వంటగదిలో మీకు తెలియని కొత్త షెల్ఫ్ ప్రదేశాలు...!

పనికిరాని వస్తువులన్నిటిని కూడా స్టోర్ రూమ్ లోపెట్టేస్తుంటాం. ఎందుకంటే ఈ పనికిరాని వస్తువులను తీసేయడం వలన కాస్త ఖాళీ స్థలం దొరుకుతుంది. అదే ఒకవేళ వంటగదిలో అనేక వస్తువులను పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ వాటికోసం మరో స్థలాన్నివెతుక్కోకుండా వంటగదిలోనే మనకు నచ్చినట్లుగా ఎలా అందంగా మార్చుకోవచ్చో కొన్ని సూచనల ద్వారా తెలుసుకుందామా...!

వంటగది చిన్నగా ఉందనుకోండి.. అందులో మళ్ళీ షెల్ఫ్ లు అంటూ చేస్తే అది ఇంకా ఇరుకుగా మారిపోతుంది. అలాంటప్పుడు సింక్ క్రింది స్థలాన్ని వాడుకొని మన వస్తువులను అమర్చుకోవచ్చు. మరి సింక్ కింది భాగాన్ని ఎలా వాడుకోవచ్చో చూద్దామా...!

సింక్ కింది భాగంలో షెల్ఫ్ లాంటివి అమర్చుకోవడం వలన మీకు అవసరమయ్యే వస్తువులను అక్కడే పెట్టుకోవచ్చు. అలా చేయడం వలన అందంగా ఉండటంతో పాటు స్థలం కూడా మనకు ఉపయోగపడుతుంది.

పైగా శాశ్వతంగా అక్కడే ఉండే షెల్ఫ్ లను మీరు ఎంచుకోవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైన రిపెర్లకు ప్లంబర్ వస్తే ఈ మొత్తం క్యాబినెట్ నే తొలగించాల్సి కూడా రావచ్చు. అందుకే అటూఇటూ కదల్చడానికి వీలైన ఎన్నో అండర్ సింక్ షెల్ఫ్ లు ఇప్పుడు మార్కెట్లో లభిస్తున్నాయి.

టూ టైర్, త్రీ టైర్ ఫుల్ అవుట్ బాస్కెట్లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటు ధరలలోనే లభిస్తున్నాయి. అనువైన దానిని ఎంచుకుని సింక్ కింద అమర్చండి.

అందులో డిటర్జెంట్లు, లిక్విడ్ సోప్ బాటిల్స్, బ్లీచింగ్ పౌడర్ డబ్బాలు, బ్రష్ లు, చివరకు హ్యాండ్ టవల్స్ తో సహా చక్కగా సర్దుకోవచ్చు. చిన్న చిన్న బాటిల్స్ లాంటివి ఉంటే వాటన్నింటిని ఒకే ట్రే లో సర్దుకోవచ్చు. మీరు ఈ షెల్ఫ్ లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకోవచ్చు.