అక్కినేని వేడుకల్లో సమంత ఎందుకు కనిపించడం లేదు?
on Dec 12, 2019
అక్కినేని కుటుంబానికి, సమంతకు మధ్య గొడవలు వచ్చాయా? అక్కినేని కుటుంబంతో కొత్త కోడలు సమంతకు పడడం లేదా? తాజా పరిణామాలు తెలుగు సినిమా వర్గాల్లో కొత్త సందేహాలకు ఆస్కారం ఇచ్చాయి. అంతే కాదు... అక్కినేని కుటుంబంలో ఏదో జరుగుతోందనే అనుమానాలకు ఆజ్యం పోస్తున్నాయి.
ఇటీవల భాగ్యనగరంలో ఏఎన్ఆర్ (అక్కినేని నాగేశ్వరరావు) అవార్డ్స్ ప్రోగ్రామ్ జరిగింది. దానికి అక్కినేని కుటుంబ సభ్యులందరూ అటెండ్ అయ్యారు. ఒక్క సమంత తప్ప! అక్కినేని కుటుంబానికి మూలపురుషుడు ఏఎన్నార్. ఆయన పేరు మీద ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు కార్యక్రమానికి సమంత రాకపోవడం చర్చకు దారి తీసింది. ఎవరో ఊరు పేరు తెలియని వాళ్లకు అవార్డు ఇవ్వలేదు. అతిలోక సుందరి శ్రీదేవికి, ఎవర్ గ్రీన్ బ్యూటీ రేఖకు ఏఎన్ఆర్ అవార్డులు ఇచ్చారు. కనీసం వీటి గురించి సోషల్ మీడియాలో సమంత ఒక పోస్ట్ కూడా చేయలేదు. ఈ సంగతి పక్కన పెడితే... ఈ వారంలో అక్కినేని కుటుంబంలో ఒక శుభకార్యం జరిగింది. దానికి సమంత హాజరు కాలేదు.
అక్కినేని నాగేశ్వరరావు పెద్ద కుమారుడు వెంకట్ అక్కినేని ఇంట బుధవారం ఒక వేడుక జరిగింది. వెంకట్ కుమారుడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. చెన్నైలో బుధవారం నిశ్చితార్థం జరిగింది. హైదరాబాద్ లో ఉంటున్న అక్కినేని కుటుంబ సభ్యులు అందరూ చెన్నై వెళ్లారు. ఈ వేడుకకు సమంత హాజరు కాలేదని సమాచారం. వరుసగా అక్కినేని కుటుంబంలో వేడుకలకు సమంత ఎందుకు హాజరు కావడం లేదు అనేది హాట్ టాపిక్ అవుతుంది. సమంత చాలా ఓపెన్. ఇటువంటి వేడుకలు జరిగినప్పుడు ఫోటోలు తీసుకుని వెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఆమెకు అలవాటు. ఒకవేళ హాజరు కాలేక పోతే ఎందుకు హాజరు కాలేక పోతున్నాం అనేది చెబుతూ ఉంటారు. ఇటువంటి సమంత సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలకు కారణం అవుతోంది.