గోరింటాకు... న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్

గోరింట పూచింది కొమ్మా లేకుండా అనే పాట అందరికీ తెలిసిందే. గోరింటాకు కొమ్మ లేకుండా పూయడం అంటే... అందమైన అమ్మాయిల చేతి మీద ఎర్రగా పూస్తుందని అర్థం. గోరింట కొమ్మ లేకుండా పూస్తుందేమోగానీ, డిజైనర్ లేకుండా గోరింటాకు పెట్టుకోవడం మాత్రం మాకు నచ్చదని నేటితరం అమ్మాయిలు చెబుతున్నారు. నిజమే.. మనంతట మనం గోరింటాకు పెట్టుకోవడం కంటే, డిజైనర్లు పెట్టే గోరింటాకు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. అందుకే ఈ కొత్త ఏడాది ప్రారంభంలో ఒక మంచి డిజైన్‌తో గోరింటాకు పెట్టుకుంటే ఆ ఉత్సాహమే వేరు. కొత్త సంవత్సరం సందర్భంగా గోరింటాకు స్పెషల్ డిజైన్‌ వీడియో చూడండి...