ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్

స్ట్రాబెర్రీ ప్యాక్:
జిడ్డు చర్మతత్వం వున్న వాళ్లకు ఈ పండుతో వేసే పూత చాలా బాగా పనిచేస్తుంది. చెంచా స్ట్రాబెర్రీ రసం, ముల్తానీమట్టి, కలబంద గుజ్జు చెంచా చొప్పున, అరచెంచా తేనెతో కలిపి పూతలా వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని ఆరాక కడిగేసుకోవాలి. ఈ పూతతో మొటిమలు తగ్గుతాయి. అధిక జిడ్డు వదులుతుంది. ఈ పూతను వారానికి మూడుసార్లు వేసుకోవచ్చు. పొడిబారిన చర్మతత్వం ఉన్న వాళ్లు ఈ ప్యాక్‌ని ప్రయత్నించకూడదు. ఎందుకంటే ఈ పండులో అధికంగా ఉండే సి విటమిన్‌ చర్మాన్ని మరింత పొడిగా మారుస్తుంది.

ఖర్జూర ప్యాక్‌:

నాలుగైదు ఎండు ఖర్జూరాల్ని నీళ్లల్లో నాలుగు గంటలు నానబెట్టాలి. తరువాత చిక్కగా చేసుకుని, అందులో చెంచా పాలపొడి వేసి బాగా కలిపి ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరాక కడిగేసుకుంటే ఫలితం ఉంటుంది. ఎండు ఖర్జూరాలే కాదు.. బజార్లో దొరికే గింజల్లేని తాజా వాటిని కూడా ప్రయ త్నించవచ్చు.

ఆరెంజ్ ఫేస్ ప్యాక్:
 ఈ ఫేస్ ప్యాక్. చర్మంలోని సహజసిద్ధమైన జిడ్డుగా చేసే లిల్లి స్కిన్ కోసం ప్రత్యేకంగా తయారైంది చర్మంలోని అదనపు జిడ్డును, మచ్చలను ఇది తొలగిస్తుంది. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ ను ఆరెంజ్ జ్యూస్ లేదా ఎండిన తొక్కలతో పొడి చేసిన పదార్థాంతో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుని తేనెలో కలిపి ఫేషియల్ చేసుకోవచ్చు. ఆరెంజ్ గుజ్జుకి శాండిల్ ఉడ్ పౌడర్,ముల్తానీ మట్టిసమపాళ్లలో కలిపి ఫేస్ కి ప్యాక్ చెయ్యాలి. ముఖ కాంతి పెరగడమే కాదు. గోల్డెన్ ఫేషియల్ చేసిన గ్లో వస్తుంది.