"గురు హరిదాసు" సత్యేంద్ర తేరుకోకముందే మరో ప్రశ్న అడిగాడు రోహిత్ - బతాన్ సేన్ ని సంగీతంలో ఓడించిన ప్రముఖ సంగీత విద్వాంసుడి పేరు?"
    
    "తెలీదు."
    
    "బైజు బ్రావా" జవాబు చెప్పాడు రోహిత్.
    
    "తాన్ సేన్ హిందువా, ముస్లిమా?"
    
    "ముస్లిం."
    
    "రాంగ్! ముస్లింగా మారిన హిందువు. అతడు గ్వాలియర్ లో పుట్టింది ఓ బ్రాహ్మణ కుటుంబములో" రోహిత్ ప్రేక్షకుల్ని గమనించడంలేదు" ప్రపంచంలో అత్యధిక వర్ణమాల గల భాష ఏది?"
    
    "తెలీదు."
    
    "కంబోడియన్ భాష, అందులో డెబ్బై నాలుగు అక్షరాలున్నాయి" నెక్స్టు "ప్రంపంచములో అతి స్వల్పమైన అక్షరాలున్న భాష ఏది?"
    
    "తెలీదు."
    
    "సోలమన్! దీనికి చెందిన రోటోకాస్ భాషలో ఉన్నది పదకొండు అక్షరాలు "మిస్టర్ సత్యేంద్రా! ఓ వ్యక్తి నిముషానికి వంద నంబర్ల చొప్పున రోజుకు ఎనిమిది గంటలు లెక్కపెడితే, అలా వారానికి అయిదు రోజులు కేటాయిస్తే మిలియన్ అంకెల్ని లెక్కపెట్టడానికి ఎంతకాలం అవసర మవుతుంది?"
    
    నిశ్శబ్దంగా వుండిపోయాడు సత్యేంద్ర.
    
    "ఎనభై సంవత్సరాలు" చెప్పాడు రోహిత్.
    
    ప్రణయ నిశ్చేష్టురాలైపోయింది. తను అనుమానించినట్టు రోహిత్ సత్యేంద్ర, వాసుదేవరావులతో చేతులు కలవలేదు. అదే నిజమైతే పొంతన లేని ప్రశ్నలతో సత్యేంద్రనిలా కంగారు పెట్టేవాడు కాదు. సత్యేంద్రని మించి జేబురించిన మొహంతో చూస్తున్న వాసుదేవరావు ముఖకవళికలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
    
    "మిస్టర్ సత్యేంద్రా! ఓ వస్తువు ఖరీదు దాన్ని ఉత్పత్తి చేసిన కార్మికుడికి చెల్లించిన ధరకి సమానమని చెప్పిన పద్దెనిమిదో శతాబ్దం ఇంగ్లీషు ఎకనమిస్ట్ పేరేమిటి?"
    
    "తెలీదు."
    
    "డేవిడ్ రికార్డో ఆధునిక సిమెంటు కట్టడాల్లో ఇప్పటికీ అమలులో వున్న ఇనుప ఊచలతో కలిపిన రియిన్ ఫోర్సెడ్ సిమెంటు పద్దతి అన్నది 1849లో ఓ తోటమాలి తయారుచేసిన పూల తొట్టెలనుంచి వారసత్వంగా వచ్చింది. పూల తొట్టెలకి అలా ఇనుప ఊచల్ని రియిన్ ఫోర్స్ మెంటుగా వాడి సాంకేతికంగా ఇప్పటి నిర్మాణాలకి సహకరించిన ఆ వ్యక్తి పేరు ఏమిటి?"
    
    "తెలీదు."
    
    "ఫ్రాన్స్ దేశానికి చెందిన జోసెఫ్ మోనీర్" క్షణం ఆగాడు రోహిత్. "ముందు చక్రాలకి బేలన్స్ కోసం, సరయిన బరువు కోసం కారు ఇంజన్ ముందువైపే వుండాలని కార్ల చరిత్రలో తొలిసారి సూచించి, డిజైన్ చేసిన ఇంజనీర్ ఎవరు?"
    
    "తెలీదు."
    
    "ఫ్రాన్స్ దేశానికి చెందిన రెనీపాన్ హార్డ్ ఎమిలీ లెవాస్సర్. "ప్రపంచంలో మొదటిసారి పేరాచూట్ వాడిన వ్యక్తి పేరేమిటి?"
    
    "తెలీదు."
    
    "ఫ్రాన్స్ లో మోంటి పిల్గర్ అబ్జర్వేటీ భవనం నుంచి కిందికి దూకిన సెబాస్టియన్ లెనార్ మెండ్. తరువాత..." మిణుగురు పురుగుల్లాగే చీకటిలో మెరిసే మొక్కలు ఎక్కడున్నాయి? వాటి పేరేమిటి?"
    
    సత్యేంద్ర గొంతు పిడచకట్టుకుపోయింది- తెలీదు."
    
    "జపాన్ దీవి హాబిజోలో పెరిగే మికానో లక్స్ కాయిల్లి మొక్కలు. చీకటిలో ఏభై అడుగుల దూరంలో నిలబడి ఈ మొక్కల్ని గుర్తించొచ్చు" వాచ్ చూసుకున్నాడు రోహిత్. "సీల్స్ అనే సముద్రప్రాణులు ప్రతి ఏడాది ఒకచోట కలుసుకుంటాయి. సుమారు పదిహేను లక్షల సంఖ్యలో కలుసుకుని ఆ సమావేశంలో అయిదు లక్షల పిల్లలదాకా ఉత్పత్తిని చేస్తాయి. ఆ ప్రదేశం ఎక్కడ, ఏ సముద్రంలో?"
    
    సత్యేంద్ర మొహంలో అసహనం పేరుకుపోతుంటే- "నో.... తెలీదు" అన్నాడు.
    
    "సముద్రపు గిత్తలుగా వ్యవహారం పొందిన ఈ సీల్స్ అలాస్కా ప్రాంతంలోని బ్రిలోఫ్ దీవి దగ్గర బేరింగ్ సముద్రంలో యిలా సమావేశ మౌతుంటాయి. "నెక్స్ట్- ప్రస్తుతం మన పోలీస్ డిపార్టు మెంటులో ఎక్కువగా ఉపయోగించే కుక్కలు డాబర్ మెన్ కి ఆ పేరెలా వచ్చింది?"
    
    "తెలీదు."
    
    చెప్పాడు రోహిత్- "జర్మనీలో పన్నులు వసూలు చేసే టాక్స్ కలెక్టర్ డేవిడ్ డాబర్ మన్ తన ఉద్యోగంలో చాలా చోట్లకి ధైర్యంగా తిరగాల్సి రావడంతో 1880లో ఈ బ్రీడ్ ని అభివృద్ధి పరిచాడు. అతడిపేరే ఆ డాగ్స్ కి స్థిరపడిపోయింది. "ప్రముఖ రచయిత ఛార్లెస్ డికెన్స్ కలంపేరు ఏమిటి?"
    
    "తెలీదు."
    
    "మెక్సిమ్ గోర్కీ."
    
    అవాక్కైపోయాడు సత్యేంద్ర.
    
    "ప్రావ్డా అనే రష్యన్ పత్రిక వుందని మీకు తెలుసు. లెనిన్ స్థాపించిన ఈ ప్రావ్దాకి రష్యా భాషలో అర్ధమేమిటి?"
    
    "వార్త."
    
    "రాంగ్ ప్రావ్డా అంటే వార్తకాదు సత్యం." మైలవ్ అండ్ వర్క్ రచయిత ఎవరు?"
    
    "కార్ల ఉత్పత్తిలో ప్రపంచ ప్రసిద్ది చెందిన హెన్రీ ఫోర్డ్."
    
    "ఫైన్ బ్రహ్మనుంచి వేదాలు దొంగిలించుకుపోయిన రాక్షసద్వయం ఎవరు?"
    
    తెలీదన్నట్టుగా వుండిపోయాడు సత్యేంద్ర.

    "మధుకైటభులు" చెప్పాడు రోహిత్. "క్రికెటర్ లో వెస్టిండీస్ పై డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు?"
    
    "దిలీప్ సర్డేశాయ్."
    
    "థాంక్యూ మిస్టర్ సత్యేంద్రా" ఉద్విగ్నంగా మైక్ ముందు కొచ్చిన రోహిత్ ప్రేక్షకుల కరతాళధ్వనుల మధ్య ఉత్సాహంగా చెప్పుకుపోయాడు. "సత్యేంద్రని అడిగిన మొత్తం ముఫ్ఫయ్ ప్రశ్నల్లో అతడు జవాబు చెప్పగలిగింది కేవలం ఐదు ప్రశ్నలకే కావడంతో, మొత్తం 155 మార్కులు స్కోర్ చేసిన సత్యేంద్ర కన్నా 220 మార్కులు స్కోర్ చేసిన అదిత్యని విన్నర్ గా నిర్ణయిస్తున్నాను. లెట్స్ గివ్ ఏ క్లాప్స్ టు..."