వాటర్ బాటిల్స్ తో కలర్ ఫుల్ లైట్స్

 

 

మనం వాడేసిన వాటర్ బాటేల్స్ డస్ట్ బిన్ లో పడేయకుండా అందమైన కలర్ ఫుల్ లైట్స్ ఎలా చేసుకోవాలో క్రింద ఇచ్చిన 6 స్టెప్స్ తో చూపించాం..

 

కావలసినవి :

                 వాటర్ బాటేల్స్

                  అక్రోలిక్ పైంట్స్

                   కత్తెర

                   సిరియల్ లైట్స్

·    

 1. కాళీ వాటర్ బాటేల్స్ తీసుకుని మూత తీయకుండా ఫోటోలో చూపించినట్టు కొంత పార్ట్ వరకు కట్ చేసుకోవాలి.

2. ఆ కట్ చేసుకున్న పార్ట్ ని నిలువుగా ఫ్లవర్ కి ఎన్ని పెటెల్స్ కావాలో అన్నింటిని సమానంగా కోలుచుకుని కత్తెరతో కట్ చేసుకోవాలి. 

3. అలా కట్ చేసుకున్న పార్ట్స్ ని వెనక్కి  బెండ్ చేసుకోవాలి. ఫోటో లో  చూపించినట్టుగా అన్ని ఇలానే చేసుకోవాలి. ఇప్పుడు అది చూడడానికి ఫ్లవర్ లా వుంటుంది.

4. ఇలా కట్ చేసుకున్న వాటికి  మనకు నచ్చిన కలర్ వేసుకోవాలి. ఏ కలర్ అయితే మనం వేస్తామో అదే కలర్ మనం  లైట్ వేసినపుడు వెలిగుతుంది. పెటల్స్ కి కలర్ వేసిన తరువాత రెండు గంటలు డ్రై అవ్వనివ్వాలి.

5. ఇప్పుడు వాటికున్న బాటిల్ మూతకూ రంధ్రం చేసి లైట్స్ ని మూతలో  సెట్ చేసుకోవాలి.

6. ఇప్పుడు సిరియల్ లైట్స్ ని మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకుని పండగలకి,పార్టీలకి  డెకరేట్ చేసుకోవచ్చు
     
మీరు కూడా ట్రై చేస్తారు గా మరీ