"నేనంటే- ఎవరండీ..." మళ్ళీ ఆ ప్రిన్సిపల్ ప్రశ్నించింది.

 

    "నాపేరు అవినాష్..." చెప్పాడతను.

 

    "అలాగే... మీరొచ్చారని చెప్తాన్లెండి..." ఆ మాటను విన్పించుకోలేదు అవినాష్.

 

    గబగబా నడుస్తూ కాలేజీ బయటికొచ్చి, ఆటో ఎక్కాడు.

 

    "రామకృష్ణా బీచ్ కి పోనీ..." ఆటోవాడితో చెప్పాడు.

 

    మరో పదినిమిషాల్లో ఆటో రామకృష్ణా బీచ్ లోని క్వాలిటీ రెస్టారెంట్ ముందు ఆగింది.

 

    ఆటోదిగి, డబ్బులిచ్చేసి, అక్కడే ఉన్న పబ్లిక్ బూత్ లోంచి రోష్ణీకి ఫోన్ చేశాడు.

 

    "ఎక్కణ్ణించీ..." రోష్ణీ అట్నించి అడిగింది.

 

    "రామకృష్ణా బీచ్...ఒకసారి రాగూడదూ...నిన్ను చూడాలని ఉంది..."

 

    "లేడికి లేచిందే వేళట..." వెక్కిరింతగా, ఫోన్లోనే వెక్కిరిస్తూ అంది.

 

    "లేడీకి లేచిందే వేళకాదా..." ఇట్నించి అన్నాడు అవినాష్.

 

    "కానీ నేను రాలేను...."

 

    "ప్లీజ్...ఒక్కసారి...కనికరించు- ఆ మాత్రం దయలేదా నీ మెత్తని హృదయంలో..." మెత్తని అన్నమాటను వత్తి పలుకుతూ అన్నాడు అవినాష్ కావాలనే.

 

    "నా మెత్తని హృదయంలో దయలేదు కానీ... పోన్లో నువ్వు మాట్లాడే ట్రాష్ ఆపు..."

 

    "నేనిప్పుడేం ట్రాష్ మాట్లాడాను..."

 

    "ఏం మాట్లాడేవో నీకు తెలీదా..."

 

    "పోనీ ఇంతకీ నువ్వొస్తావా... రావా... ఆఖరుసారిగా చెప్పు-"

 

    "నేనివాళ ఈవెనింగ్ విజయవాడ వెళ్తున్నాను...మళ్ళీ ఓ మూడ్రోజుల తర్వాత వస్తాను-"

 

    "అర్జెంటుగా ఊరేమిటి?"

 

    "రహస్యంలే... ఇక్కడే పదినిమిషాలు వెయిట్ చేస్తాను- నువ్వు రాకపోతే- వెళ్ళిపోతాను... సరిగ్గా పదినిమిషాలు మాత్రమే..."

 

    ఫోన్ పెట్టేశాడు అవినాష్.

 

    రెస్టారెంట్లో కూల్ డ్రింక్ తాగుతూ నిమిషాలు లెక్క పెడుతున్నాడు.

 

    సరిగ్గా పదకొండో నిమిషంలో....

 

    క్వాలిటీ ఎదురుగా ఉన్న రోడ్డుమీద మారుతీకారు కన్పించింది. రోడ్డుపక్కన కారాపి, పరుగుపరుగున లోనకొచ్చింది రోష్ణీ.

 

    "నీతో అంతా గొడవే..." అంటూ కూర్చుంది.

 

    ఆ సమయంలో రెస్టారెంట్ ఖాళీగా ఉంది. కౌంటర్ దగ్గర సర్వర్ ఒక్కడే ఉన్నాడు. అద్దాల్లోంచి కనిపిస్తూ నీలి మొఖమల్ తెరలా దూరంగా సముద్రం...

 

    లిప్ స్టిక్ రాసుకున్న రోష్ణీ ఎర్రటి పెదాలవేపు చూస్తున్నాడు అవినాష్.

 

    "ఏమిటలా చూస్తున్నావ్...."

 

    "నీ పెదాల్లో ఏవుందట..."

 

    "నీ పెదాలు, నా పెదాలు కలిస్తే ఏమౌతుందో చెప్పుకో చూద్దాం"

 

    "నీ పెదాలు, నా పెదాలు కలిస్తే మన పెదాలౌతాయి. ఆమాత్రం తెలీదా-" గడ్డుగ్గా అంది రోష్ణీ.

 

    "దట్స్ రాంగ్...."

 

    "మరేమిటట...."

 

    "నీ పెదాలు...నా పెదాలు కలిస్తే చప్పుడొస్తుంది. ఆ మాత్రం తెలీదా-" ఉడికించాడు అవినాష్.

 

    "తెలీదు-" ఉక్రోషంగా అంది రోష్ణీ.

 

    "తెలీదా...నిజంగా తెలీదా-" అని అటూ ఇటూ చూశాడు.

 

    కౌంటర్ దగ్గరున్న సర్వర్ పక్కకేదో పనిమీద వెళ్ళాడు.

 

    అక్కడంతా నిశ్శబ్దంగా ఉంది. ‍‌‍‍‍‌‌‍

 

    చటుక్కున ‍‌రెండు చేతులతో రోష్ణి భుజాలను పట్టుకొని ముందుకు లాగి ఆమె పెదవుల్ని అందుకొని కాంక్షగా కొరికేస్తున్నట్టుగా ముద్దు పెట్టుకున్నాడు.

 

    రోష్ణీ వదిలించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది.

 

    "అబ్బా...బ్బా...హు...హు..." రోష్ణీ గొంతులో తియ్యని మూలుగు.

 

    "ఛీ-వదులు..." నెమ్మదిగా అంది.

 

    అయినా అవినాష్ వదల్లేదు.

 

     రోష్ణి భుజంమీద అంతవరకూ ఉన్న అవినాష్ కుడిచేయి నెమ్మదిగా ముందుకు జరజరా కదిలి ఆమె ఎదమీద పడింది.

 

    పైటచాటున, నీలిరంగు జాకెట్టుమీద అవినాష్ చేయి...

 

    జాకెట్టు మెత్తదనం. నైలాన్ బ్రా మెత్తదనం. ఆ కింద రోష్ణి వయసు మెత్తదనం. ఆ మెత్తదనమ్మీద అవినాష్ చెయ్యి.

 

    ఆ సుఖం రోష్ణి వయసుకి కావాలి. ఆ సుఖమే అవినాష్ లోని జంతువుకి కావాలి.

 

    గట్టిగా, ఇంకా గట్టిగా, అవినాష్ రోష్ణీ ఆ వయసుని నలిపేస్తున్నాడు.

 

    పదిసెకండ్ల పాటు రోష్ణీ ప్రతిఘటించలేదు.

 

    ఆ తర్వాత విసురుగా అవినాష్ చేతుల్ని విదిలించుకుని అక్కడ నుంచి లేచిపోయింది.

 

    ఛీ... అల్లరి...' అంటూ పక్కకు తిరిగి పైటను సర్దుకుని, పెదాల్ని పైట చెంగుతో అద్దుకుని-

 

    "ఐయామ్ గోయింగ్..." అంది.

 

    అవినాష్ కూడా విసుగ్గా లేచాడు. బిల్లు చెల్లించి బయటకొచ్చాడు.

 

    ఇద్దరూ కార్లో కూర్చున్నారు.

 

    చాలా సేపటి వరకూ రోష్ణీ, అవినాష్ తో మాట్లాడలేదు.

 

    "కోపం వచ్చిందా..." రోష్ణీ గోళ్ళను స్పృశిస్తూ అన్నాడు అవినాష్.

 

    "రాదా...నీకేం తెలీదు... నీకెక్కడ బుద్ధిపుడితే అక్కడేనా" చిరుకోపంగా అంది.