వెండితెరపైకి వాలీబాల్ ప్లేయర్, కోచ్ బయోపిక్
on May 26, 2020
ఇండియాలో క్రికెట్ అంటే పడిచచ్చే ప్రజలు ఉన్నారు. ఇతర ఆటలకు ఆ స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇతర ఆటల్లో గొప్ప గొప్ప క్రీడాకారులు, కోచ్‌లు ఉన్నప్పటికీ వాళ్ళ గురించి పెద్దగా వెలుగులోకి రాలేదు. థాంక్స్ టు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ... ప్రజెంట్ జనరేషన్‌కి తెలిసేలా స్పోర్ట్స్ బయోపిక్స్ తీస్తున్నారు. హిందీలో 'చక్ దే ఇండియా', 'బాగ్ మిఖా బాగ్', 'దబాంగ్' తదితర బయోపిక్స్ వచ్చాయి.
తెలుగులో స్పోర్ట్స్ బయోపిక్స్ తక్కువే. ఇప్పటివరకు 'సినిమా చూపిస్త మావ', 'నేను లోకల్' తదితర కమర్షియల్ ఎంటర్టైనర్స్ రాసిన రచయిత ప్రసన్నకుమార్ బెజవాడ, ఇప్పుడో స్పోర్ట్స్ బయోపిక్ రాస్తున్నారు. గ్రేట్ వాలీబాల్ ప్లేయర్, కోచ్ అరికపూడి రామారావు జీవితం మీద సినిమా తీయాలని అతడు కథ రాస్తున్నాడు. ఆల్రెడీ రామారావు సహా వాళ్ళ ఫ్యామిలీని కలిశారు. మాట్లాడారు. అయితే సినిమాకి తగ్గట్టు కొన్ని సంఘటనలకు డ్రామా యాడ్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రసన్న కథ రాసే పనిలో ఉన్నాడు. నెక్స్ట్ ఇయర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నారు. డైరెక్టర్, ఇతర వివరాలు ఇంకా ఫిక్స్ కాలేదు.