సమ్మర్ లో చర్మఛాయ చిట్కాలు


సమ్మర్ వచ్చిందంటే చాలు చాలా మంది బయటకు రావడానికి కూడా బయపడతారు ఎక్కడ ముఖం నల్లబడిపోతుందో అని. అలా అని ఎక్కడికీ వెళ్లకుండా ఉండలేము కదా. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు మనం తప్పనిసారిగా పాటించుకోవాలి. పెరుగు... ఈ వేసవిలో పెరుగు తింటే ఎంత చలవ చేస్తుందో మన ముఖారవిందాన్ని కాపాడటంలో కూడా ఉపయోగపడుతుంది. అదెలాగో చూద్దాం.

1. ఈ సమ్మర్ లో ఎండ వల్ల నిరంతరం చెమట వస్తూనే ఉంటుంది. దీని వల్ల ముఖంపై రాషస్ రావడం, ముఖం మండటం జరుగుతుంది. అలాంటప్పుడు పెరుగును పట్టిస్తే చల్లగా ఉండటమే కాకుండా అందులో ఉండే జింక్ ముఖానికి ఉన్న టాన్ కూడా పోగొడుతుంది.

2. సూర్యరశ్మి వల్ల ముఖంలో పోషణ తగ్గిపోతుంది. దీని వల్ల చర్మ పొడిబారినట్టు అయిపోతుంది. అటువంటి సమయంలో పెరుగును ముఖానికి రాసి చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

3. పెరుగులో ఆరెంజ్ తొక్కల పౌడర్ ను కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో కాంతివంతంగా మారుతుంది.

4. పెరుగులో కొంచెం తేనె, నిమ్మరసం కలిపి రాసుకొని ఓ పదినిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీనివల్ల మీ చర్మం మృదువుగా తయారవుతుంది.

5. పెరుగులో పెసరపిండి కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్ కు మాస్క్ లా వేసుకుంటే కాంతివంతమైన చర్మం మీ సొంతమవుతుంది.