మీ పిల్లలు ఒత్తిడి నుండి బయటపడాలంటే...   ‘స్ట్రస్’... ఈ పదం తరచూ మనం వింటూ ఉంటాం. దీన్నే తెలుగులో మానసిక వత్తిడి అంటారు. ఈ వత్తిడి అనేది ఈ రోజుల్లో  పెద్దల్లోనే కాదు.. పిల్లల్లో కూడా ఎక్కువైపోయింది. కుటుంబ నిర్వహాణ, ఉద్యోగ నిర్వాహణ... తదితర విషయాల్లో పెద్దలకు, పరీక్షలు విషయంలో పిల్లలకు ఈ ‘స్ట్రెస్’ అనేది కామన్. దీన్ని పోగొట్టుకోడానికి ఓ చిట్కా ఉంది. సమస్యను ఎదుర్కొనే ముందు.... ఈ చిట్కాను అనుసరిస్తే... విజయం తథ్యం. ఆ చిట్కా ఏంటో తెలుసుకోవాలంటే... ఇక్కడున్న లింక్ ని ఓ సారి క్లిక్ అనిపించండి.

మీ పిల్లల చేతిరాతలు బావుండాలి అంటే....  

Weight Gain During Pregnancy..  

Overweight And Obesity In Children..   మారుతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లల్లో ఒబెసిటి సమస్య ఎక్కువవుతుంది.. దీనిని నిర్లక్ష్యం చేస్తే ఆరోగ్యానికే ముప్పుగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. మరి దీనిని ఎలా నియంత్రించాలి.. ఒబెసిటీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ జానకీ శ్రీనాధ్ గారి మాటల్లో తెలుసుకుందాం.  https://www.youtube.com/watch?v=6xcpYkxWxto  

పిల్లలకు ఫార్ములా ఫుడ్ పెడుతున్నారా..? జాగ్రత్త   పాలు తాగే వయసు నుంచి పెరిగి పెద్దవుతున్న మీ చిన్నారుల ఎదుగుదల కోసం ఆహారాన్ని పెడుతున్నారా.. వాళ్లు ఇష్టంగా తింటున్నారని సంబరపడిపోతున్నారా.? కానీ వారు తినే పదార్ధాల్లో విషం ఉండొచ్చు అంటున్నారు పరిశోధకులు.. అది ఎలా తెలుసుకోవాలో.. దీని నుంచి మీ కంటిపాపల్ని ఎలా కాపాడుకోవాలో తెలియాలంటే ఈ వీడియో చూడండి.   https://www.youtube.com/watch?v=4qUwMUnB3Fs  

ఎదిగే పిల్లలు డైటింగ్ చేస్తే ?   ఈరోజుల్లో ఏది పడితే అది తినడం.. ఒళ్లు పెంచుకోవడం.. మళ్లీ డైటింగ్ లు అని కడుపు మాడ్చుకోవడం చేస్తున్నారు చాలామంది. మరి ఎదిగే పిల్లలు డైటింగ్ చేయడం వల్ల భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు. డా. జానకి శ్రీనాథ్. మరి ఎదిగే పిల్లలు డైటింగ్ చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి.. ఇంకా పలు హెల్త్ టిప్ప్ కావాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి...  https://www.youtube.com/watch?v=eCA3Vc-IqOg

Travel During Pregnancy...   గర్భం ధరించిన స్త్రీలు ప్రయాణం చేయాలంటే చాలా భయపడతారు. అలాంటి సమయంలో ప్రయాణం చేస్తే ఏమైనా సమస్యలు వస్తాయేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రయాణం చేసేముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. అసలు ప్రగెన్నీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? ఎలా ఉండాలి..? ఇవన్నీ తెలియాలంటే ఈ వీడియో చూసి తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=8YVnKPcdPJ4

పిల్లలో డయాబెటిస్ ఆహార నియమాలు..!   చిన్న పిల్లల్లో డయాబెటిస్ అనేది కొంచెం కష్టమయిన విషయమే. 15 ఏళ్ళ లోపు వారికి గనక డయాబెటిస్ వస్తే ఆహరం మరియు ఇతరత్రా విషయాల్లో చాలా జాగర్తలు తీసుకోవాల్సి వస్తుంది. డయాబెటిస్ వచ్చిన చాలా మంది పిల్లలకి ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. మరి పిల్లల్లో డయాబెటిస్ కంట్రోల్ చేసేందుకు ఎలాంటి జాగర్తలు తీసుకోవాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=lQHQS9OmgSk

టివీ ముందు పిల్లలు ఠీవీగా కూర్చుంటున్నారా? అయితే, డేంజరే!    

పిల్లలతో ఎలామాట్లాడాలి !!    

బేబీతో కనెక్ట్ అవ్వడం ఎలాగో మీకు తెలుసా! బేబీ తో కనెక్ట్ అవడం ఎలాగో తెలుసా? దీనిలో ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా? అదేనండి, ఎన్ని రకాలుగా కనెక్ట్ అవ్వచ్చో తెలుసా? చాలా మంది అనుకోవడం ఏంటంటే వాళ్ళ బేబీ తో అనుబంధం పుట్టిన తర్వాత మొదలవుతుందని. కానీ, గర్భంలో ఉన్నప్పటి నుండే మీరు మీ బేబీ తో రిలేషన్షిప్ డెవలప్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=DWP136bFcp4  

పాలిచ్చే తల్లులు ఇవి తినకూడదు...   ఉద్యోగం, జీవితం, లక్ష్యం, అందం వీటి పేరు చెప్పి చాలా ముఖ్యమయిన పనుల్ని పక్కన పెట్టేస్తున్నాం. ఎన్నో మానవ సంబంధాల్ని తెంచేసుకుంటున్నాం. వాటిలో భాగంగానే అమ్మ తనాన్ని కూడా మరచిపోతున్నారు ఈ మధ్య. ఉద్యోగం వల్లో మరే ఇతర కారణం వల్లో పాలున్నా కూడా కన్నా బిడ్డకి పాలివ్వలేని పరిస్థితి కొందరిది. మరి పాలిచ్చే తల్లులు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=EH3VOmGsh0s  

బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే..?   పుట్టబోయే బేబీ హెల్దీగా  ఉండాలి అంటే, ప్రెగ్నెన్సీ టైములో చాలా మానసికంగా, చాలా ఆరోగ్యముగా ఉండాలి. గర్భిణీ స్త్రీలకి మెంటల్ హెల్త్ మరియు ఫిసికల్ హెల్త్ రెండూ ముఖ్యమే. సాధారణంగా అందరికి ఫిసికల్ హెల్త్ విషయంలో ఎలా జాగ్రత్త వహించాలి తెలుసు, కానీ మెంటల్ హెల్త్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకోవాలో తెలియదు. ఈ విషయంలో క్లారిటీ కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=7XsfCkZhCeU

పిల్లలలో ఆహరనైపుణ్యం ఎలా పెంపొందించాలి..? పిల్లలకి ఆరోగ్యవంతమయిన ఆహారాన్ని ఎంచువడంలో నేర్పు ఎలా పెంపొందించాలి? సాధారణంగా, తల్లిదండ్రులు తమ పిల్లలు ఆరోగ్యవంతమయిన ఆహరం తీసుకోవడం అంతగా ఆసక్తి చూపించడం లేదు అని బాధపడుతుంటారు. అయితే, పిల్లల్లో ఆహార నైపుణ్యం ఎప్పటి నుండి పెంపొందించాలి. ఎలాంటి ఆహరం, ఏ వయసులో ఉన్నప్పటి నుండి ఇస్తే పిల్లల్లో ఆహార నైపుణ్యం పెరుగుతుంది, తదితర విషయాల్లో అవగాహన కోసం ఈ వీడియో చూడండి...  https://www.youtube.com/watch?v=cx-odGFMB9I    

మీ అబ్బాయి హీరోలా ఫీలవుతున్నాడా?!          * పేరెంట్స్ మీటింగ్ ఉంటే కొడుకు స్కూల్ కి వెళ్లి రజిత. అక్కడ కొడుకు క్లాస్ టీచర్ చెప్పిన విషయాలు విని నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు రజితకి. ఎల్.కె.జి. చదువుతోన్న ఆమె కొడుకు విశాల్ క్లాసులో తెగ అల్లరి చేస్తున్నాడట. పక్కవాళ్లతో మాట్లాడుతూనే ఉంటాడట. స్లీపింగ్ పీరియడ్లో అస్సలు నిద్రపోడట. పైగా నిద్రపోయే ఇతర పిల్లల్ని లేపేస్తుంటాడట. ఇవి చాలామంది పిల్లలు చేస్తారు కాబట్టి నవ్వుకుంది రజిత. మెల్లగా నచ్చజెప్తాను అంది టీచర్ తో. అయితే టీచర్ చెప్పిన ఒక విషయం మాత్రం రజిత మతి పోగొట్టింది. విశాల్ ఒక హీరోలా ఫీలవుతుంటాడట.           * అందరి మీదా పెత్తనం చేయడం, తను చేయాలనుకున్నదే చేయడం, తను చెప్పిందే అందర్నీ చేయమనడం, చివరికి టీచర్ చెప్పినా మొండిపట్టు పట్టడం చేస్తుంటాడట. అంతకన్నా విచిత్రం ఏమిటంటే... ఏదైనా స్కిట్ కానీ, డ్రామా కానీ వేయాల్సి వస్తే, పవర్ ఫుల్ పాత్ర అయితేనే చేయడానికి ఇష్టపడతాడట. పులి, సింహం లాంటి వేషాలట. ఏ కోతి వేషమో, కుక్క వేషమో వేయమంటే వేయనంటాడట. రాజులా తప్ప సైనికుడిలా చేయనంటాడట. ఇదంత మంచి లక్షణం కాదు అంది టీచర్.    * బుర్ర తిరిగిపోయింది రజితకి. ఎందుకంటే పిల్లాడి వయసు ఎంతో లేదు. ఇంకా ప్రపంచం కూడా సరిగ్గా తెలియదు. మరి అప్పుడే ఇలాంటి ఆధిక్య ధోరణి ఎలా వచ్చిందో అర్థం కాలేదామెకి. ఆమెకే కాదు... చాలామందికి అర్థం కాదు. అలా అర్థం చేసుకోకపోవడం వల్లే చాలామంది పిల్లలు పెద్దయ్యాక పెత్తందారుల్లాగా వేధింపులకు సైతం దిగేవారులాగా తయారవుతారన్నది కాదనలేని నిజం. కాబట్టి ఆ తప్పు మీరు చేయకండి. మీ కొడుకు మీద ఓ కన్నేసి ఉంచండి.      * ఒకప్పుడు పిల్లలు తండ్రిని ఫాలో అయ్యేవారు. నాన్న ఏం చేస్తే అది చేయడానికి ట్రై చేసేవారు. కానీ ఇప్పుడు టీవీల ప్రభావం ఎక్కువైంది. ఏ సినిమానో చూసినప్పుడు ఆ హీరో చెప్పింది అందరూ వినడం చూస్తారు. తన మాట కూడా అలా వినాలన్న భావన అప్పుడే మొదలవుతుంది. ఏ కార్టూన్ షోలోనో ఒక పిల్లాడు అందరినీ అదరగొట్టి బెదరగొట్టేస్తుంటాడు. దాంతో అలా చేస్తే తానూ హీరోనవుతాను అనుకుంటాడు. ఇలాంటివే పిల్లల మనసులో హీరోయిజాన్ని నిద్ర లేపుతుంటాయి.       * అంతేకాక ఇంట్లో వాతావరణం కూడా ఒక కారణం. కొందరి ఇళ్లలో మనం ఎక్కువ వాళ్లు తక్కువ అన్న భేషజాలు ఎక్కువగా ఉంటాయి. పనివాళ్లను, కూరగాయలవీ అమ్ముకునేవాళ్లను, వాచ్ మేన్ లాంటి వాళ్లను బలహీనులుగా చూస్తుంటారు. అది పిల్లలు కనుక గమనిస్తే వాళ్లలో తాము ఎక్కువ అన్న ఫీలింగ్ పెరిగిపోతుంది. ఇతరుల్ని తక్కువగా చూడటం అలవాటవుతుంది. తద్వారా తానెప్పుడూ పై స్థాయిలోనే ఉండాలన్న పట్టుదల కూడా వస్తుంది. ఇక ఏ విషయంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గడానికి ఇష్టపడరు. అది మాత్రమే కాదు.. టీవీలో చూసినట్టు రకరకాల విన్యాసాలు చేసి ప్రాణాల మీదికి కూడా తెచ్చుకుంటారు.       * ఇదంతా పదేళ్లో పదిహేనేళ్లో వచ్చాక మొదలవుతుందనుకుంటే పొరపాటు. ఊహ తెలిసినప్పటి నుంచి, మాట వచ్చినప్పట్నుంచి పిల్లల వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటూనే ఉంటుంది. కాబట్టి ఆదిలోనే వాళ్లకి సరైన దారి చూపించాలి. హీరోలా ఉండటం మంచిదే కానీ హీరోయిజం పాజిటివ్ గా మాత్రమే ఉండాలన్న నిజాన్ని మెల్లమెల్లగా వాళ్లకి నేర్పండి. మొక్కై వంగనిది మానై వంగదని మర్చిపోకండి.  -Sameera

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే... ఇది తినాల్సిందే!     చాలామంది పిల్లలు ఎన్ని మందులు వాడినా, ఎంత ఆహారాన్ని తీసుకున్నా... వయసుకి తగినంత బరువు, ఎత్తు ఉండరు. ఈ తరహా సమస్యలని wasting (తక్కువ బరువు), stunting (తక్కువ ఎత్తు) అంటారు. ఇప్పుడు ఈ సమస్యకి సులువైన పరిష్కారం లభించిందని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఆరు నెలల పాటు, రోజుకో గుడ్డు చొప్పున పెడుతూ ఉంటే, వారిలో అనూహ్యమైన మార్పులు వస్తాయని అంటున్నారు. గుడ్డులో ఉండే పోషకాహార విలువ గురించి ప్రత్యేకించి చెప్పుకోనవసరం లేదు. కానీ ఇది పిల్లల బరువు, ఎత్తు విషయంలో ఏమేరకు ప్రత్యక్షంగా ఉపయోగపడుతుందో చూడాలనుకున్నారు వాషింగ్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఇందుకోసం దక్షిణ అమెరికాలోని ఈక్వెడార్ దేశంలోని కొందరు పిల్లలను ఎంచుకున్నారు. ఈ పిల్లలని రెండు బృందాలుగా విడదీశారు. మొదటి జట్టులో ఉన్నవారికి ఆర్నెళ్లపాట రోజూ గుడ్డు అందించారు. రెండో విభాగంలో పిల్లలకి గుడ్డు ఇవ్వలేదు. ఆర్నెళ్లు గడిచేసరికి పరిశోధకులకు ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. రోజూ గుడ్డు తిన్న పిల్లలలో ఎత్తు పెరగకపోవడం అనే సమస్య 47 శాతం తగ్గిపోయింది. ఇక బరువు పెరగకపోవడం అనే సమస్య 74 శాతం తగ్గిపోయింది. అంతేకాదు! రోజూ గుడ్డు తినే పిల్లలకి తగినంత పోషకాహారం లభిస్తున్నట్లు తేలింది. బహుశా ఆకలి తీరడం వల్లనో ఏమో... వీరు చిరుతిళ్లు తినడం కూడా తగ్గిపోయిందట! ఈ పరిశోధనతో గుడ్డు వల్ల మరో ఉపయోగం కూడా రుజువైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు గుడ్డు తినడం వల్ల ఉండే మరికొన్ని ఉపయోగాలను ఓసారి గుర్తుచేసుకుందాం... - శాకాహారులు తినే ఆహారంలో B12 అనే పోషకపదార్థం ఉండదు. మాంసాహారం జోలికి పోకుండా ఈ B12ని అందించే సాధనం గుడ్డు మాత్రమే! ఎర్ర రక్తకణాల ఉత్పత్తిలోనూ, నాడీ వ్యవస్థ పనితీరులోనూ B12 అత్యవసరం. - గుడ్డులో సెలీనియం అనే అరుదైన పదార్థం ఉంటుందనీ, దీంతో రోగనిరోధకశక్తి పెరుగుతుందనీ చెబుతున్నారు. - మన శరీరానికి చాలా అవసరం అయినా విటమిన్ డి ఎక్కువగా సూర్యకాంతి నుంచే లభిస్తుంది. కానీ ఇప్పటి పిల్లలు ఎండ అనేదే ఎరుగకుండా పెరుగుతున్నారు కదా! గుడ్డు కనుక తింటే, వారికి కావల్సినంత విటమిన్ డి దొరుకుతుంది. - ఇప్పటి పిల్లలలో కంటి సమస్యలు చాలా సాధారణం అయిపోతున్నాయి. కానీ గుడ్డులో ఉండే Lutein, Zeaxanthin అనే పదార్థాలు కంటి సమస్యలు రాకుండా నివారిస్తాయి. - పిల్లలు పాపం బోల్డు పుస్తకాలని బట్టీపట్టాల్సి ఉంటుంది. మరి మెదడు చురుగ్గా పనిచేయాలంటే ఒమేగా- 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం అని వినే ఉంటారు. ఆ ఒమేగా- 3 గుడ్డులో సమృద్ధిగా లభిస్తుందట. చివరగా... గుడ్డులో ప్రొటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతారు. పిల్లలు ఆరోగ్యంగా, బలంగా ఉండాలంటే ఈ ప్రొటీన్లు చాలా అవసరం. మరెందుకాలస్యం! అశ్రద్ధ చేయకుండా మీ ఇంట్లో పిల్లలకి రోజుకి ఓ గుడ్డు తినిపించండి. పనిలో పనిగా మీరు కూడా ఒకటి లాగించేయండి. - నిర్జర.    

  పిల్లలు కూరలు తినడం లేదా- ఈ చిట్కా పాటించండి     ఇప్పటి పిల్లల తిండి మారిపోయింది. ఐదేళ్లకే వాళ్లు నూడిల్సూ, పిజ్జాలు అంటున్నారు. రోజూ వేపుళ్లూ, బేకరీ పదార్థాలు లేనిదే ముద్ద దిగదని మారం చేస్తున్నారు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం! గారాల పిల్లలు కదా! కాకపోతే ఆ పనికిమాలిన తిండి తిని వారు లావైపోతున్నారనీ, డయాబెటిస్ వంటి రోగాలకు సిద్ధపడుతున్నారనీ తెగ బాధపడిపోతుంటాం. పిల్లలతో మంచి పోషకాహారాన్ని తినిపించే చిట్కా ఒకటి కనుక్కొన్నామని చెబుతున్నారు పరిశోధకులు. అదేమిటో మీరే చూడండి... పిల్లలకి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వాటిలో ఉడికించిన కూరగాయల ముక్కలు కలిపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది నిపుణులకి. అయితే ఇలా చేయడం వల్ల పిల్లలు ఆహారం రుచి మారిపోతుందనీ, పిల్లలు ఆ కాస్త ఆహారాన్ని కూడా తినరని కొందరు వాదించారు. దాంతో ఈ చిట్కా పిల్లల మీద ఏ మేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు. ఒక 39 మంది పిల్లలకి మూడు రోజులపాటు వారికి ఇష్టమైన ఆహారంలో కాయగూరలను ఉడికించి అందించారు. ఈ పిల్లలంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల లోపువారే. వీరికి ఇష్టమైన బ్రెడ్డు, పాస్తా, చికెన్ నూడుల్స్లాంటి పదార్థాలలో కూరగాయలను కలిపి ఇచ్చారు. ఆశ్చర్యంగా పిల్లలు ఎలాంటి తేడా లేకుండా ఎప్పటిలాగే శుభ్రంగా ఆ పదార్థాలని తినేశారు. ఇలా పిల్లలకి ఇష్టమైన ఆహారంలో ఉడికిన కూరలను కలపడం వల్ల, వారి రోజువారీ ఆహారంలో కూరగాయల శాతం రెట్టింపు అయ్యిందట. అంతేకాదు! ఇలా కూరగాయలు తినడం వల్ల వాళ్లు చిరుతిళ్ల జోలికి పోవడం కూడా తగ్గిపోయిందట. పిల్లలు కేవలం కెలొరీలు మాత్రమే అందించే తిండి తింటున్నారు అని వాపోయేకంటే ఇలాంటి చిట్కాలు పాటించమని సూచిస్తున్నారు నిపుణులు. వారికి స్నాక్స్తో పాటుగా కూరగాయల ముక్కలు పెట్టడం, ఇష్టమైన ఆహారంలో కూరలు వేయడం, ఉడికించిన కూరలతోనే రుచికరమైన పదార్థాలు వండే ప్రయత్నం చేయడం... లాంటి ఉపాయాలతో ఎలాగొలా పిల్లలకి తగినన్ని కూరలు అందేలా చూడమని హెచ్చరిస్తున్నారు. - నిర్జర.    

ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలకి డిప్రెషన్‌ కూడా వస్తుంది!   ఫుడ్‌ అలెర్జీ- ఈ మాట గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన పని లేదు. వేరుశనగపప్పు, పాలు, గోధుమలు... ఆఖరికి బియ్యం దాకా కొన్ని ఆహారపదార్థాలు సరిపడకపోవడాన్నే ఫుడ్‌ అలెర్జీగా పేర్కొంటాం. ఈ అలెర్జీ కలిగించే ఆహారాన్ని తీసుకోగానే శరీరం మీద దద్దుర్లు దగ్గర్నుంచీ విరేచనాలా దాకా చాలా సమస్యలు వచ్చేస్తాయి. కొన్ని సందర్భాలలో ఇది మరణానికి కూడా దారితీయవచ్చు. ఫుడ్‌ అలెర్జీ చిన్నపిల్లల్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అలెర్జీ బారిన పడ్డ పిల్లల్లో మానసిక సమస్యలు కూడా ఏమన్నా వస్తాయేమో చూడాలనుకున్నారు పరిశోధకులు. అందుకోసం ఓ 80 మంది పిల్లలను ఎన్నుకొన్నారు. వీరంతా కూడా 4 నుంచి 12 ఏళ్ల వయసు లోపువారే! వీరిలో కొందరు పిల్లలకి ఫుడ్ అలెర్జీ ఉంటే మరికొందరికి ఆ సమస్యే లేదు! ఈ 80 మంది పిల్లల్లోనూ డిప్రెషన్‌కు సంబంధించిన లక్షణాలు ఎవరిలో ఉన్నాయో గమనించే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యంగా ఫుడ్‌ అలెర్జీ ఉన్న పిల్లలలో డిప్రెషన్ వచ్చే ప్రమాదం 20 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఫుడ్‌ అలెర్జీతో బాధపడే పిల్లలలో దాదాపు 60 శాతం మందిలో డిప్రెషన్ లక్షణాలు బయటపడ్డాయి. ఈ పరిశోధనతో డిప్రెషన్‌కు, ఫుడ్‌ అలెర్జీకీ సంబంధం స్పష్టమైపోయింది. దాంతో ఈ సంబంధానికి వెనుక కారణాలను కూడా వెతికే ప్రయత్నం మొదలుపెట్టారు. అలెర్జీని మన శరీరం ఒక ప్రమాదంగా భావిస్తుంది. కాబట్టి ఆ ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు అది ఎప్పుడూ సన్నద్ధంగా ఉంటుంది. అది ఒక తెలియని ఉద్వేగంగా మారే ప్రమాదం ఉంది. పైగా అలెర్జీ ఉన్న పిల్లలకి, తాము ఇతరులకంటే భిన్నం అన్న అభిప్రాయం కలుగుతుంది. తమ తోటి పిల్లలతో పోలిస్తే తమలో ఏదో లోపం ఉందన్న న్యూనత ఏర్పడుతుంది. అది క్రమేపీ డిప్రెషన్‌కు దారితీస్తుంది. ఫుడ్ అలెర్జీ వచ్చిన వెంటనే కంగారుపడి వైద్యం కోసం పరుగులుతీసేకంటే... అది రాకుండా జాగ్రత్తపడటమే మేలంటున్నారు శాస్త్రవేత్తలు. తమ పిల్లలలో ఎలాంటి ఆహారం అలెర్జీని కలిగిస్తుందో కనిపెట్టి, ఆ పదార్థాన్ని వారికి దూరంగా ఉంచమంటున్నారు. ఇదంతా వినడానికి బాగానే ఉంది. కానీ దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ ఫుడ్‌ అలెర్జీల మీద అవగాహన తక్కువ. పైగా పిల్లలకు సరిపడే ఆహారాన్ని కొనలేని దుస్థితి. ఒకవేళ పిల్లవాడికి తేడా చేస్తే వైద్యం చేయించలేని దైన్యం. కాబట్టి బడిలో కూడా పిల్లలకి ఫుడ్‌ అలెర్జీల మీదా, దాని నుంచి తప్పించుకునే అవకాశాల మీద తగిన అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. దాంతో పిల్లవాడి శరీరమూ, మనసు కూడా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని భరోసా ఇస్తున్నారు.   - నిర్జర.