక్. చర్మంలోని సహజసిద్ధమైన జిడ్డుగా చేసే లిల్లి స్కిన్ కోసం ప్రత్యేకంగా తయారైంది చర్మంలోని అదనపు జిడ్డును, మచ్చలను ఇది తొలగిస్తుంది. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను ఆరెంజ్ జ్యూస్ లేదా ఎండిన తొక్కలతో పొడి చేసిన పదార్థాంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్,ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.  

క్యారెట్... అందాల గని..! క్యారెట్ అందాల గని అన్న విషయం మీకు తెలుసా? క్యారెట్ లోని పోషకాలు, ఆంటి ఆక్సిడెంట్స్ చర్మాన్ని ఆరోగ్యాంగా సహజ మెరుపుతో ఉంచుతాయి. అందుకే, క్యారెట్ ని సౌందర్య పోషణలో భాగంగా తరచూ వాడుతూ ఉంటే వయసుతో పాటు వచ్చే మార్పు ప్రభావం చర్మం పై పడకుండా ఉంటుంది. అయితే, క్యారెట్ ని ఎలా వాడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలియాలంటే ఈ వీడియో చూడండి... https://www.youtube.com/watch?v=0ZwdHilG0tE      

Benefits of Applying Curd     Curd has many health benefits and it is also used as a beauty product. It is an excellent source of calcium. Even lactose intolerant people can take curd daily. Applying curd on face helps to get soft and smooth skin. It also acts a good moisturizer and good for dry skin. Whether you suffer from acne, dry skin, skin dullness or excessive oiliness, a plain yogurt mask is a budget-friendly way to treat your face. Yogurt is effective at cleansing and disinfecting pores, preventing acne, moisturizing skin and revitalizing its texture. * Apply paste of curd in the flour (besan) into the hair roots for an hour and wash the head. This will return the hair shine and will exclude you from the problem of dandruff. * Using pepper powder mixed in yogurt for head wash twice a week will end dandruff, and will also help in making hair soft, black, long and dense, which will raise your beauty. * If acne on your skin is bothering you then apply sour curd paste on your face and let it dry and then wash the face. In a few days you will see the unexpected benefits. * Massage sour curd on the blackish part of the neck leave it for 15 minutes and then wash the sour yogurt. This application will help in removing neck blackish part. * Applying curd on face helps to get soft and smooth skin. It also acts a good moisturizer and good for dry skin. If curd is mixed with henna powder and applied to hair, it acts as a good hair conditioner.

తెల్లజుత్తును తరిమేయండి..   పోషకాల లోపాల వల్లో ఇతరత్రా కారణాల వల్లో చిన్న వయసులో జుత్తు తెల్లబడిపోతుంది కొందరికి. దాని గురించి దిగుటు పడక్కకర్లేదు. కొన్ని చిట్కాలు పాటిస్తే తెల్లబడిన హెయిర్ మళ్లీ నల్లబడుతుంది. ట్రై చేసి చూడండి. - రెండు చెంచాల ఉసిరిక పొడి, చెంచాడు బాదం నూనె, అరచెంచా కొబ్బరి నూనె కలిపి పేస్ట్ల్ లా చేయండి. దీన్ని రోజూ రాత్రి తలకు రాసుకుని, ఉదయాన్నే తలంచుకోవాలి. వారానికి రెండు సార్లయినా ఇలా చేస్తే ఫలితముంటుంది. - నల్ల నువ్వుల నూనెను, ఆలివ్ నూనెను సమపాళ్లలో కలిపి వేడిచేయాలి. దీన్ని మాడుకు, జుత్తుకు బాగా పట్టించి, ఆరగంట తర్వాత షీకాయ పొడితో తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి. -కరివేపాకు వేసి మరిగించిన కొబ్బరి నూనెను రోజూ తలకు రాసుకుని, పొద్దున్న స్నానం చేస్తూ ఉంటే సమస్య పరిష్కారమవుతుంది. - ఉల్లిపాయను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లా చేయండి. దీనిలో నిమ్మరసం కలిపి పడుకునే ముందు జుత్తుకు, తలకు బాగా రాయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లతో కడిగేసి, మైల్డ్ షాంపూతో తలంటుకోండి. కొన్ని రోజులు ఇలా చేస్తే ఫలితం మీకే తెలుస్తుంది. - గోరింటాకు, మందార ఆకులు, కరివేపాకుల్ని సమపాళ్లలో తీసుకుని మెత్తగా రుబ్బాలి. దీన్ని తలకు రాసుకుని అరగంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తే తెల్లజుత్తు నల్లబడటమే కాదు, ఆరోగ్యంగా తయారవుతుంది కూడా. -Sameera N

How To Look Beautiful     Women are 10 useful tips that will make you look young and beautiful. * Beauty starts from within, so eat healthy and nutritious diet and do regular exercises.  * Make sure that you look clean and smell good always. Choose a perfume that suits you and apply it on wrists and neck. * Sleep well and drink lots of water daily, it will clean your body and make your skin look healthy and younger. It will also reduce under eye dark circle.  * Take care of your teeth and brush twice a day. * Keep your hair clean, wash them regularly. Find a good shampoo and conditioner that works well for your hair. Try natural products for better results.  * Try coloring your hair to cover grey hair, look trendy and fashionable. * Selective makeup and try to choose colors that suit your natural appearance and add compliments to it. Apply little mascara, kajal, lip gloss, blush for soft natural look.  * Moisturize your skin well after bathing so that it looks soft and healthy. * Wear a sunscreen lotion whenever you go out in the day to protect your skin from harmful UV radiations.  * Most important is to be confident about yourself because it is the best investment you can do.

ఇలా చేస్తే కళ్ళు అందంగా కనిపిస్తాయి...   అమ్మాయి అందాన్ని పొగడాలంటే ముందుగా కవులు పొగిడేది వాళ్ళ కళ్ళనే. కళ్ళు పెద్దగా ఉంటే చాలు అందం రెండింతలు ఎక్కువవుతుంది. మరి చిన్న కళ్ళు ఉన్న వాళ్ళ సంగతేంటి అంటే దానికీ ఉపాయాలు లేకపోలేదు. వేసుకునే మేకప్‌లో, తీసుకునే జాగ్రత్తల్లో కాస్త మెళకువలు పాటిస్తే చాలు చిన్న కళ్ళని కూడా పెద్దగా చూపించొచ్చు. అదేలాగో ఈ వీడియో చూడండి మీకు తెలుస్తోంది....  https://www.youtube.com/watch?v=Z_0qgDbf-Us    

చలికాలంలో పాదాలు జాగ్రత్త సుమా      చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చలికాలంలో పాదాలు, చేతులు రంగుమారిపోయి  పగుళ్లు వచ్చి చూడ్డానికి బాగా వుండవు. అలాగే నొప్పి కూడా వుంటుంది. అంతే కాదు ఈ సీజన్‌లో చర్మం ఎక్కువగా పొడిబారడం జరుగుతుంది. చర్మం అతి త్వరగా పొడిబారి, పగుళ్ళు ఏర్పడి, చారలు కనబడుతుంటాయి. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.  * పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో మూడు నాలుగుసార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్‌గా, ఫిట్‌గా, హెల్తీగా ఉంటాయి. * స్లిప్పర్స్  ధరించడం సౌకర్యంగానే  ఉంటుంది. కానీ, ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం మంచిది! చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే  మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి. * పాదాలు అందముగా కనిపించాలంటే పదిహేను రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్‌కు వెళ్ళనవసరం లేదు. ఇంట్లో ఉండే  వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకొని దానిలో కొంచెం ఉప్పు, డెట్టాల్, షాంపూ వేయాలి. తరువాత  20 నిమిషాలపాటు కాళ్లను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్‌తో  రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ  తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్‌తో కాలును  మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు. * వేసవికాలం, చలికాలం అని కాకుండా అన్ని సీజన్స్‌లో నీరు ఎక్కువగా తాగితే  మంచిది. చర్మం, పాదాలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి.    * పాదాల చాలామంది సాక్సులు వాడుతుంటారు. వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి వేసుకోవాలి . లేదంటే దుమ్ము, మురికి చేరి  చెమట పట్టినప్పుడు పాదాలకు ఇన్‌ఫెక్షన్ వచ్చే  ప్రమాదం ఉంటుంది. అలానే నైలాన్‌ సాక్సుల కంటే కాటన్‌వి సౌకర్యంగా ఉంటాయి. రాత్రిపూట తప్పనిసరిగా గోరువెచ్చటి నీళ్లతో కాళ్లు కడుక్కుని, మాయిశ్చరైజ్ ఇలా చేయటం వల్ల పాదాలు అందంగా కనిపిస్తాయి.

Ashadam Mehendi/Gorintaku Beauty Ritual   Ashadam Arachetha Gorintaku:It’s the ending of  Ashada Masam or the fourth month in the  traditional Hindu Telugu calendar which is followed by the Telugu people. Starting from June 28 it will end on July 26, 2014.  Some of the auspicious days in this month include Guru Purnima ,the beginning of Chatur Mas Vratam, Puri Jagannath Ratha Yatra and the Bonalu festival celebrated in Telangana state . Bonalu is celebrated to ward of any evil and diseases associated with the monsoons and the month of Ashadam also involves the new bride going back to her mother’s place and spending time with her family till this month is over.   Significance of Henna, Mehendi or Gorintaaku: Another wonderful part of the Ashadam tradition is that ladies put Henna, Mehendi or Gorintaaku on their hands and feet. There are many reasons why one should apply Henna, Mehendi or Gorintaaku, the foremost reason being that it is good for health as applying this on your hands and feet prevent infections and bacteria infecting the skin. Since it’s the monsoon season and you are prone to seasonal infections Henna, Mehendi or Gorintaaku works as an antibacterial which is good for the skin. Women in due course of their household work are in constant contact with water & grime and Henna, Mehendi or Gorintaaku prevents this. Apart from the health aspect putting Henna, Mehendi or Gorintaaku also adds beauty to your hands and feet. Other than the traditional moon and dots, you can put various Arabic , Rajasthani  and floral designs  on your hands and feet. For  more  Henna, Mehendi or Gorintaaku designs, check out the Aracheta Gorinta , Step By Step Easy Mehendi Designs For Beginners  tutorials for more ideas.

బ్లాక్ హెడ్స్ బాధ వదలాలంటే...!   తెల్లని ముఖ సౌందర్యాన్ని నల్లని బ్లాక్ హెడ్స్ చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి కదా! అయితే వీటిని మనం డిస్టర్బ్ చేస్తే మళ్లీ కనిపించకుండా మాయమైపోతాయి. అందుకే ఈ చిట్కాలు చకచకా పాటించేయండి. - బ్లాక్ హెడ్స్ ని డ్రైగా చేసే యాంటీసెప్టిక్ గుణాలు టొమాటోల్లో పుష్కలంగా ఉంటాయి. అందుకే రాత్రి పడుకోబోయే ముందు టొమాటో రసాన్ని ముఖమంతా రాసుకుని, ఉదయాన్నే లేచి కడిగేసుకోవాలి. ఒకట్రెండు వారాల పాటు ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ పొడిబారిపోయి రాలిపోతాయి.  - ఓట్స్ పొడిలో పెరుగు, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కలిపి ప్యాక్ వేసుకుని... బాగా ఆరిన తరువాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. తరచూ ఇలా చేస్తే మంచి ఫలితముంటుంది. - గ్రీన్ టీ ఆకుల్ని పొడి చేసి, కొంచెం నీళ్లు చేర్చి పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని రాసుకుంటే బ్లాక్ హెడ్స్ రాలిపోతాయి. - బేకింగ్ సోడాలో నిమ్మరసం కలిపి ముఖాన్ని మసాజ్ చేసుకున్నా సమస్య తీరిపోతుంది.  - దాల్చిన చెక్క పొడిలో తేనె కలిపి ముఖానికి పూసుకోవాలి. కాసేపటి తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. రోజు విడిచి రోజు ఇలా చేసినా చాలు.. బ్లాక్ హెడ్స్ బెడద తీరిపోతుంది. - గోరువెచ్చని పాలలో తేనె కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట పూయాలి. కాసేపటి తర్వాత పొడి బట్టతో ఆయా ప్రదేశాల్లో గట్టిగా ఒత్తుతూ తుడిస్తే బ్లాక్ హెడ్స్ ఊడిపోతాయి. - కోడిగుడ్డులో తేనె కలిపి వేసుకునే ప్యాక్ కూడా బ్లాక్ హెడ్స్ బాధను వదిలిస్తుంది   -Sameera N

అందమైన కురులు కావాలంటే....   మగువకు కురులే అందం అంటారు. కానీ పెరుగుతున్న కాలుష్యం, మానసిక ఒత్తిడి వంటివి ఆ అందానికి అన్యాయం చేస్తున్నాయి. ప్రతిరోజూ శిరోజాలు రాలిసోతోంటే దిగులుపడటం తప్ప ఏమీ చేయలేక దిగులుపడుతున్నారు ఎంతోమంది మహిళలు. నిజానికి  జుత్తు కాపాడుకోడానికి పెద్ద కష్టపడక్కర్లేదు.... ఏం చేయాలో ఏం చేయకూడదో తెలుసుకుంటే చాలు అంటున్నారు ప్రముఖ  సెటెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్ మార్క్ టౌన్సెన్డ్. అవేమిటో చూడండి... - జుత్తు పెరగడం లేదే అని బెంగపడటం కూడా జుత్తును పాడు చేసుకోవడమే. ఎక్కువగా దిగులు పడేవాళ్లు, ఒత్తిడి పడేవాళ్ల జుత్తు త్వరగా ఊడిపోవడమే కాదు, పెరిగే లక్షణాన్ని కూడా కోల్పోతుందట. మహా అయితే జుత్తు నెలకు అరంగుళం పెరుగుతుందంతే. కాబట్టి రాత్రికి రాత్రే పెరిగిపోవాలని ఆశపడటం అనవసరం. - జుత్తు కట్ చేస్తే పొట్టిగా అయిపోతుందని దిగులుపడుతుంటారు. కానీ జుత్తును ఎంతగా కత్తిరిస్తే అంతగా పెరుగుతుందన్నది నిజం. కాబట్టి పది పన్నెండు వారాలకోసారి జుత్తుని ఒక అంగుళం కత్తిరించడమే మంచిది. - ప్రతిరోజూ తలస్నానం చేయకూడదు. తలంటుకున్నప్పుడు మాత్రం మురికి పూర్తిగా వదిలేలా చూసుకోవాలి. అలాగే తలస్నానం చేసిన ప్రతిసారీ కండిషనర్ అప్లై చేయాలి. - వారానికోసారి తలకు బాగా నూనె పట్టించి మసాజ్ చేయాలి. దానివల్ల తలలో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తలపై ఉన్న చర్మంలో తేమ పెరుగుతుంది. అది జుత్తు పెరుగుదలకు దోహదపడుతుంది. - జుత్తును ఎడా పెడా దువ్వేయకూడదు, రుద్దేయకూడదు. కొందరు నూనె రాసుకునేటప్పుడు, దువ్వుకునేటప్పుడు జుత్తును అటూ ఇటూ వేసేస్తుంటారు. అది తప్పు. జుత్తును ఎప్పుడూ ఒకే డైరెక్షన్లో దువ్వుకోవాలి. అప్పుడే పాడవకుండా ఉంటుంది. ఎక్కువ రాలకుండానూ ఉంటుంది. - తలంటుకున్న తర్వాత జుత్తుని టవల్ తో మరీ గట్టిగా కట్టేసుకోకూడదు. తడిసిన జుత్తు చాలా బలహీనంగా ఉంటుంది. అలాంటప్పుడు బిగించి కట్టడం వల్ల చిట్లిపోవడం, తెగిపోవడం జరుగుతుంది. - మరీ వేడి నీటితో తలంటుకోకూడదు. చల్లని లేక గోరు వెచ్చని నీటితో మాత్రమే తలస్నానం చేయాలి. షాంపూని ఒకే పద్ధతిలో పెట్టుకోవాలి. మురికి పోవాలి కదా అని ఇష్టం వచ్చినట్టు రుద్దేసుకోకూడదు. - జుత్తుకీ దిండుకీ సంబంధం ఉందంటే మీరు నమ్మగలరా? కానీ ఉందట. గట్టిగా ఉండే దిండు మెడ, తల కండరాలకే కాదు... జుత్తుకి కూడా హాని చేస్తుందంటారు మార్క్. అందుకే మెత్తగా ఉండే దిండు మాత్రమే వాడాలి. అలాగే ఉన్ని, ఖద్దరు దిండు కవర్లు వాడకూడదు. అవి జుత్తుని డ్యామేజ్ చేస్తాయట. వీలైనంత వరకూ శాటిన్ కవర్లు వాడటమే మంచిదట. చూశారా! వీటిలో చాలా తప్పులు మనం చేస్తుంటాం. కొన్ని చేయాలని తెలిసి కూడా చేయకుండా దాటవేస్తుంటాం. అందమైన కురులు కావాలంటే నిర్లక్ష్యం తగదు. కాబట్టి ఇకనైనా జాగ్రత్తపడండి మరి! - Sameera

స్ట్రెచ్ మార్క్స్ పోవాలంటే...     డెలివరీ అయ్యాక మహిళలకు పెద్ద తలనొప్పి... స్ట్రెచ్ మార్క్స్. అవి ఓసారి వచ్చాయంటే ఓ పట్టాన పోవు. చర్మం బాగా సాగి మళ్లీ మామూలుగా అయ్యే క్రమంలో పడే ఈ గీతల్ని పోగొట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంటారు. డెలివరీ అనే కాదు... బాగా లావయ్యి, తర్వాత సన్నబడిన వారికి కూడా ఈ సమస్య ఉంటుంది. అయితే ఇది పరిష్కరించుకోలేనంత పెద్ద సమస్యేం కాదు. దానికి కొన్ని చిట్కాలున్నాయి.   - స్ట్రెచ్ మార్క్స్ పోగొట్టడంలో కోడిగుడ్డు మంచి ఎక్స్ పర్ట్. దీనిలో ఉండే విటమిన్ ఎ, ప్రొటీన్స్, అమైనో యాసిడ్స్ చర్మ కణాల ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా పని చేస్తాయి. అందుకే మార్క్స్ ఉన్నచోట కోడిగుడ్డు సొనతో తరచుగా రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. - అలొవెరా జెల్ లో ఉండే అలోసిన్ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఈ జెల్ లో కొద్దిగా ఆలివ్ ఆయిల్ కలిపి రోజూ పడుకోబోయే ముందు రాసుకుంటే... కొన్నాళ్లకు సమస్య తీరిపోతుంది. - నిమ్మచెక్క పెట్టి తరచుగా రుద్దుకుంటూ ఉన్నా మంచిదే. - ఆలివ్ ఆయిల్, బాదం ఆయిల్ మసాజ్ లు కూడా స్ట్రెచ్ మార్క్స్ ని పోగొట్టి, చర్మం ఎప్పటిలాగా అయ్యేందుకు దోహదపడతాయి. - బంగాళాదుంపని బాగా గ్రైండ్ చేసి రసాన్ని తీయాలి. ఈ రసంతో మార్క్స్ ఉన్నచోట బాగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే అతి తక్కువ సమయంలోనే అవి పోతాయి. - ఆముదం కూడా స్ట్రెచ్ మార్క్స్ కి మంచి మందు. - పంచదారలో కొంచెం నిమ్మరసం కానీ కాస్తంత బాదం నూనె కానీ కలిపి రుద్దినా మంచి ఫలితం ఉంటుంది. ఇన్ని మార్గాలు ఉండగా స్ట్రెచ్ మార్క్స్ గురించి చింత ఎందుకు? వీటిని ఫాలో అవ్వండి... వాటిని వదిలించుకోండి. - Sameera

గుడ్డుతో అందానికి మెరుగులు     గుడ్డు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదే అంటున్నారు నిపుణులు. ఇంట్లో నే అందానికి గుడ్డుతో మెరుగులు పెట్టుకోవటానికి కొన్ని మార్గాలు.. ఇవి.. *గుడ్డులోని తెల్ల సొనకి అరచెమ్చా నిమ్మరసం, చాలా తక్కువగా తేనె, ( పావు చెమ్చా కి సగం ), కలిపి ముఖానికి పట్టించి ఒక పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగితే ముఖం కాంతివంతంగా మారుతుంది . చర్మం రంద్రాలు తెరుచుకునేలా చేసే ఈ ప్యాక్ కంటికింది వలయాలు, ముఖం మీది మచ్చలని కూడా దూరం చేస్తుంది.     *  తెల్ల సోనకి ఒక చెంచా పాలు, ఒక చెంచా క్యారట్ తురుము కలిపి ముఖానికి ప్యాక్ లా వేసుకుని పావుగంట వుంచుకోవాలి. యాంటీ ఏజింగ్ ప్యాక్ ఇది. చర్మం నిగనిగ లాడేలా చేస్తుంది. * అలాగే పచ్చ  సోనకి  తేనెతో పాటు రెండు చెంచాల పెరుగు కూడా కలిపి ముఖానికి రాసుకుని ఓ పావుగంట తర్వాత కడుగుకుంటే.. చర్మం బిగుతుగా మారుతుంది . * చర్మం పొడి పొడి గా వుండి, దాని వాల్ల ఇబ్బంది పడేవారు పచ్చ సొనకి చెంచా తేనె కలిపి రాసుకుని.. పావుగంట తర్వాత కడిగితే మంచి ఫలితం వుంటుంది.     * అలాగే పచ్చసోనలో ముల్తాని మిట్టి ని కలిపి రాసుకుంటే జిడ్డు చర్మం బాధ నుంచి తప్పించుకోవచ్చు. * ఒట్టి తెల్ల సొనని  బాగా గిలక్కొట్టి ముఖానికి పట్టించి వుంచి, అది ఆరాకా కడిగి చూడండి. ముఖం లో మంచి కాంతి కనిపిస్తుంది. ఎక్కడికి అయినా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ పాక్ వేసుకుంటే, త్వరగా అయిపోతుంది., మంచి ఫలితం కూడా వుంటుంది.

Take Care of Those Eyelashes!     Long and thick eyelashes are every woman’s priced possession. Apart from being lucky enough to have naturally long and thick lashes it is also important to take care of these little ones! Use of lash comb or a clean or unused mascara brush can be used to clean and com them. This prevents premature breakage and also strengthens them, however over brushing can loosen lashes. It is very important to take off the makeup before going to bed, you can use makeup remover or more organic removal will be with olive oil. If left on will lead to eye infections and weakening followed by breakage. Every time you use a curler make sure it is disinfected well, as accumulated makeup stuff is a breeding place for germs. Try avoiding fake eyelashes, glue weakens the roots sooner or later your lashes may fallout, moreover while peeling off the glue it might pull few along. If you are accustomed to use mascara frequently, then once in a while give your eyelashes some fresh air too. Make sure you keep your dirty hands off your eyes, to avoid infection. Condition your eyelashes with castor oil, coconut oil or petroleum jelly to eye lashes before sleeping and just rinsing the conditioning treatment in the morning. We can use cotton ball, mascara brush or Q-tip as applicator. Results will start to show in two to three months. We should enrich our diet with Vitamin C, D, E and H. Include kiwi, oranges and watermelons, for good amounts of Vitamin C for healthy hair. Vitamin D strengthens the hair found in cheese, fish and cereals. Vitamin H helps rebuild hair that is already dry and splitting, it revives your eye lashes to its healthy fullness, found in good quantities in mushrooms and whole grains. - Koya Satyasri