తలనొప్పి తగ్గడానికి 10 చిట్కాలు

Home Remedies for Headache

                                         

                                      తలనొప్పికి కారణాలేవైనా కావచ్చు, దాని ఎఫెక్ట్ మాత్రం మామూలుగా ఉండదు. అందుకే మనలో చాలామంది తలనొప్పి లక్షణాలు కనబడగానే తొందరపడి ఇష్టం వచ్చిన టాబ్లెట్ లు వేసుకుంటుంటారు, అవి తాత్కాలింగా ఉపశమనం కలిగించినా ఎన్నో రకాల సైడ్ ఎఫెక్ట్ లు కూడా కలిగిస్తాయి. తరచూ తలనొప్పి వస్తుంటే డాక్టర్ ని సంప్రదించడం అన్నిరకాలుగా శ్రేయస్కరం. దానికన్నా ముందు టాబ్లెట్ లకు బదులు తలనొప్పి తగ్గడానికి కొన్ని అనువైన చిట్కాలు 

తల నొప్పి తగ్గడానికి 10 చిట్కాలు :

  ఒక్కోసారి విపరీతమైన తలనొప్పికి డీ హైడ్రేషన్ కూడా కారణమవ్వచ్చు. అందుకని ఒక గ్లాసు నిండా చల్లటి నీళ్ళు తాగండి. అంతే తలనొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు.

తల మసాజ్ : మీకు మసాజ్ గురించి తెలిసే ఉంటుంది. రాకరకాల స్ట్రెస్ నుండి రిలీఫ్ పొందాలన్నా, టెన్షన్ నుండి రిలాక్స్ అవ్వాలన్నా మసాజ్ చక్కటి పధ్ధతి. తలనొప్పికి పని ఒత్తిడి కూడా కారణం. కాబట్టి తల , మెడ మసాజ్ చేస్తే తలనొప్పి ఇట్టే తగ్గిపోతుంది.

ఆరోమా థెరపీ: ఆరోమా థెరపి అన్ని రకాల శ్రేయస్కరం. చందనం, మిరియాలు, యూకలిప్టస్, లావెండర్ మరియు రకరకాల ఔషధాలతో తయారైనది. తలనొప్పి దూరం చేయడానికి ఇది చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.

వేడి నీళ్ళతో తల స్నానం : తల నొప్పి ఎక్కువగా ఉంటే గోరువెచ్చటి నీటితో తల స్నానం చేసేయండి. తలనొప్పిని చేతితో తీసిపడేసినట్టుగా, రిలాక్స్ గా ఫీలవుతారు.

ఐస్ ప్యాక్ : తలనొప్పి తగ్గడానికి ఐస్ ప్యాక్ కూడా ఉపకరిస్తుంది. ఒక శుభ్రమైన టవల్ లో చల్లగా ఉండే ఏదైనా వస్తువును చుట్టి మీకు ఎక్కడైతే నొప్పిగా ఉందో అక్కడ కాసేపు పెట్టుకుంటే సరి. నొప్పి మాయమవుతుంది. .

ప్రెజర్ పాయింట్స్ ని నొక్కి ఉంచడం : మన అరచేతిలో ముఖ్యంగా మన చూపుడు వేలుకు, బొటన వేలుకు మధ్య ఉండే ప్రదేశంలో కరెక్టుగా ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి. వాటిని 2, 3 నిమిషాల పాటు నొక్కి ఉంచినట్లయితే తలనొప్పి తగ్గిపోతుంది.

రిలాక్స్ అవ్వడం : తలనొప్పి చిరాకు తెప్పిస్తుందనుకుంటే కాసేపు అన్ని పనులను పక్కన పెట్టేసి రిలాక్స్ అవ్వడం మేలు. దీనివల్ల అలసట తగ్గి తలనొప్పి హుష్కాకి అయిపోతుంది.

డైట్ : ఒక్కోసారి మనం తీసుకునే ఆహారం కూడా మన తలనొప్పికి కారణమవ్వచ్చు. కాబట్టి మీ ఆహార పద్ధతులను మార్చేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది.

కాల్షియం సప్లిమెంట్ :  కాల్షియం సప్లిమెంట్ వల్ల రక్తప్రసరణ జరిగి మీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఒక గ్లాసు నిండా ఆరెంజ్ జ్యూస్ తాగడం లేదా మెగ్నీషియం, కాల్షియం ఉండే సప్లిమెంట్ తీసుకున్నా తలనొప్పి నుండి రిలీఫ్ ని ఇస్తుంది.

ఎక్సర్ సైజు : సాధారణ తలనొప్పి ఉన్నవాళ్ళకు ఇది మంచి చిట్కా, అనువైన ఎక్సర్ సైజు ను ఎంచుకుని చేయడం మంచిది. తద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడి తలనొప్పి తగ్గే అవకాశాలు ఉన్నాయి