మీకున్న ఆరోగ్యం మాకెక్కడిది?

 " మీరు తిన్న  తిండి వేరు, మీరు ఉన్న తీరు వేరు , మీకున్న ఆరోగ్యం మాకెక్కడిది? అంటూనే  ముక్కుతూ మూలుగు తూనే  వాషింగ్ మెషిన్, లు మిక్సీలు, ఓవెన్ లు, తెగ వాడేస్తుంటారు ఇప్పటితరం ఇళ్లాళ్ళు. అయితే కొత్త తరం, కొత్త ఆలోచనలు, కొత్త జీవిత విధానంలో, తీరిక లేక ఇలాంటి పరికరాలు వాడడంలో ఎలాంటి తప్పు లేనే లేదు. కొత్త పరికరాలు పుట్టెదే మన హడావిడి జీవితానికి కాస్త ఊరట ఇవ్వడానికి.

కానీ వచ్చిన చిక్కు ఏంటంటే అవి మన శరీరాన్ని అలసత్వానికి గురిచేస్తున్నాయి. ఎప్పుడైనా అవి లేని పక్షం లో ఊపిరి ఆడనట్టు అయిపోతున్నారు ఆడవాళ్ళు (ఇంట్లో పని మగవాళ్ళు చూస్తుంటే వారు కూడా అనుకోండి)  శరీరానికన్న మేధడుకి ఎక్కువ పని చెప్పడం వల్ల శరీరం బరువెక్కి అనేక రకాలైన రోగాలపాలవుతోంది. అలా అని వాటిని వాడడమా ఆపలేము. మరి అంచి ఆరోగ్యానికి దారెది అంటే...మీ చేతిలోనే ఉంధి.

1) ఆహారం లో జాగ్రతలు తీసుకోండి ,అందరికీ వడ్డించాక మిగిలినవి కాకుండా మీకు కూడా ఉండేలా వండుకోండి. ఆకుకూరలు, పళ్ళు పిల్లలకే కాదు అమ్మలుగా మీకు కూడా చాలా అవసరం అని తెలుసుకోండి.

2) ఎక్కడ కూర్చుంటే అక్కడికి "ఇది తీసుకురా, అది అందించు" అంటూ పిల్లలనో పనివాళ్లనో పురమాయించకండి. ప్రతి పని మీకు మీరే చేసుకోండీ. శరీరం కాస్త మాట వింటుంది.

 

3) రోజు వాకింగ్, యోగా లాంటి పనులు ఏవో ఒకటి చేయండి. అయితే మీ ఒక్కరే చేస్తే మానేసెంత బద్ధకం రావడం తధ్యం. అందుకే ఎవరినైనా జత కలుపుకోండి. అప్పుడు మీ బద్దకాన్నివారు , వారి బద్దకాన్ని మీరు వదలకొట్టుకోవచ్చు.

4) ఆఫీసులో ఉన్నా ఇంట్లో ఉన్నా సెల్ లో కాల్  వచ్చినప్పుడు లేచి అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి. అప్పుడు నడకకి నడకా మాటలకి మాటలు రెండు అయిపోతాయి . అలా అని సిగ్నల్ లేని వైపు వెళ్ళి కాల్ కట్ అయితే నన్ను తిట్టుకోకండి.

5) చివరిగా మీరు ఆరోగ్యంగా  లేనిదే మీ కుటుంబంలోని వారి ఆరోగ్యాలు సరిగ్గా ఉండేలా చూసుకోలేరు, కనీసం అందుకోసమైన "బంగారు తల్లుల్లా" మాట విని మీ ఆరోగ్యం భద్రం గా ఉంచుకోండి.

--Pushpa