ఇప్పుడు మనదీ అంతేగా....

 

    నేను వయసులో వున్నాను. నువ్వు వయసులో ఉన్నావు. నీ శరీరం మీద నాకు, నాశరీరం మీద నీకు కేవలం కాంక్షపరమైన ఇష్టమే ఉంది. అందుకు అవకాశాలు కలిసివచ్చాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటూ వేడిని తగ్గించు కుంటున్నాం. అంతే తప్ప నీమీద నాకు, నా మీద నీకు ప్రేమేం లేదుగా?" మేరీ లాంటి ఒక సాధారణ యువతిలో ప్రేమ, సెక్స్, మానవ సంబంధాల మీద అంత స్పష్టమయిన అవగాహన వుంటుందని ఏ మాత్రం ఊహించని యోగి తీవ్రమైన విభ్రాంతికి లోనయ్యాడు.

 

    "మరి నీకిప్పుడు శ్రీధర్ మీద ఫీలింగ్ ఏమిటి?" అడిగాడు యోగి.

 

    "ప్రేమ కాదు, అనుభూతిపరమయిన కాంక్ష... డూయింగ్ సెక్స్ విల్ హిమ్ విల్ బి మోర్వలెస్. శ్రీధర్ నీకన్నా తక్కువ సామర్థ్యంతో, తక్కువ టైమ్ సెక్స్ లో పాల్గొన్నా, అదే నాకు గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే శారీరకమయిన కాంక్షకంటే మానసికమైన కాంక్ష అతని మీద నాకెక్కువగా వుంది. ఆఫ్ట్రాల్ సీయింగ్ అండ్ అబ్జర్వింజి. ఐ వజ్ ఫాసినేటెడ్ లైక్ ఎనీ థింగ్... ఈ ఆలోచనల ఎత్తే పెరిగితే తొలి సందేహానికి నా ద్వారానే జవాబు దొరకవచ్చు. ఇకపోతే శ్రీధర్ అపరిచితురాలి మీదున్న ఫీలింగ్ అద్వితీయమయినది... అనిర్వచనీయమయినదని నా భావన. నిజంగా అదెంత గొప్పది. కనీసంగానైనా శ్రీధర్ ఆమెని చూడలేదు. కానీ ఆమెకోసం పరితపించిపోతున్నాడు. ఎంత అదృష్టవంతురాలామె" నిట్టూరుస్తూ అంది మేరి. అతని షర్ట్ బటన్స్ విప్పుతూ.

 

    మేరి చెప్పింది పచ్చిగా వున్నా అందులో నిజం లేకపోలేదనిపించింది యోగికి.

 

    "అర్థం కాలేదా? ప్రేమ వేరు- రొమాంటిక్ రిలేషన్ షిప్స్ వేరు."

 

    ది డిజైర్ ఫర్ లవ్...

 

    ది డిజైర్ ఫర్ ఎగ్సైట్ మెంట్...

 

    ది డిజైర్ ఫర్ పవర్...

 

    రొమాంటిక్ రిలేషన్ కి ఈ మూడే ప్రధానం.

 

    తక్కువమంది అమితమైన ఉద్రేకాన్ని రవ్వంత ప్రేమని కోరుకుంటారు.

 

    ప్రేమకోసం తపించేవారు- ఉద్రేకం తీర్చుకోవాలనుకునే వారి మూలంగా పెద్ద సమస్యలేం వుత్పన్నం కావు.

 

    ఆడ, మగ ఒకరిని ఒకరు ఇష్టపడితే అది వారికి ఆనందాన్ని కలిగిస్తుంది తప్ప సమస్యల్ని తెచ్చిపెట్టదు.

 

    Some people use sex as a way to gain power and help them get what they want in their careers.

 

    ఇది నీచమయిన వ్యవహారం.

 

    ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి లోబరుచుకొని తన కోరికలు తీర్చుకున్నాక మోజు కోల్పోయి ఆమెని తనకు నిచ్చెనగా ఉపయోగపడగలరన్న వారి దగ్గరికి పంపించడం ఈ ఆధునిక సమాజంలో ఎక్కువయిపోయింది.

 

    చూసావా...మనిషి ఎంత హేయమయిన స్థితికి దిగజారిపోతున్నాడో...?

 

    తల్లిని, చెల్లిని, అక్కని, వదిన్ని, పిన్నిని, ప్రియురాల్ని, భార్యని కేవలం రక్తమాంసాలున్న అందమైన ఆటవస్తువులుగానే భావించి వారిని ఇతరులకు ఎర వేసి అదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మానవ సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలే అని మార్క్సు భావాలకి వేరే భాష్యం చెప్పే స్థితికి ఈ మగజారి దిగజారిపోవడం చాలా బాధగా వుంది యోగి.

 

    నీకు తెలుసా?

 

    From the time we are born. We grate love and closeness from others....

 

    దాన్ని ఎలాగో మార్చేస్తోంది ఈ ప్రపంచం. ఏది ఏమైనా నాకు మాత్రం నీ మూలంగా శారీరక అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. శ్రీధర్ మూలంగా ఆ ఒకింత మానసికమయిన వెలితి పూడ్చుకోగలననే నమ్మకం నాకుంది.

 

    ఒకోసారి నామీద నాకూ అసంతృప్తి కలుగుతుంది.

 

    "We are supposed to make love instead of just doing sex..." అందామె పెద్దగా నిట్టూరుస్తూ.

 

    మొట్టమొదటిసారి తానెప్పుడూ చూడని, ఒక సరికొత్త మానవ ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా వుంది యోగికి.

 

    "Love crates stress and tension, sex relieves it అనంటారు గదా? మరి సెక్స్ తప్పెలా అవుతుంది?" అడిగాడు యోగి తానెక్కడో, ఎప్పుడో విన్నది గుర్తు తెచ్చుకుంటూ.

 

    "తప్పుకాదు. అప్పుడంటే నిజమయిన ప్రేమ మార్పిడి జరిగాక దానికి ముందే సెక్స్ తప్పు కాకపోయినా ఒప్పు మాత్రం కాదు" అంది మేరి అతని గుండెల్లో తలదూర్చుకుంటూ.

 

    "ఏమో...నాకైతే మాత్రం మనం చేస్తున్నది తప్పుకాదనే అనిపిస్తుంది..." అన్నాడు యోగి తన కార్య సాఫల్యతపట్ల లోలోన ఆందోళన చెందుతూ.

 

    "మన జనరేషన్స్ లో సెక్స్ అంటే ఎలా తయారయిపోయిందో తెలుసా? పార్కు చేసి కార్ల బ్యాక్ సీట్లలో, బేస్ మెంట్ రూమ్స్ లో, స్టోర్ రూమ్స్ పెండింగ్ ఫైల్స్ రాక్స్ వెనుక, బాత్ రూమ్స్ లో, కిక్వర్ సెక్స్ తో వేడిని తగ్గించేసుకుంటున్నాం. అదయ్యాక, ఒకసారి మనల్ని, మన అవసరాల్ని, మనుషుల్ని, భావోద్రేకాల్ని సమీక్షించుకుంటే, వచ్చే ఫలితమే మనసుల్ని గాయపెట్టేదవుతుంది.    

 

    Doing sex is a perfect way to suppress our hart felt feelings and to take intimacy at the same time. We can go at it with gusto, flesh to flesh, reach thundering orfasms and them convince ourselves that we have made deep, intimate cantact with one another. After all, we have just made love, have not we?"

 

    మేరీ తల ఎత్తి యోగి కళ్ళలోకి సూటిగా చూస్తూ అంది.

 

    ఆమె మాటలు వింటూనే అచేతనుడై పోయాడు యోగి. పిచ్చిమాటల్లా అనిపించే వెనుక పచ్చి నిజాలు...

 

    నిజమేనేమో... ప్రేమ, ఆరాధనా, సెక్స్ తో కూడుకున్న నేటి మానవ సంబంధాల్ని తిరిగి తీవ్రంగా సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమయిందేమో? అని అనిపించింది యోగికి.

 

    "ఇక ఇంతకంటే ఎక్కువ ఆలోచిస్తే ఈ రాత్రి, తనతో కల్సిన వెన్నెల్ని తీసుకుని నల్లమల అడవులకి వెళ్ళిపోతుందేమో..." అన్నాడు యోగి. సమీక్షకంటే సంతృప్తి ఎప్పుడూ గొప్పగానే వుంటుందని ఊహించుకుంటూ.

 

    యోగిలోని మేఘ ఘర్జన లాంటి కోరిక ముందు మేరికి కూడా మాట్లాడాలనిపించలేదు.


                                                        *    *    *    *