లేసింగ్‌ డ్రెస్సుల స్టైలే వేరంటున్నారు నేటి యువతులు. ఫ్యాషన్‌ ట్రెండ్‌లను సృష్టించే డిజైనర్స్‌కు కూడా ఈ డ్రెస్సులు నచ్చుతున్నాయంటే వీటి స్టైల్‌ ఏంటో తెలుస్తుంది. ఇవి ఫ్యాషన్‌ ట్రెండ్‌తో సంబంధం లేకుండా ఏ కాలంలో నైనా ఆడవాళ్లు వేసుకోవచ్చు. వీటిని ధరించినప్పుడు ఇవి రొమాంటిక్‌ ఫీలింగ్‌ను కలుగజేస్తాయి.

 

ఈ డ్రెస్సులే గాకుండా ఏదైనా లేస్‌లు లేనివి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. యువతుల్ని పదిమందిలో ప్రత్యేకంగా కనిపించేటట్టు చేస్తాయి ఈ వెరైటీ దుస్తులు. ఇపుడు మార్కెట్లో లేసులతో జాకెట్స్‌, ఓవర్‌ కోట్స్‌ కూడా లభిస్తున్నాయి. పార్టీలకు, పబ్బులకు వెళ్ళినప్పుడు కానీ, లేదంటే ఏదైనా స్టైలిష్ ఫంక్షన్స్ లకు వెళ్ళినపుడు ఇలాంటి డ్రెస్సులు వేస్తే ఇక మీరే హీరోయిన్.