ఫిట్‌నెస్ రహస్యం మన చేతుల్లోనే

బాడీ ఫిట్‌నెస్‌తో మైండ్ ఫిట్‌నెస్ కూడా సాధ్యపడుతుంది. అది ఎలా అంటే...మంచి ఆహారం, వ్యాయామం శరీరానికి కావలసిన శక్తినివవడమే గాక ఉత్సాహాన్ని పెంచి మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. తద్వారా ఎంతటి క్లిష్ట సమస్యనైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం పెరుగుతుంది. అందుకే ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పక వ్యాయామం, పోషకాహారం చాలా అవసరం.

* బరువు పెరుగుతున్నట్లు తెలియగానే చాలామంది వెంటనే తినడం తగ్గించేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవలసి వస్తుంది.

* ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోవడం వల్ల గంటలో జీర్ణమవగా మిగిలింది కొవ్వుగా మారిపోయి శరీరంలో నిలవ ఉంటుంది. తద్వారా కొవ్వు పరిమాణం పెరిగి బరువు పెరుగుతారు.

* దృఢమైన శరీరానికి ఉపయోగపడే ముఖ్య పోషకాలు కార్బోహైవూడేట్లు. ఈ చక్కెర పదార్థాలు దాదాపు అన్ని రకాల ధాన్యాలు, పప్పులు, కూరగాయల్లో లభిస్తాయి.

* 50 శాతం శక్తి వీటి ద్వారానే చేకూరుతుంది. కొవ్వు పదార్థాల నుంచి 35 శాతం, ప్రొటీన్ల నుంచి 15 శాతం శక్తిని పొందగలుగుతాం.

* పైగా బరువు పెరిగే ప్రమాదం పెరుగుతుందే కానీ తగ్గదు. ఎందుకంటే మనం ఆహారం తీసుకున్న ఒక గంట వరకు మన శరీరంలోని ఎంజైములు అతి చురుకుగా పనిచేస్తాయి.

* కాబట్టి ఒక్కసారి ఎక్కువ లాగించేకన్నా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తినడం మంచిది.

 

ఇకపోతే ఫిట్‌నెస్‌ను పెంచే మరో ముఖ్య కారకం వ్యాయామం. కావలసినదాని కన్నా ఎక్కువ శక్తి చేరినప్పుడు ఆ కేలరీలన్నీ కొవ్వులుగా మారి ఫిట్‌నెస్‌ను తగ్గిస్తాయి. కాబట్టి వాటిని కరిగించాలంటే క్రమం తప్పని వ్యాయామం అవసరం. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజులు దృఢత్వాన్ని పెంచుతాయి. వ్యాయామం వల్ల మెదడులో ఎండోమార్ఫిన్లనే రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. ఫలితంగా రోజంతా ఉత్సాహంగా, ఆనందంగా ఉంటుంది. వ్యాయామం ఇలా చేయండి.

* వ్యాయామం ప్రారంభించే ముందు ఒకేసారి పెద్ద పెద్ద ఎక్సర్‌సైజులు కాకుండా కనీసం వారానికి మూడుసార్లు ఒక అరగంట సేపు మీరు ఇష్టంగాచేయగలిగే పద్ధతిని ఎంచుకోండి.

* కొద్దిరోజులు చేసి మానేయడం కాకుండా మెల్లమెల్లగా రోజూ చేయడానికి ప్రయత్నించండి.

* యోగా, వాకింగ్, స్విమ్మింగ్.. ఇలా ఏదో ఒకటి మీకు సరిపోయే వ్యాయామ పద్ధతిని ఎంచుకోండి.

* మీరొక్కరే చేయడానికి విసుగ్గా ఉంటే టీమ్‌గా, ఒకాటలాగా చేయండి. మెల్లగా అలవాటవుతుంది.

* ఒక్కటి కన్నా ఎక్కువ వెరైటీలలో ఉండే వ్యాయామ పద్ధతులు ఆసక్తిని పెంచుతాయి. మెదడుకు చురుకుదనం.

మనం తీసుకునే ఆహారం మన మెదడు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి తీసుకునే ఆహారాన్ని బట్టి మన మానసిక దృఢత్వం, చురుకుదనం ఆధారపడి ఉంటాయి. కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉన్న ఆహారం మెదడును మత్తుగా ఉంచుతుంది. అన్నం తినగానే నిద్ర ముంచుకురావడానికి కారణం ఇదే.

అందుకే సాయంకాలం కార్బోహైవూడేట్‌లను తీసుకోవడం వల్ల సుఖనివూదకు ఆస్కారం ఉంటుంది. ప్రొటీన్లు మెదడు చురుకుదనాన్ని పెంచుతాయని ఇటీవలి పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి మానసిక సామర్థ్యం పెంచుకోవాలంటే ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవాలన్నమాట.

ఇక కాఫీ, టీలు మోతాదుకు మించి తీసుకుంటే ప్రమాదమే. ఒక కప్పు కాఫీ మెదడును చైతన్యవంతం చేస్తుంది. కానీ గంటకో కప్పు తీసుకోవడం వల్ల అలసట, ఉద్రేకం, నిద్రలేమి వంటి దుష్ఫలితాలు కలుగుతాయి. అలాగని హఠాత్తుగా మానివేస్తే తలనొప్పి, వికారం వంటివి కనిపిస్తాయి.