'రంగీలా' ఊర్మిళ ఎవరిని ఎలా పెళ్లిచేసుకుందో తెలుసా?
on Sep 19, 2020
రామ్‌గోపాల్ వర్మ మూవీ 'రంగీలా'లో హీరోయిన్గా నటించి దేశవ్యాప్తంగా కుర్రకారు కలల రాణిగా మారిన అందాల తార ఊర్మిళా మతోంద్కర్. తెలుగులోనూ 'గాయం', 'అనగనగా ఒకరోజు' వంటి చిత్రాల్లో నటించి అలరించింది. తొమ్మిదో దశకంలో తన రూపలావణ్యాలు, క్యూట్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. ఇటీవల ఆమె వార్తల్లో నిలవడం తెలిసిందే. జయా బచ్చన్‌పై కంగన చేసిన కామెంట్స్‌పై స్పందించిన ఊర్మిళను, సాఫ్ట్ పోర్న్ యాక్ట్రెస్ అనీ, ఆమెకు నటన తెలీదనీ కంగన వ్యాఖ్యానించడం ఒక సంచలనం. అయితే రామ్‌గోపాల్ వర్మ సీన్లోకి వచ్చిన ఊర్మిళ వెర్సటైల్ యాక్ట్రెస్ అని కితాబివ్వడం ఆమెకు ఊరటనిచ్చే ఉంటుంది.
ఊర్మిళ పర్సనల్ విషయాలు చాలామందికి తెలీవు. ఆమె 2016 మార్చి 3న కశ్మీరీ బాయ్‌ఫ్రెండ్ మీర్ మొహ్సిన్ అఖ్తర్‌ను చడీచప్పుడు లేకుండా వివాహం చేసుకుంది. ఆ తర్వాతే ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది. అఖ్తర్‌ది వ్యాపారవేత్తల కుంటుంబం. మోడలింగ్‌లో తన లక్‌ను చూసుకోవాలనే ఉద్దేశంతో 21 ఏళ్ల వయసులోనే తన కుటుంబాన్ని వదిలిపెట్టాడు. 2007లో మిస్టర్ ఇండియా కాంపిటిషన్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచాడు. అంతేకాదు.. ఇట్స్ ఎ మ్యాన్స్ వరల్డ్, ముంబై మస్త్ కళందర్, లక్కీ బై చాన్స్ లాంటి బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. వయసులో ఊర్మిళ కంటే ఏడెనిమిదేళ్లు చిన్నవాడు.
2014లో ఫేమస్ డిజైనర్ మనీష్ మల్హోత్రా మేనకోడలు రిద్ధి మల్హోత్రా పెళ్లిలో ఊర్మిళ, అఖ్తర్ తొలిసారి కలుసుకున్నారు. తొలి పరిచయంలోనే ఊర్మిళతో గాఢమైన ప్రేమలో పడిపోయాడు అఖ్తర్. ఏడాది పాటు ఆమె ప్రేమ పొందడం కోసం తహతహలాడాడు. ఎట్టకేలకు ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ పొందాడు.
2016 మార్చి 3న బాంద్రాలోని టర్నర్ రోడ్లో ఉన్న ఊర్మిళ ఇంట్లో పూర్తి ప్రైవేట్‌గా జరిగిన వేడుకలో ఆ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కేవలం ఇరువురి కుటుంబ సభ్యులు, క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే ఆ వివాహానికి హాజరయ్యారు. మొదట హిందూ వివాహ పద్ధతిలో ఒక్కటైన ఆ జంట ఆ తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం నిఖా చేసుకున్నారు. ప్రస్తుతం చాలా హ్యాపీగా వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది ఊర్మిళ.
Also Read