అమెరికాకు తీసిపోని ఇండియన్ ఫాషన్ డిజైనర్స్

ఈ తరం పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకుంటున్నవి డిజైనర్ వేర్. ఈమధ్యకాలంలో డ్రెస్ కాన్షస్ బాగా పెరిగింది. మనది పేద దేశమే అయినా అనేకమంది డిజైనర్ వేర్ పట్ల మొగ్గు చూపుతున్నారు. వాటికి అలవాటు పడుతున్నారు. డిజైనర్ దుస్తులు అందంగా, కంఫర్టబుల్ గా ఉంటాయని చెప్తున్నారు. తమ వార్డ్ రోబ్ ను డిజైనర్ వేర్ తో అలంకరిస్తున్నారు. పార్టీలకు, ఫంక్షన్లకే కాకుండా కాజువల్ వేర్ గా కూడా డిజైనర్ క్లోత్స్ వాడుతున్నారు.

ఇంతకీ డిజైనర్ వేర్ అంటే ఏమిటి? ఏదో మామూలు టైలర్స్ కత్తిరించి కుట్టినవి కాకుండా ఒక ఫాషన్ డిజైనర్ సరికొత్త తరహాలో ఆలోచించి, రూపొందించినవి.

ఫాషనబుల్ గా, క్రియేటివ్ గా, ఎట్రాక్టీవ్ గా, ఎక్స్ట్రార్డినరీగా ఉండే డిజైనర్ క్లోత్స్ చాలా ఎక్స్ పెన్సీవ్ అని తెలుసు కదా. అయినా వీటిని కొంటున్నారు, ఆనందిస్తున్నారు. మన దేశం ఎందులోనూ తీసిపోదని మధురా గార్మెంట్స్, అరవింద్ మిల్స్, ఆదిత్య బిర్లా లాంటి టెక్స్టైల్ కంపెనీలు చాటిచెప్తున్నాయి. పోటీపడి ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆకర్షణీయమైన దుస్తులను రూపొందిస్తున్నాయి. ఇతర దేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి.

హేమంత్ త్రివేది, మనీష్ మల్హోత్రా, రోహిత్ గాంధీ అండ్ రాహుల్ ఖన్నా లాంటి ఫాషన్ డిజైనర్స్ ప్రపంచ ప్రసిద్ధి పొందారు.