దంగల్ బ్యూటీకి అమీర్ ఖాన్ బాసట...
on Jan 17, 2017
దంగల్ సినిమాలో నటించిన కాశ్మీరీ బ్యూటీ జైరా వసీం జమ్ముకశ్మీర్ సీఎం మహబూబా ముఫ్తీని కలవడంతో వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఆమెను కలిసినందుకు గాను కశ్మీర్ యువకులు జైరాను రోల్‌మోడల్‌గా పొగుడుతూ ఫేస్బుక్లో పోస్టులు చేశారు. ఇక దీనికి స్పందించిన జైరా వసీం... తనను రోల్‌మోడల్ అంటూ పోస్టులు చేయడం బాగాలేదని, తాను ఎవరికీ రోల్‌మోడల్‌ను కాదని తిరిగి పోస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, ప్రచారం చేయొద్దని... సీఎం మహబూబా ముఫ్తీతో భేటీ కావడం కొందరికి ఇష్టం లేదని, ఈ భేటీ వల్ల ఎవరి మనసైనా బాధపడితే క్షమించాలని కోరారు. అయితే ఇప్పుడు నటి జైరా వసీమ్‌కు బాలీవుడు సూపర్ స్టార్.. దంగల్ హీరో అమీర్ ఖాన్ బాసటగా నిలిచాడు. నువ్వు నా రోల్ మోడల్ అంటూ ట్వీట్ చేశాడు. జైరా చేసిందాంట్లో తప్పేముందంటూ ప్రశ్నించాడు. అంతేకాదు నేను జైరా ప్రకటన చదివాను.. ఆమె క్షమాపణ చెప్పడానికి కారణమేంటో నాకు తెలుసు. జైరా.. మేమంతా నీ వెంట ఉన్నాం.. నీలాంటి యంగ్, టాలెంటెడ్, హార్డ్‌వర్కింగ్, ధైర్యవంతురాలైన పిల్లలు ఇండియాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆదర్శంగా నిలుస్తారు అని ఆమిర్‌ఖాన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. మరి ఈ వ్యవహారం ఎంత దుమారం రేపుతుందో చూడాలి.