అందమైన జుట్టుకి ఆహరం

అందమైన జుట్టు అమ్మాయిల అందాన్ని మరింత పెంచుతుంది. కానీ ఈ మధ్యకాలంలో జుట్టు రాలిపోవటం అన్న సమస్య పిల్లల నుంచి పెద్దల దాకా అందరిని ఇబ్బంది పెడుతోంది. ఆ సమస్యకి ఆహారంతో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అదెలా అంటే... రోజూ తీసుకునే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్ A,C,D, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, సెలీనియం, జింక్, కాల్షియం తప్పకుండా ఉండేలా చూసుకోవాలట.

ఇంత లిస్టు వింటుంటే కంగారుగా ఉందా? సరే మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే... అందమైన జుట్టు కావాలంటే రోజు చేపలు, నట్స్, ఆకుకూరలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.

చేపలు నుంచి అందే ప్రోటీన్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు.. మాడుని పొడి బారకుండా చేసి, తేమగా ఉంచుతాయి. సహజమైన నూనే ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. అలాగే బాదం, జీడిపప్పు వంటి నట్స్ లో ఉండే సెలీనియం జుట్టు ఎదగడానికి సహాయపడుతుంది. అలాగే వీటిల్లోని జింక్ జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. ఇక ఆకుకూరలు ఆరోగ్యానికే కాదు అందానికీ ముఖ్యమే. ముఖ్యంగా పాలకూర, తోటకూర వంటి ఆకుకూరల్లో ఉండే విటమిన్ A,C జుట్టు కుదుళ్ళు పొడిబారకుండా చేస్తాయి.

జుట్టు అందానికి ఏవేవో ప్రయత్నాలు చేసే అమ్మాయిలు కాస్త ఆహరం విషయంలో కూడా శ్రద్ధ పెడితే చాలు. మీ జుట్టు వత్తుగా, అందంగా పెరుగుతుంది అంటున్నారు నిపుణులు.

- రమ