ENGLISH | TELUGU  

వేసవిలో యువ హీరోలదే హంగామా!

on Jan 17, 2019

సంక్రాంతి సందడి ముగిసింది. తెలుగు లోగిళ్లలో పెద్ద పండక్కి ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమాలకు ప్రేక్షకులు తమ తీర్పు ఇచ్చేశారు. 'ఎఫ్ 2' తప్ప మిగతా సినిమాలకు ఆశించిన స్పందన రాలేదు.

సంక్రాంతితో పాటు థియేటర్లలోనూ సినిమా పండగ ముగిసినట్టే. థియేటర్లలో మళ్లీ పండగ ఎప్పుడు వస్తుందంటే... వేసవికి. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పిల్లలకు పరీక్షల సీజన్ కనుక... ఇండస్ట్రీ జనాలు ఆ రెండు

నెలలు ఆగి ఏప్రిల్ నెలలో సినిమాలు విడుదల చేస్తుంటారు. ఈ ఏప్రిల్‌లో ఏయే సినిమాలు విడుదల అవుతాయని ఓ లుక్కేస్తే.. యువ హీరోల సినిమాలే ఎక్కువ కనిపిస్తాయి.

సంక్రాంతి సందర్భంగా అక్కినేని నాగచైతన్య, నాని, సాయిధరమ్ తేజ్ తమ తమ సినిమాల విడుదల తేదీలను ఖరారు చేశారు. ఏప్రిల్ తొలివారంలో 5వ తేదీపై నాగచైతన్య కర్చీఫ్ వేశాడు. పెళ్లి తరవాత శ్రీమతి

సమంతతో తొలిసారి నటిస్తున్న సినిమా 'మజిలీ'ని ఆ రోజున విడుదల చేయనున్నట్టు ప్రకటించాడు. 'నిన్ను కోరి'తో దర్శకుడిగా పరిచయమైన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. నిజానికి, ఏప్రిల్ 5న

మహేశ్ బాబు 'మహర్షి'ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, ఆ సినిమా ఏప్రిల్ 26కి వాయిదా పడటంతో చైతూ సినిమాకు లైన్ క్లియర్ అయ్యింది. ఈ ఏప్రిల్ నెలలో విడుదలవుతున్న పెద్ద హీరో సినిమా

ఒక్క మహర్షి మాత్రమే.

'మజిలీ' ఏప్రిల్ 5న వస్తుంటే ఆ తరవాత వారంలో రావడానికి మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్  సిద్ధమయ్యాడు. 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో తేజూ నటిస్తున్న

'చిత్రలహరి' చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కల్యాణీ ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సాయిధరమ్ తేజ్ ఈ సినిమా కోసం గడ్డం పెంచారు. తేజూ వచ్చిన వారానికి, ఏప్రిల్ 19న 'జెర్సీ'తో నాని థియేటర్లలోకి రానున్నాడు.

సాయిధరమ్ తేజ్, నాగచైతన్య, నాని వంటి యువ హీరోలందరూ వేసవిలో సందడి చేయడానికి సిద్ధమే. వీరి సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలతో సందడి చేయడానికి సూర్య (ఎన్.జి.కె), రాఘవా లారెన్స్

(కాంచన 3) సందడి చేయాలనుకుంటున్నారు.


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.