లిప్.. లిప్.. హుర్రే

మనకి లిప్ స్టిక్ వేసుకోవడమంటే చాలా ఇష్టం.లిప్ స్టిక్ వేసుకోవడం వల్ల మన ముఖానికి ప్రత్యేకమైన ఆకర్షణ వస్తుంది. వేసుకోవడమైతే వేసుకుంటాం కానీ, ఎలా వేసుకోవాలి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పై అసలు దృష్టి పెట్టం. మరి మన అదరాలు అదరహో అనాలంటే ఎలాంటి చిట్కాలు వాడాలో చూద్దామా...

* ముందుగా మన స్కిన్ టోన్ బట్టి మనకు ఎలాంటి లిప్ స్టిక్ సూటవుతోందో చూసుకోవాలి. పేల్ స్కిన్ వాళ్లయితే కొంచెం లైట్ షేడ్, గ్లాసీ లిప్ స్టిక్ ఉపయోగించడం మంచిది. అదే డార్క్ స్కిన్ అయితే నేచురల్ గా ఉండేవి (గోల్డ్, బ్రౌన్, రెడ్) వాడటం మంచిది.

* లిప్ స్టిక్ వేసుకోవడం చాలా తేలికైన పని. కానీ చాలా మంది ఆడవాళ్ల పెదవులు లిప్ స్టిక్ వేసుకున్నప్పటికీ ఎండిపోయినట్టుగా కనిపిస్తాయి. దీనిని నివారించాలంటే ముందుగా పెదవుల పై ఉన్న డెడ్ స్కిన్ పోగొట్టాలి. వారానికి రెండుసార్లు తేనె, పంచదార కలిపిన మిశ్రమాన్ని పెదవులకి రాసి రబ్ చేస్తే సాఫ్ట్ గా తయారవుతాయి.

* పెదవులు పొడిబారకుండా వుండటానికి లిప్ బామ్ రాసుకోవాలి. ఇలా రాసిన పదినిమిషాల తరువాత ఒక టిష్యూతో లిప్ బామ్ తుడిచేయాలి

* లిప్ లైనర్ తో ఇప్పుడు పెదవులను ఫిల్ చేసుకోవాలి. లిప్ స్టిక్ ట్యూబ్ నుండి డైరెక్ట్ గా కాకుండా బ్రష్ తో వేసుకోవాలి. పెదవుల పక్కన ఎదైనా కొంచెం రంగు అంటుకుంటే కన్సీలర్ బాగా ఉపయోగపడుతుంది. పెదవుల అంచులకి అంటుకున్న రంగును ఇది సులభంగా పొగొడుతుంది.

* చివరిగా పెదవులకి షైనింగ్ కావాలనుకుంటే లిప్ గ్లాస్ రాసుకుంటే సరిపోతుంది.

-పావని గాదం