ఎండాకాలంలో మృదువైన పెదాలకోసం

ఎండాకాలం వచ్చిందంటే చాలు ! అందాన్ని కాపాడుకోవడం ఆడవాళ్ళకి చాలా కష్టంతో కూడుకున్న పని అని చాలామంది ఆడవాళ్ళు బాధపడుతుంటారు. బాధపడకండి ! తెలికైనా చిట్కాలు ఉపయోగిస్తూ ఏ కాలమైన ఆడవాళ్ళు తమ అందాన్ని కాపాడుకోవచ్చు. మొహంలో సున్నితభాగాలైన పెదాలు, కళ్ల విషయంలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపల్సి ఉంటుంది కాబట్టి ఈ రోజు మనం పెదాలను ఎలా కాపాడుకోవాలో, ఎలా మృదువుగా వుంచుకోవాలో వాటికీ సంబంధించిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం !

* ఎప్పుడూ పెదాలను పొడిగా వదిలేయకుండా, నాణ్యత కలిగిన లిప్ లోషన్ తీసుకుని తరచూ పెదాలకు అప్లై చేయాలి.

* పెదాలు ఆరోగ్యంగా ఉండటానికి బి విటమిన్ ఉపయోగపడుతుంది. వివిధ రూపాల్లో బి విటమిన్ తీసుకోవడం వల్ల పెదాలు చిట్లకుండా ఆరోగ్యంగా, అందంగా ఉంటాయి.

* నీళ్ళు వీలనన్ని ఎక్కువగా తాగాలి. అలా తాగడం వల్ల శరీరంతో పాటు పెదాలు కూడా పొడిబారకుండా ఉంటాయి.

* పెదాలలో నూనెక్షిగంధులు లేకపోవడం వల్ల తొందరగా చిట్లిపోవడం, పొడిబారడం జరుగుతుంది. తేమగా ఉండటానికి కావాల్సినంత మాయిశ్చరైజర్‌ను పెదాలకు ఆరకుండా రాస్తూ ఉండాలి.

* ప్రతిరోజూ పడుకునేముందు లిప్‌స్టిక్‌ను తప్పనిసరిగా తీసేయాలి. వెన్నతో పెదాలను మృదువుగా మసాజ్ చేయాలి.