ఫేస్ యోగా

ఆ మధ్య ఓ సినిమా వచ్చింది. అందులో షాయాజీ షిండే ఫేస్ యోగా పేరుతో అష్టవంకర్లు తిప్పుతుంటాడు. ఎందుకంటే ముఖానికి ఎక్సర్ సైజ్ అంటాడు. ముడతలు మాయం అవ్వడానికి ఇది చేస్తున్నానంటూ చెప్పుకొస్తాడు. సినిమా వరకు దీన్ని సరదాగా తీసుకున్నా ఇప్పుడు ఇదే ఫేస్ యోగా హైదరాబాద్ లో హాట్ టాపిక్ గా మారింది. ఫేస్ యోగా కల్చర్ ను సిటీలో ప్రవేశపెట్టడానికి ఎక్స్ పర్ట్స్ ప్లాన్ చేస్తున్నారు. కొద్దిరోజుల్లోనే ఇది పాపులర్ కావడం ఖాయమంటున్నారు నేర్చుకుంటున్న చాలామంది.


        ఇంతకీ ఫేస్ యోగా అంటే ఎలా ఉంటుంది అనే కదా మీ డౌటు. ఏం లేదండి కొన్ని ట్రిక్స్ ఉంటాయి. దాని ప్రకారం ముఖాన్ని పలు రంగాలు భంగిమల్లో వంకర టింకరగా తిప్పుతూ ఉండాలి. అది కూడా కొంచెం సమయమే. గంటలు గంటలు చేయాల్సిన అవసరం లేదు.  నవ్వొచ్చినా ఇది నిజం.


        బాడీ స్ట్రక్చర్ ను కంట్రోల్ లో పెట్టుకోవడానికైతే జిమ్ లు ఉన్నాయి. లేకపోతే సర్జరీలు ఉండనే ఉన్నాయి. అదే ముఖంలో కొత్త కళ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి. దానికి పరిష్కారమే ఫేస్ యోగా. ఆ ఏముంది అని ఈజీగా తీసుకోవద్దు. ఎందుకంటే ఫేస్ యోగాతో చాలా లాభాలున్నాయి. ముఖంపై మడతలు ఈజీగా పోతాయట. ఫేస్ యోగాను ఫాలో అయితే నవ్వ యవ్వనంతో కనిపించడం ఖాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖంపై మడతలు పోవడానికి సర్జరీలు చేసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కళ్ల కింద నల్లచారలు లాంటివి కూడా పోతాయంటున్నారు. ప్రస్తుతానికి ఫేస్ యోగా కూడా గురించి ఆరా తీస్తున్నవాళ్లు చాలామందే ఉన్నారట. అందుకే విదేశాల్లో ఇప్పటికే ఇది బాగా పాపులర్ అయ్యింది. త్వరలో మన దగ్గర దీనికి మంచి పాపులారిటీ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది. ఇంకేముంది వంటికి యోగా మంచిదే కదా అంటూ ఫేస్ యోగాను ఫాలో అయిపోదామా మరి.