మహిళలు చూడవద్దని మనవి!
on Oct 27, 2018
సినిమాల్లో నటించడానికి ముందు సన్నీ లియోన్ పోర్న్ సినిమాల్లో నటించారు. భారతీయ సినిమాల్లోకి వచ్చిన తరవాత... వెండితెరపై ఎంత మోతాదులో అందాలు చూపించాలో అంతే చూపిస్తున్నారు. ఆమె పోర్న్ ఇమేజ్ వలన ఎక్స్పోజింగ్ ఎక్కువ చేస్తుందని అనుకుంటున్నారు గానీ... శుక్రవారం యూట్యూబ్‌లో విడుదలైన 'ఏడు చేపల కథ' ట్రైలర్ చూస్తే ఆ మాట అనరు. అంతకు మించి అనే రేంజ్లో సినిమాలో నటించిన హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేశారు. నిజం చెప్పాలంటే... సన్నీ లియోన్ కంటే రెచ్చిపోయారు. 'అడల్ట్ కామెడీ ఫిల్మ్' అని ట్రైలర్లో చెప్పారు. సినిమాకు, ఈ ట్రైలర్‌కు సెన్సార్ సర్టిఫికెట్ రావడం కష్టమని అనుకున్నారేమో? దర్శక, నిర్మాతలు 18 ఏళ్ళ వయసులోపు వారు చూడవద్దని ముందే మనవి చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే.. మహిళలు చూడవద్దని మనవి చేశారు.
సినిమా విషయానికి వస్తే.. .అమ్మాయిల అందాలను చూస్తే నిగ్రహించుకోలేని ఒక యువకుడి కథ ఇది. అదేంటో? ఇతడి ఆరాటాన్ని చూసి అమ్మాయిలు మీద మీద పడుతుంటారు. బట్టలు విప్పేసి సరస శృంగార కలాపాల్లోకి దిగుతారు. ఈ పాయింట్ నుంచి కావలసినంత మిడ్నైట్ మసాలా సన్నివేశాలు రాసినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టత వస్తుంది. యువతను టార్గెట్ చేస్తూ, యువత బలహీనతలను సొమ్ము చేసుకోవాలని తీసిన చిత్రమిది. సెన్సార్ పూర్తయితే సినిమాలో ఎన్ని కోతలు విధించారో తెలుస్తుంది.అప్పటివరకూ ఒక వర్గం ప్రేక్షకుల్లో సినిమా ఆసక్తి రేకెత్తిస్తుంది. పచ్చిపాల అభిషేక్ హీరోగా నటించిన ఈ సినిమాకు ఎస్.జె. చైతన్య దర్శకుడు.