సల్మాన్ హీరోయిన్ కోటి రూపాయల్ని వదిలేసింది..!
on May 19, 2016
కోటి రూపాయలు ఇస్తామంటే నేటి తారలు ఎలాంటి ప్రొడక్ట్ కైనా పెద్ద అబ్జెక్ట్ చేయకుండా ఎండార్స్ మెంట్స్ చేస్తారు. డబ్బే ప్రధానమైపోయిన ఈ రోజుల్లో, జరీన్ ఖాన్ మాత్రం క్లియర్ గా వద్దని చెప్పేసిందట. సల్మాన్ బాలీవుడ్ కు పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మకు, ఒక వెయిట్ లాస్ కంపెనీ కోటి రూపాయలు ఆఫర్ చేసిందట. ముందు ఇలా బొద్దుగా ఉండేదాన్ని. ఇది వాడిన తర్వాత ఇప్పుడున్నట్టుగా సన్నంగా మారిపోయాను అని చెప్పాలి. కానీ నేను నిజంగానే చాలా కష్టపడి బరువు తగ్గాను తప్ప ఇలాంటివేమీ వాడలేదు. అలాంటప్పుడు నేను ఈ బ్రాండ్ ను ఎందుకు ఎండార్స్ చేయాలి అని అడిగిందట జరీన్. కష్టపడితేనే ఏదైనా సాధ్యం తప్ప ఇలా సుఖంగా షార్ట్ కట్స్ లో బరువు తగ్గడం కుదరదు. నేను జనాన్ని మోసం చేయను. సక్సెస్ కు షార్ట్ కట్స్ లేవు అంటూ క్లియర్ గా చెప్పేసిందట. దాంతో అవాక్కవడం ఆ కంపెనీ వంతయ్యింది. తారలందరూ ఇలా నిజాయితీగా ఆలోచిస్తే వాళ్ల మీద, వాళ్లు ఎండోర్స్ చేసే వస్తువుల మీద నిజంగానే జనాలకు నమ్మకం పెరుగుతుంది. కాదంటారా..?