చిన్నపిల్లలకి బ్రేక్ ఫాస్ట్ గా ఇలాంటి ఆహారం ఇవ్వాలి...   Why is breakfast so important for kids? Constant glucose supply is very important for the proper functioning of Brain & if proper, nutritious breakfast is not given to kids – Brain functioning will not be proper says Dr. Srilatha. To know what can be included in kids breakfast, watch the video... https://www.youtube.com/watch?v=tVBgNDOA6n8  

  పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే...?     వయసు పెరిగేకొద్దీ జ్ఞాపకశక్తి తగ్గుతుంటుంది. దీనితో పలు ఇబ్బందులు ఏర్పడుతుంటాయి. సాధారణంగా పిల్లలు చదివిన విషయాలను గుర్తుంచుకుంటారేమో గానీ, అదే పరీక్ష సమయంలో చదివిన విషయాలను మరచిపోతుంటారు. పరీక్షలొస్తున్నాయంటే చాలు పిల్లలు మానసిక ఆందోళనకు, ఒత్తిడికి గురవుతుంటారు. వాళ్ళు మామూలు సమయాల్లో ఎంత బాగా చదివినా, ఆందోళన వల్ల, భయం వల్ల పరీక్షల్లో తగిన ఫలితాన్ని సాధించలేకపోతారు. ఇలాంటి పిల్లల కోసం తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటే చూద్దామా....!   * పరీక్షలు సమీపిస్తున్నాయంటే పిల్లల్లో ఒక విధమైన భయానికి లోనవుతుంటారు. అలాంటి వారికి పోషకాలు గల ఆహారం వారి తల్లిదండ్రులు తప్పక ఇవ్వాలి. * పిల్లలకు మంచి ఆహారంతోపాటు విటమిన్‌ బి12, విటమిన్‌బి6, విటమిన్‌ సి, ఇ, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. * పరీక్షల సమయంలో కొవ్వు పదార్థాలను వీలైనంతవరకు తగ్గించడం చాలా మంచిది. ఎక్కువ ఫ్యాట్‌ ఉండే పదార్థాలను తీసుకోవడం వల్ల చురుకుదనం లోపిస్తుంది. * నేరేడు పండులో జ్ఞాపకశక్తిని పెంచే యాంటీ యాక్సిడెంట్లు ఎక్కువగా వుంటాయి. ద్రాక్ష, చెర్రీస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ అధికంగా ఉండడం వల్ల రోజూ ఒక గ్లాస్‌ ద్రాక్ష జ్యూస్‌ తీసుకోవడం ఎంతో మంచిది. * అలాగే ఆపిల్స్‌లో కూడా విటమిన్లతోపాటు కాల్షియం, క్వెర్‌సిటిన్‌, ఆంథోసియానిన్‌ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మతిమరుపు సమస్యను తప్పించుకోవచ్చు. * ఇక పాలకూర వాడకం కూడా జ్ఞాపకశక్తిని పెంపొందిస్తుంది. బొప్పాయి, అరటిపండులో ఉన్న పోలేట్‌, మెగ్నీషియం, పోటాషియం, విటమిన్‌ బి6 మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్లలోని పిండిపదార్థం మెదడును ఎక్కువసేపు చురుకుగా ఉండేటట్లు చేస్తాయి. * తేనె వాడకం వల్ల యాంగ్జైటీ తగ్గి జ్ఞాపకశక్తి వృద్ది చెందుతుంది. పిల్లల్లో జ్ఞాపకశక్తి పెంపొందాలంటే, వారు పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే వారికి పోషకాహారం తప్పక అందించాలి.  

  చిన్న పిల్లలకు ఏర్పడే ప్రమాదాలు     చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పెద్దలు, పిల్లలను ఓ కంటకనిపెడుతూ ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నారులకు అపాయాన్ని గురించి ఆలోచించే వయస్సుండదు. అనుకోకుండా కొన్ని ప్రమాదాలు ఏర్పడితే, మరికొన్నింటిని ప్రమాదమేమో అని తెలియకుండా కొని తెచ్చుకునేవి కొన్ని. పిల్లలకు ప్రమాదం కలిగితే పెద్దలు అతిగాభరా పడుతూ పిల్లల్లో భయాన్ని కలిగించకుండా, వెంటనే ప్రథమచికిత్స పద్ధతులను పాటించాలి.   ఆ తర్వాత పిల్లల వైద్యునికి చూపించి, అవసరమయితే చికిత్సచేయించాలి. మందులు వాడాలి. అందువల్ల, ఏ ప్రమాదానికి ఏవిధమైన ప్రథమ చికిత్స జరపవలసినదీ పెద్దలకు సరైన అవగాహన ఉండాలి జారిపడితే : పిల్లలు నేలమీద, మెట్లమీద నుంచి ఎత్తుగా ఉండే అరుగుల మీద నుండి జారిపడి దెబ్బలు తగుల్చుకోవచ్చు. దెబ్బ తగిలిన నొప్పికంటే, భయంతో పిల్లలు ఏడ్చేస్తారు. పిల్లల ఏడుపునకు కంగారు పడకూడదు. పిల్లలను భయపడవద్దని బుజ్జగిస్తూ, ఏం జరిగిందో, ఎక్కడ ఏవిధంగా పడిందీ, దెబ్బ ఎక్కడ తగిలిందీ తెలుసుకోవాలి. చర్మం చీరుకుపోయి రక్తం వస్తుంటే డెట్టాల్‌ నీటితో చర్మాన్ని శుభ్రంగా కడిగి, టించర్‌ను దూదితో అద్దాలి. రక్తం ఆగకుండా వస్తుంటే, తడిబట్టతో కొంతసేపు నొక్కి ఉంచాలి. ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి వైద్య సలహా ప్రకారంగా కట్టుకట్టించడమో, మందులు ఇవ్వడమో చేయాలి.   కాలినప్పుడు : చిన్నారులను వేడి వస్తువుల దగ్గరకు రానీయకుండా, వంటింట్లో పరుగులు తీయకుండా చూసుకుంటుండాలి. వేడి నీళ్ళతో ఆడాలని చేయి పెట్టినా చేతులు కాలి, లేత చర్మానికి బొబ్బలొస్తాయి.. వెంటనే పిల్లల చేతులు మీద ధారగా చన్నీళ్ళను పోయాలి. ఆ తర్వాత చల్లని నీళ్ళతో తడిపిన బట్టను చర్మం మీద ఉంచి, వెంటనే డాక్టర్‌ వద్దకు తీసుకెళ్ళాలి. చిన్నపిల్లలకు అందనంత ఎత్తులో వేడి కుక్కర్‌ను, వేడి పాత్రలను, బాణలిలాంటి వాటిని ఉంచాలి. డైనింగ్‌ టేబుల్‌ మీద, టేబుల్‌ క్లాత్‌కు క్రిందకు వేలాడుతున్నట్లుగా వేయకూడదు.   చిన్నపిల్లలున్న ఇంట్లో, ఆ టేబుల్‌ క్లాత్‌ను పిల్లలు లాగి, టేబుల్‌ మీద ఉం చిన పాత్రలను, వేడి పదార్థాలను మీద వేసుకునే ప్రమాదం ఉంటుంది. వారి చర్మం కాలే ప్రమాదముంటుంది. పిల్లలకు చర్మంకాలినప్పుడు చర్మం మీద చల్లటి నీటిని ధారగాపోయడమే సరైన పద్ధతి. తేనె పూయడం లాంటివి చేయకూడదు. డాక్టర్‌కు చూపించాలి. వెంటనే, బొబ్బలను చిదపకూడదు. చర్మాన్ని రబ్‌చేయకూడదు.   సుకుంటే : పెద్దల నిర్లక్ష్యం, అశ్రద్ధ, మతిమరుపు వల్ల కూడా చిన్నారులకు పదునైన వస్తువులు కోసుకునే ప్రమాదం వుంది. కూరలు తరిగే కత్తిపీట, చాకు, కత్తెర, బ్లేడు లాంటి పరికరాలను వాడిన తర్వాత, వాటిని పిల్లలకు అందుబాటులో లేకుండా జాగ్రత్తగా ఉంచాలిపిల్లలు ఆడే ఆట వస్తువుల వల్ల కూడా వారికి చర్మం కోసుకుని లోతుగా దిగే ప్రమాదం ఏర్పడ వచ్చు. పదునుగా వుండే ఆట వస్తు వులు, రేకు లున్న ఇనుప బొమ్మలు, మేకులు, స్క్రూలు లాంటివి ఉన్న బొమ్మలు పిల్లలకు ఆటవస్తువులుగా కొనకూడదు. ఇవ్వకూడదు. గాజు సీసాలు, గాజుపాత్రలు పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచాలి. పొరపాటుగా పిల్లలు కోసుకుని నెత్తురు కారుతుంటే, చల్లటి నీటితో తడిపిన బట్టను చుట్టాలి. లేదా ఐస్‌ ముక్కలను బట్టలో ఉంచి రక్తం కారుతున్న ప్రదేశంలో ఒత్తిపెట్టి ఉంచితే రక్తం కారటం ఆగిపోతుంది. లోతుగా కోసుకుంటే! ఆ భాగాన్ని ఎత్తుగా వుంచి, చల్లటినీటితో తడిసిన బట్టను ఉంచాలి. రక్తస్రావం ఆగిపోయిన తర్వాత, పరిశుభ్రమైన బట్టతో తెగిన ప్రదేశంలో చర్మాన్ని కప్పి, ఒదులుగా చుట్టి, ఆ తర్వాత వైద్యుని వద్దకు తీసుకువెళ్ళి చూపించి, వైద్య సలహా తీసుకోవాలి. అవసరమైన చికిత్సను చేయించాలి.   కీటకాలు కుడితే : కొన్ని రకాల కీటకాలలో కొంత విషపదార్థం ఉంటుంది. అటువంటి విషకీటకాలు కుడితే పిల్లలకు ఎలర్జీ కలిగి, ఆ తర్వాత కుట్టిన చర్మం మీద అమిత బాధకలుగుతుంది. గొంగళి పురుగులు లాంటివి కుడితే, చర్మం మీద పాకితే దురదలు, దద్దుర్లు వచ్చి పిల్లలకు బాధ కలుగుతుంది. అప్పుడు, గోరువెచ్చని నీటితో స్నానం చేయించి, దద్దుర్లు, దురద తగ్గటానికి గొంగళిపురుగు పాకిన ప్రదేశంలో విభూదిని బాగా రుద్దాలి. కొన్ని విషకీటకాలు కుడితే ఎలర్జీ ఏర్పడటమే కాకుండా, మరికొన్ని తీవ్రమైన మార్పులు వస్తాయి. దద్దుర్లు ఎర్రగా మారినప్పుడు, ఊపిరి పీల్చుకోవడంతో ఇబ్బంది కలిగినప్పుడు పెదాలు నల్లబడటం, నాలుక తడారిపోవడం లాంటి లక్షణాలు ఏర్పడితే ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్ళాలి. అవసరమైన వైద్య సహాయాన్ని పిల్లలకు అందించాలి.   మందులు, రసాయనాలు : మందులు, క్లీనింగ్‌లోషన్స్‌ పిల్లలకు అందనంత ఎత్తుగా ఉంచాలి. పిల్లలు ఏమైనా మందులు తాగినా, మందుబిళ్ళలు తిన్నా వాటిని కక్కించాలని, ఉప్పునీళ్ళు త్రాగించడం, మంచినీళ్ళు ఎక్కువగా త్రాగించడం చేయకూడదు. అలా చేసినట్లయితే కడుపులో చేరిన మందులు, వెంటనే రక్తంలో చేరే ప్రమాదం ఉంది. బిడ్డకు ప్రాణాపాయ స్థితి ఏర్పడవచ్చు. ఇటువంటివి జరిగినప్పుడు, తక్షణమే వైద్య సహాయం పొందడం చాల అవసరం. కీటకాలను సంహరించే మందులను అమిత భద్రంగా ఉంచాలి. మందును స్ప్రే చేసినప్పుడు పిల్లలను ఆ ప్రదేశానికి దూరంగా ఉంచాలి. దోమలు, నల్లులు, ఎలుకలు, బొద్దింకలు చీమల సంహారక మందులను పిల్లలు నిద్ర పోయిన తర్వాత ఉపయోగించి, పిల్లలు నిద్రలేవకుండా క్లీన్‌ చేసేయ్యాలి.   వాటిని పిల్లలకు తెలియకుండా దాచాలి. పిల్లలకు ఏర్పడే కొన్ని ప్రమాదాలకు తక్షణ ప్రథమచికిత్స చేయాలి. మరికొన్ని ప్రమాదాలకు ఎంతమాత్రం ఆలస్యం జరగకుండా వైద్య చికిత్స జరగాలి. ముఖ్యంగా, పిల్లలకు ప్రమాదాలు జరిగినప్పుడు పెద్దలు, ఆందోళన, గాభరా పిల్లల ఎదుట ప్రదర్శించకూడదు. పనులు చేసే టప్పుడు చిన్న పిల్లలున్నారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరుపు, అ శ్రద్ధ, నిర్లక్ష్యం లేకుండా ప్రవర్తించాలి. పిల్లలకు జరిగే ప్రమాదాలు ప్రాణా పాయ స్థితికి చేరకుండా తక్షణమే, చర్యలు తీసుకోవాలి.  

థాయ్ పిల్లలు మనకు ఏం నేర్పిస్తున్నారో తెలుసా...?     పన్నెండు మంది పిల్లలు మరియు కోచ్ సురక్షితంగా బయట పడ్డారు అని వినగానే అందరం అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాం. వారిని రక్షించిన వారికి జేజేలు పలికాము. సోషల్ మీడియా లో మన హర్షాతిరేకాలని ప్రకటించాము.మన దేశం లో అయితే అసలు ఆ పిల్లలని మనం రక్షించలేక పోయేవాళ్ళం అని కూడా  పోస్ట్ లు పెట్టేసాము .  ప్రభుత్వం కి అంత సమర్ధత లేదు అని నిర్దారించి తీర్పు ఇచ్చాం కరెక్టే కాని , మనం పెంచే పిల్లలులో ఆ పిల్లలలో ఉన్నంత మానసిక స్థైర్యం , శారీరక సామర్ధ్యం ఉందా ? అని ఎవరికీ వాళ్ళం ఒక్కసారి ప్రశ్నించు కున్నామా ?     ప్రతికూల పరిస్తితులులో కూడా ఎక్కడా బెదరకుండా , రేపటికి ప్రాణాలతో ఉంటామో లేదో , అసలు ఇక్కడ నుంచి బయట పడతామో లేదో అన్న స్థితిలో కూడా నిబ్బరంగా వుండటం అంటే మాటలా ? ఇన్ని రోజులలో ఇన్ని వార్తలు చూసాము కదా , ఎక్కడైనా పిల్లలు ఏడుస్తున్నారు అని కాని , భయ పడిపోయి వున్నారని కాని చదివామా ? ఎంత వాళ్ళ వయసు ? పట్టుమని పదిహేను ఏళ్ళు లేవు . ఎక్కడ నుంచి వచ్చింది వాళ్ళకంత ధైర్యం ? ఏ ట్రైనింగ్ తీసుకున్నారని మృత్యువు అంచుల దాకా వెళ్లి , దానిని ఓడించి రాగలిగారు ?     మన ప్రభుత్వం ఎంత చేతనైనదో వాక్యానించే ముందు , అసలు మనం ఎంత అద్బుతమైన పేరెంటింగ్ చేస్తున్నామో చూసుకుంటే రేపటి రోజున పరీక్ష బాగా రాయలేదని అమ్మా నాన్నలకి ఎదురుపడటానికి కూడా దైర్యం లేక పరీక్ష హాలు మీద నుంచి దూకి ప్రాణాలు వదిలేసే అమ్మాయి కోసం ఇంకో సారి వినాల్సిన అవసరం రాదు . చిన్న తరగతులు నుంచి పెద్ద తరగతులు వరకు ఎక్కడ పరీక్ష తప్పినా చావే పరిష్కారం . ఉద్యోగం నుంచి ప్రేమ దాకా ఎక్కడ ఓడిపోయినా చావే పరిష్కారం . ఇది కదా ఇప్పుడు మనం చూస్తోంది మన సమాజం లో ? ఇలా కదా మనం పెంచుతోంది ఈ తరాన్ని ? ఇదే కదా మన వాస్తవం?     ఒక్కసారి ఆలోచించండి . ఎక్కడ వుంది పొరపాటు ?  అందరికి తెలిసిన రహస్యం అది.   అయినా నిర్లక్ష్యం . మనం మారం . మానసిక నిపుణులు మొత్తుకుంటున్నారు . పిల్లల ఎదుగుదల అంటే చదువు, మార్కులు , పెద్ద ఉద్యోగం , జీతం మాత్రమె కాదు ...జీవితాన్ని జీవించటం నేర్చుకోవటం అని . ఆ జీవించటం తెలిస్తే చాలు . అందులోనే ఓటమిని ఎదుర్కోవటం , ప్రతికూల పరిస్తుతులలో కూడా నమ్మకం తో వుండటం , మృత్యువు ఎదురైనా చిరునవ్వుతో రాను పొమ్మని చెప్పగలిగే దైర్యం అన్నీ, అన్నీ వుంటాయి . ఇవి కదా మనం పిల్లలకి నేర్పించాల్సింది . ఇవి మాత్రమె కదా పసి వారిని ఆనందం గా , ఆహ్లాదం గా , దైర్యం గా రేపటిని ఎదుర్కునేలా చేసేది . తెలిసీ మనం ఎందుకు తప్పు చేస్తున్నాము .? తెలిసీ మనం మన పసివారిని ఎందుకు నిర్వీర్యుల్ని , నిరాశా వాదులని చేస్తున్నాము ?     ఒక్కసారి మనం మన పిల్లలకి థాయ్ పిల్లల కథని చెబుదాము . ఆ సాహసాన్ని , ఆ దైర్యాన్ని చూసి నేర్చుకోమని చెబుదాము . అంత దైర్య వంతులుగా మన పిల్లలు కూడా మారేలా చేద్దాము .అంతే కాదు  మానసిక స్థైర్యం తో పాటు ఆ పిల్లల శారీరక ద్రుడత్వం ని కూడా ప్రపంచం కొనియాడుతోంది . అది గమనించుదాము. కేవలం పుస్తకాలే కాకుండా పిల్లల ప్రపంచం ఇంకా చాలా ఉంటుందని గ్రహిద్దాము . ఆటలు వాళ్ళని మానసికం గా , శారీరకం గా ఎంతో  దృడం గా వుంచుతాయని ఒప్పుకున్దాము. రేపటి రోజున మన పిల్లలు అలాంటి గుహలో ఇరుక్కోక పోవచ్చు ., కాని జీవితం అనే గుహ కూడా చాలా సార్లు సమస్యలతో బయటకి వచ్చే దారులని మూసేస్తుంది . ఊపిరి అందకుండా చేస్తుంది . రక్షించటానికి ఎవరు ముందుకి రాకపోవచ్చు ., తప్పించుకునే దారి కనిపించక పోవచ్చు .అయినా కూడా ఎక్కడా అదరక, బెదరక దైర్యంగా జీవిత పద్మవ్యూహాన్ని చేదించి విజేతలుగా నిలవాలంటే మనం మారక తప్పదు. ఆలోచించండి. - రమ

నిత్య నేర్పిన జీవిత పాఠం   1 * మొన్న మా పక్కింటి పాపాయి నుంచి నేనో మంచి విషయం నేర్చుకున్నానండి. ఏడేళ్ళు వుంటాయి 2వ తరగతి చదువుతోంది- వాళ్ళ క్లాసు వాళ్ళని పిక్నిక్ కి తీసుకువెళ్తున్నారని పదిరోజుల ముందు నుంచి అపార్ట్ మెంట్ అంతా తిరిగి అందరికి చెప్పింది. అరోజు తేసుకువెళ్ళటానికి కొత్త బ్యాగు,లంచ్ బాక్సు వంటివి వాళ్ళమ్మతో కొనిపించుకుంది. తీరా పిక్నిక్ ఒకరోజు ముందు తనకి విపరీతమైన జ్వరం. మర్నాటికి ఏమాత్రం తగ్గినా పంపిచేస్తానంది వాళ్ళ అమ్మ. కాని పాపం తగ్గలేదు. మర్నాడు ఉదయం 6 గంటలకి తను స్కూలు దగ్గరకి వెళ్ళాలి. వెళ్ళుతుందో, లేదో,తనకి ఎలా వుందో కనుక్కుందామని వాళ్ళంటికి వెళ్ళాను. అప్పటికే లేచి సోఫాలో కుర్చుని వుంది. ఇంకా జ్వరం తగ్గలేదు, నాకు చాలా బాదేసింది. పాపం ఎప్పటినుంచో సరదా పడుతోంది కదా అనిపించింది. 2  *  మా పక్కింటి నిత్య వాళ్ళ అమ్మ కళ్ళల్లో అయితే కన్నీళ్ళు ఆగటం లేదు. ఎంత సరదా పడిందో, ఇప్పుడే రావాలా ఈ జ్వరం. లాస్ట్ ఇయర్ నేనే చిన్నదని పంపించలేదు. ఈ సంవత్సరం ఇలా అయ్యింది పాపం. అంటూ ఆమె కన్నీళ్ళు పెట్టుకోగానే ఆ సిసింద్రీ టక్కున లేచి వాళ్ళమ్మ మెడచుట్టూ చేతులు వేసి ఏమందో తెలుసా "అమ్మ నా ఫ్రెండ్స్ తో పిక్నిక్ కి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకన్నాను. కాని కుదరలేదు కదా ఈరోజు అమ్మతో పిక్నిక్ చేసుకుంటాను. ఏముంది అందులో. " నేనూ, వాళ్ళమ్మ ఒక్క నిమిషం అలా నిలబడిపోయాం. ఎక్కడ అది ఏడ్చి గోల చేస్తుందో అని నేనూ ఎంత భయపడ్డానో, అలాంటిది అంత తేలికగా తను అలా అనేసరికి భలే ఆశ్చర్యపోయాను. అనటమే కాదు తను అరోజుంతా వాళ్ళమ్మతో ఎంచక్కా ఎంజాయ్ చేసింది కూడా. 3 * ఒకోసారి పిల్లలు మనకి జీవితపాటాలని నేర్పిస్తారు. తను కోరుకున్నది జరగకపోయినా తను ఆనందంగా ఉండగలనని చెప్పకనే చెప్పింది మా నిత్య. తను కొనుక్కున కొత్త బ్యాగులో బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ వంటివి పెట్టుకుని వచ్చి వాళ్ళమ్మని కూడా బాగా తయారవ్వమని వాళ్ళ బాల్కనీలో పాటలు పెట్టుకుని అక్కడే టిఫిన్, భోజనం చేసి వాళ్ళమ్మతో రకరకాల గేమ్స్ అడుకుందట సాయంత్రం దాకా.  పైగా ఫొటోలు కూడా తీయమందట, మర్నాడు వాళ్ళమ్మగారు ఈ విశేషాలన్ని చెబుతూ, నా కూతురుతో నాకు ఇది ఓ మంచి అనుభవం. ఎంత ఎంజాయ్ చేసానో చెప్పలేను. తన ప్రవర్తన చూసి గర్వపడుతున్నాను అని చెప్పరు. 4 * ఎన్నోసార్లు మనం కోరుకున్నవి, కోరుకున్నట్టు జరగకపోతే ఎంతో మదనపడిపోతాం. వెంటనే చిరాకు, కోపం వచ్చేస్తాయి. ఎప్పుడూ ఇంతే అంటూ మన జీవితాన్ని, కాలాన్ని నిందిస్తాం. కాని పోనిలే కోరుకున్న విధంగా జరగ పోతేనేం, జరుగుతున్న దానిని ఆనందంగా స్వీకరిద్దాం అని ఆలోచించం. నిత్య ఇంట్లో ఉన్న సమయాన్ని ఏడుస్తూ గడపలేదు. తనుకున్న అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంది. వాళ్ళమ్మతో కలసి ఓ రోజంతా హాయిగా గడపచ్చు అనుకుంది. అలాగే చేసింది కూడా ఆరోజు తన దృష్టిలో ఆనందంగా గడిపినట్టే. తను ముందు నుంచి కోరుకున్నట్టు కాకపోయినా సరే ఆరోజు ఓ మంచి జ్ఞాపకంగా మిగుల్చుకోగలిగింది. 5 * మన జీవితపు ప్రయత్నంలో అన్ని అనుకున్నట్టు, మనం ఆశించినట్టు జరగవు ఒక్కోసారి. అంతమాత్రాన చిన్నబుచ్చుకుని, మనసుని కష్టపెట్టుకోనక్కర్లేదు. జరగని విషయాన్ని పదే పదే గుర్తుచేసుకుంటే  వేరే దారులు కనిపించవు ఎప్పటికి, సరే ఈ దారి పూర్తిగా మూసుకుపోయింది, మరి వేరే దారి ఉందేమో చూద్దాం అనుకుంటే తప్పకుండా వేరే దారి కనిపించక మానదు. మనం గట్టిగ కళ్ళుమూసుకుని దారులన్ని ముసుకుపోయాయినుకుంటే ఎప్పటికీ మూసుకునే వుంటాయి. మన అడుగుల వడిని అపే అడ్డంకి ఏదైనా ఎదురయితే మరింత ఉత్సహంగా వేరే దారి వైపు వడివడిగా అడుగులు వేయగలిగితే మనకి " జీవించటం" వచ్చినట్టే. -రమ

అనుబంధంతో అల్లుకోండి   పిల్లలతో మంచి అనుబంధం పెంచుకోవాలంటే ఏం చేయాలి..? అమ్మలందరి ప్రశ్న అదే... ఎందుకంటే వాళ్ళని బెదిరించి, బయపెట్టి మాట వినేలా చేసే రోజులు పోయాయి. చిన్నతనంలో అమ్మ ఏం చెబితే అదే వేదం. అమ్మ చెంగుపట్టుకు తిరుగుతూ, అమ్మ చెప్పే కథలు వింటూ.. అమ్మే లోకంగా వుంటారు పిల్లలు. ఆ సమయంలో నయాన్నో, భయాన్నో వాళ్ళు చెప్పినట్టు వినేలా చేయచ్చు. కాని కాస్త పెరిగి ప్రిటీన్స్ లోకి వచ్చాకా, ఎదురుతిర గటాలు, అలకలు, అబ్బో అమ్మకి బోల్డంత ఓపిక కావాలి. కానీ ఆ పేచీలు లేకుండా చేయటానికి కొన్ని చిట్కాలు వున్నాయి. వాటితో పిల్లలతో అనుబంధం కూడా పెరుగుతుంది.. దాంతో పేచీలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు.. నిజానికి అమ్మలందరికి ఈ చిట్కా తెలిసే వుంటుంది. కాని పని కుదరదనో, ఇంకేదో కారణాలు చెప్పి తప్పించుకుంటారు. అలా కాకుండా... అది చాలా ముఖ్యమైనది అని గుర్తించి పాటిస్తే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి... అని భరోసా ఇస్తున్నారు నిపుణులు. మరి వారు సూచిస్తున్న ఆ సూత్రాలు ఏంటో చెప్పనా ... పిల్లలతో సమయం గడపటం :- ఈ మాట చెప్పగానే... రోజు చేసేది అదే కదా అంటారని తెలుసు...కాని సమయం గడపటం అంటే... రోజూ వారి పనుల మద్య వాళ్ళతో మాట్లాడటం కాదు.. అచ్చంగా వాళ్ళతో మాత్రమే గడపటం. దానికి అమ్మ కొన్ని సమయాలని ఫిక్స్ చేసుకోవాలి. సాధారణంగా ఉదయాన్నే నిద్రలేపేటప్పుడు.. హడావుడిగా టైం అయిపోయింది అంటూ పిల్లలని లేపుతుంటారు.. అలా కాకుండా, ఓ పది నిమిషాల ముందు పిల్లలని లేపండి. పక్కన కూర్చుని ఓ నాలుగు మాటలు సరదాగా మాట్లాడండి, అప్పుడు చూడండి చక, చకా ఎలా రెడీ అవుతారో... అలాగే ఉదయం వాళ్ళు వెళ్ళేదాకా వాళ్ళతో అవి, ఇవి మాట్లాడుతూ వుండాలి. అవి చాలా సాధారణ విషయాలు.. పేపర్ లో న్యూస్ గురించో, ఇంట్లో మొక్కల గురించో, వాళ్ళ ఫ్రెండ్స్ గురించో చాలా, చాలా క్యాజ్యువల్ టాక్ జరగాలి.  ఇక వీలైతే కాకుండా, వీలు చేసుకుని మరీ పిల్లలతో ఆడిపాడాలి. ఆటలు పిల్లలతోనా? అనద్దు.. క్రికెట్ నుంచి షటిల్ దాకా, అలాగే కారమ్స్, యూనో ఇలా ఎన్నో గేమ్స్ వున్నాయి .. వాటిలో ఏదో ఒకటి ఆడండి. మ్యూజిక్ వినటం ఇష్టంగా వుంటుంది పిల్లలకి. వాళ్ళతో కలసి పాటలు వినటం, వాళ్ళు డాన్స్ చేస్తుంటే చేయలేకపోయినా చూడటం అన్నా చేయాలి. ఇక రంగులంటే పిల్లలతో పాటు మనకి ఇష్టమేగా.. డ్రాయింగ్, కలరింగ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఇలా పిల్లలతో కలసి ఏమేం చేయచ్చో అన్నీ చేయటమే. సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళకి ఓ ఫ్రెండ్ లా వాళ్ళ అల్లరిలో భాగం కావాలి. దీని వల్ల లాభం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఒక్కసారి చేసి చూడండి.. పిల్లలు ఎలా అమ్మా, అమ్మా అంటూ చుట్టూ తిరుగుతారో చూడండి. వాళ్ళకి కావాల్సింది ఓ ఫ్రెండ్ లాంటి అమ్మ. ఎప్పుడూ ప్రశ్నలు వేస్తూ, జాగ్రత్తలు చెబుతూ, అప్పుడప్పుడు కోప్పడుతూ, అమ్మ వాళ్ళకి పరాయిగా కనిపిస్తుంది. అర్ధం చేసుకోదు అనుకుంటారు. కాదు బంగారం నీతోనే నేనూ.. నీలా ఆడిపాడి అల్లరి చేస్తాను.. అని వాళ్ళకి తెలిసేలా చేస్తే చాలు... పసివాళ్ళుగా మారిపోయి గారాబాలు పోతారు. ఎంతయినా, ఎన్ని వున్నా వాళ్ళకి కావాల్సింది అమ్మే. ఆ అమ్మ పెద్దయ్యారు అంటూ మీ పనులు మీరు చేసుకోండి, మీ ఆటలు మీరు ఆడుకోండి అంటుంటే, అమ్మ కావాలి అని బయటకి చెప్పటం ఎలాగో తెలియక మొండికేస్తుంటారు. అది పోవాలంటే మళ్ళీ చిన్న పిల్లలప్పుడు పిల్లలతో ఎలా ఎలా ఆడిపాడారో అలా చేయటమే. -రమ

కడుపులోని బిడ్డ ఎదుగుదల కోసం ఏం తినాలి?  

  ఒత్తిడిని జేయించడం ఎలా..! అందమైన చేతిరాత చూడముచ్చటగా ఉంటుంది కదూ..? అలాంటి చేతిరాత ఉన్న వారు నలుగురిలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అయితే చేతిరాత ద్వారా ఎదుటి వ్యక్తి ఎంత ఒత్తిడిలో ఉన్నాడా చెప్పొచ్చట.. అంతేకాదు అదే చేతిరాత ద్వారా ఒత్డిని జయించవచ్చు అంటున్నారు నిపుణులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. https://www.youtube.com/watch?v=9EXVzUqGgJk  

  పిల్లలు ఎత్తు పెరగడం కోసం.. పేరెంట్స్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...  

కడుపులోని బిడ్డతో అనుబంధాన్ని పెంచుకోవచ్చు..  

ఏకాగ్రత మెరుగుపరచడం ఎలా?  

సమ్మర్ ని స్పెషల్ గా మారుద్దాం   1) ఈ శెలవులు పిల్లలకి మంచి జ్ఞాపకంగా మిగిలి పోవటానికి, ఆ జ్ఞాపకాలు వచ్చే సంవత్సరమంత వాళ్ళని ఆనందంగా ఉంచేలా చేయటానికి ఏమేం చేయెచ్చో మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ రోజు పిల్లలతో తప్పకుండా చేయించి తీరాల్సిన మరో చిన్న పని గురించి చెప్పుకుందాం. కథలు పుస్తకాలూ చదివించి ఉంటారు కదా . అ కధలలోని ముఖ్యమైన విషయం లేదా పిల్లల్ని ఆకర్షించిన అంశం గురించి ఒక పుస్తకంలో రాయమనాలి. పెద్దగా అక్కర్లేదు ఒకటి రెండు లైన్లు అయినా చాలు. అలాగే అవే పాత్రలతో మరో కధ అల్లి రాయమనాలి. మొదట్లో పిల్లలు నాకు రాదంటూ తప్పించుకుంటారు. కాని మనమే కొన్ని సుచనలూ చేస్తూ, సహాయం చేస్తే వాళ్ళు రాయచ్చు. కనీసం కొత్త అలోచన చేస్తారు. 2) పిల్లలు చదివితే సరే కాని, లేకపోయినా కూడా పెద్దవాళ్ళు చదివి వినిపించి తీరాల్సిన పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అవే జీవిత చరిత్రలు. పెద్ద పెద్ద గ్రంధాలు అక్కర్లేదు. పిల్లల కోసం వారికి అర్ధమయ్యేరీతిలో ఇప్పుడు చాలా పుస్తకాలు వస్తున్నాయి. మహాత్ముల జీవిత చరిత్రలు చదివాక అందులో వాళ్ళని ఆకర్షించిన విషయాలను ఓ పుస్తకంలో రాయమనలి.  మొత్తం చదివాక ఏ అంశం వాళ్ళని ప్రభావితం చేసిందో చూడాలి. దీనివల్ల పిల్లల గ్రాహణశక్తిని అంచనా వేయచ్చు. వాళ్ళు వ్యక్తిత్వంలోని మార్పలును ఇట్టే పసిగట్టచ్చు. మరో విషయం ఏంటంటే ఓ విషయం గురించి చదవటం, దానిని అర్ధం చేసుకోవటం, తిరిగి రాసి పెట్టుకోవటం ఇవన్ని కూడా అ విషయం పిల్లలు మనసుల్లో ముద్రించుకునేలా చేస్తాయి. గాంధీ గారి సత్యం పలకటం అన్న విషయం కావచ్చు, శివాజీ ధైర్యసాహసాలు కావచ్చు. రాజారామోహన్ సంఘసేవ కావచ్చు. చిన్నతనంలోనే పిల్లల మనస్సులో ముద్రించుకుంటే ఆ విషయాలని ప్రత్యేకంగా మనం మళ్ళి నేర్పించక్కర్లలేదు. అవి వారి వ్యక్తిత్వంలో భాగంగా మారి పోతాయి. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. 3) పిల్లలు చిన్న చిన్న బొమ్మలు వేయిటం, వస్తువులు తయారు చేయటం వంటివి చేస్తారు, అవి గొప్పగా ఉన్నాయా లేవా అని కాదు. అవి పిల్లల్లోని సృజనాత్మకతకి అద్దం పడతాయి. అలా వాళ్ళు వేసిన బొమ్మలు, తయారుచేసిన బొమ్మలు, వస్తువులు లాంటివి అన్నింటిని కలిపి ఓ చిన్న ఎగ్జిబిషన్ లా ఏర్పాటు చేసి .హాలులో ప్రదర్శనకు పెట్టి, అపార్టుమెంటు వాళ్ళని, ఫ్రెండ్స్ ని పిలిస్తే అందరిలో తన ప్రతిభకి లభించే గుర్తింపు, పిల్లల్ని ఉత్సాహ పరుస్తుంది. అ ఉత్సాహం మరిన్ని విషయాలలో తను మనసుపెట్టి కష్టపడేలా చేస్తుంది. పిల్లల్లో కుదురు, ఏకాగ్రత, చేసే పని పట్ల ఇష్టం లాంటివి చెబితే వచ్చేవి కాదు. వాళ్ళ ప్రవర్తనలో ఓ భాగంగా అవి మారిపోవాలి. అందకు పైన చెప్పుకున్న విషయాల వంటివి సహాయపడతాయి. 4 పిల్లల్లో ఉహాశక్తికి పదును పెట్టే యాక్టివిటీస్ వారిని చురుకుగా ఉంచుతాయి. ఓ విషయాన్ని వినగానే గ్రహించి, తిరిగి దానికి ఓ రుపం ఇవ్వగలిగితే అది వారిలోని భాషానైపుణ్యాన్ని, భావవ్యక్తీకరణ నైపుణ్యానికి పదునుపెట్టినట్టే. ఉదాహరణకి ఆవు, పులి కథని పిల్లలకి చెప్పి అందులో ఆవు, పులి ,దూడ పాత్రలతో పిల్లలని ఓ చిన్న నాటికలా వేయమంటే .. వాళ్ళంతట వాళ్ళే సంభాషణలని ఉహించుకుని చెబుతారు. ఇది పిల్లలకి సరదాగా ఉంటుంది. నిజానికి అది వారిలోని ఉహాశక్తి పదునుపెట్టటమే. ఇలాగే వీర శివాజీ పాత్ర, సుభాష్ చంద్రబోస్ పాత్ర వంటివి కూడా చేయించవచ్చు. వారి గురించి చెప్పి చరిత్రలోని ఓ సంఘటనని పిల్లలకి వివరించి, ఆ సమయంలో ఆ వ్యక్తుల స్పందన ఎలా ఉంటుందో చెప్పమనాలి. ఏకపాత్రాభినయం అంటారు కదా. అదే ఇలా చేయటం వాల్ల పిల్లల్లోబిడియం కూడా పోతుంది. 5) ఇవన్నీ కూడా పిల్లలని ఉత్సాహంగా ఉంచేవే. ఆడుతూ, పాడుతూ పిల్లల వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే చిన్న ప్రయత్నాలు. ఇంకా ఇటువంటివి ఎన్నో ఉండవచ్చు. ఆలోచిస్తే పిల్లల్ని కదిలిస్తే బోల్డన్ని అంశాలు కనిపిస్తాయి. కావాల్సిందల్లా అమ్మకి కాస్త తీరిక, ఓపిక అంతే ఏమంటారు. -రమ

సీమంతం ఇలా చేస్తే పిల్లలు ఆరోగ్యంగా పుడతారు..  

పిల్లలు కావాలనుకున్నప్పుడు భార్యా భర్తల ఆరోగ్యంకోసం ఇవి తినాలి..

కాలుష్యంతో కడుపులోని బిడ్డకి హాని..  

మొదటి నుంచి అమ్మాయిలు ఆహారం విషయంలో తీసుకోవలసిన జాగ్రతలు..  

కడుపుతో ఉండగా ప్రయాణాలు చేయవచ్చా..?  

తొమ్మిది నెలలు ఏమి తినవచ్చు..? ఏమి తినకూడదు..?