లేటెస్ట్ ఫ్యాషన్ - రంగ్ రేజ్ డిజైన్స్

ఈ రోజుల్లో ఏం చేసినా ఫ్యాషనే. రోజుకో కొత్త ఫ్యాషన్ వస్తుంటే ఏది సెలెక్ట్ చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అన్ని రకాల ఫ్యాషన్ ఐటమ్స్ లో, భారతీయ హస్తకళలు ఉట్టిపడేలా హ్యాండ్ పెయింటెడ్ జీన్స్ ఇంకా టీ షర్ట్స్ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయని తెలిస్తే ఆశ్చర్యంగా ఉంది కదూ. చేతితో వేసే ఏ పెయింట్ అయినా అందంగానే ఉంటుంది. అదే పెయింట్ ని మనం వేసుకునే బట్టల మీద చూసుకుంటే ఇంకా ఇంకా బాగుంటుంది. హస్తకళల సౌందర్యం కళ్ళకు కట్టినట్టు చూపిస్తూ మార్కెట్ లో బోలెడన్ని డిజైన్స్ తో హాట్ కేక్స్ లా అమ్ముడుపోతున్నాయి ఈ రంగ్ రేజ్ జీన్స్ అండ్ టీ షర్ట్స్. 

 

 

చేతితో వేసిన కథాకళి ముఖం ఉన్న ఈ  టీ షర్ట్స్ కాలేజీ కి వెళ్ళే అమ్మాయిలకి చాల బాగా నప్పుతాయి. ఎప్పుడు మాములు టీ షర్ట్స్ వేసుకుని వెళుతూ ఒక్కోసారి ఈ రకం హ్యాండ్ ప్రింట్ వి వేసుకుంటే చాలా చేంజ్ కనిపిస్తుంది. 

 

వైట్ కలర్ ప్లెయిన్ టీ షర్టు మీద పురి విప్పిన నెమలిని  ఎంతో అందంగా చిత్రీకరించారు. సాయంత్రాలప్పుడు బయటకి వేసుకెళ్ళటానికి బాగుంటుంది. ఎప్పుడూ వేసుకునే బట్టల కన్నా కాస్త వెరైటీగా కనిపిస్తుంది.

ఆరంజ్ కలర్ టీ షర్ట్ మీద కలశం నెత్తి మీద పెట్టుకున్న అమ్మాయి పెయింటింగ్ మనకి నిర్మలా పెయింటింగ్స్ ని గుర్తుచేస్తుంది. చూడటానికి ముదురు రంగులతో నిండి ఉన్న ఈ చిత్రం చూపరులని కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. 

నటరాజు నాట్యమాడుతున్నడా అని అనిపించేలా ఉన్న ఈ టీ షర్ట్ చాలా సింపుల్ అండ్ స్వీట్ గా కనిపిస్తుంది. అందరిలో మనం కొంచం ఎట్రాక్టివ్ గా కనపడాలంటే ఇలాంటిది  ఎన్నుకోవాల్సిందే. 

 

 జీన్స్ లో కూడా వెరైటీ డిజైన్స్ యువతను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎప్పుడూ ప్లెయిన్ గా కనపడే జీన్స్ మీద కూడా రకరకాల పెయింటింగ్స్ ఉండడంతో ఇవి ఫాషన్ కి మారుపేరుగా మారుతున్నాయి. నెమలిపింఛమ్ పెయింటింగ్ ఉన్న జీన్స్ ఎక్కువగా సేల్ అవుతోందని ఒక టాక్. 

 

రొటీన్ కి భిన్నంగా కనిపించే ఇలాంటి పెయింటింగ్స్ చేసిన జీన్స్ ని ఎవరు కోరుకోకుండా ఉంటారు. అందుకే ఇవి మార్కెట్లో తమ సత్తాని చాటుతున్నాయి. 

 

కేవలం అమ్మాయిలకి మాత్రమే కాదు అబ్బాయిలకి కూడా ఎన్నో రకాల డిజైన్స్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి ఈ రంగ్ రేజ్ కలెక్షన్స్. వయోలిన్ పెయింటింగ్, శివుడు ధ్యానం చేస్తున్నటుగా ఉన్న పెయింటింగ్, రకరకాల ఆకారాల్లో ఉన్న కట్టడాలు చిత్రించిన టీ షర్ట్స్ ఇంకా ఎన్నోరకాల సరికొత్త తరహా కలెక్షన్స్ ఉన్నాయి. మరి మీరు కూడా ట్రెండ్ కి తగ్గట్టు మీ స్టైల్ ని మార్చాలనుకుంటే ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ వైపు ఒక చూపు వెయ్యాల్సిందే. 

కళ్యాణి