సల్మాన్ ఖాన్ ఏ దేశంలో దాక్కున్నాడు?
on Sep 17, 2020
గతంలో ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ ట్రోల్స్‌నూ, సోషల్ మీడియా స్క్రుటినీనీ ఎదుర్కొంటూ వస్తోంది. నేషనల్ టెలివిజన్‌లో అరుపులు కేకల చర్చలకు పేరుపొందిన అర్ణబ్ గోస్వామి నిర్విరామంగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి మిస్టరీ గురించి, సొసైటీలో విచ్చలవిడిగా చలామణి అవుతున్న ప్రమాదకర డ్రగ్స్ గురించి మాట్లాడుతుండటం తెలిసిందే.
ఈ వ్యవహారంలో చాలా మంది టాప్ బాలీవుడ్ స్టార్లు మౌనం పాటిస్తున్నారు. దీనిని అర్ణబ్ తనదైన శైలిలో ఆవేశంగా ప్రశ్నిస్తున్నాడు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ఎక్కడ దాక్కున్నాడంటూ ఆయన అడుగుతున్నాడు. ఆ అడగడంలో ఆయన ఆవేశం చూసి జనం ఉల్లాసపడుతున్నారు. సోషల్ మీడియాలో అర్ణబ్‌ను సల్మాన్ ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తుంటే, మిగతావాళ్లు దాన్ని వినోదాత్మకంగా చూస్తున్నారు.
ఆ వీడియోలో అర్ణబ్ గోస్వామి, "సల్మాన్ ఖాన్ ఎక్కడ? ఏ దేశంలో ఆయన దాక్కున్నాడు? బాలీవుడ్లో డ్రగ్ మాఫియా గురించి ఆయన ఎందుకు ఒక్క మాటా మాట్లాడటం లేదు? సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మర్డర్ మీద ఎందుకు సైలెంట్‌గా ఉంటున్నారు? ఏ దేశంలో మీరు నివసిస్తున్నారు సల్మాన్?" అని ప్రశ్నించాడు.
Also Read