అజిత్‌ను బీట్ చేశాడు.. నెక్ట్స్ టార్గెట్ విజయ్..!!
on Dec 10, 2017
తమిళ్లో రజనీకాంత్ తర్వాత అంతటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే టక్కున వచ్చే సమాధానం అజిత్. ఆయన సినిమా వస్తుందంటే చాలు అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పటి వరకు ఉన్న రికార్డులు బద్ధలు కావడం ఖాయం. కలెక్షన్లే కాదు.. యూట్యూబ్‌లోనూ అజిత్‌కు తిరుగులేదు. వివేగం సినిమా టీజరైతే యూట్యూబ్‌లో కొత్త రికార్డులు సృష్టించింది. 6.1 లక్షల మంది ఆ టీజర్‌ను వీక్షించడంతో ఎక్కువ మంది లైక్ చేసిన భారత సినిమాగా అవతరించింది. అయితే దానిని ఇళయ దళపతి విజయ్ మెర్సెల్ సినిమా ద్వారా క్రాష్ చేశాడు.. మెర్సెల్ 10 లక్షల లైక్స్‌తో నిలవడంతో వివేగం రికార్డు కనుమరుగై రెండో స్థానానికి పరిమితమయ్యాడు అజిత్.
ఇప్పుడు తలాకి ఆ ఆనందం కూడా లేకుండా చేశాడు సూర్య. ఆయన హీరోగా.. నటించిన తానా సెరెంద కూట్టమ్ తెలుగులో గ్యాంగ్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. నవంబర్ 30న రిలీజ్ చేసిన ఈ మూవీ టీజర్‌కు 8.1 లక్షల లైకులు లభించిడంతో.. అజిత్ మూడో స్థానానికి పరిమితమయ్యాడు. సూర్య స్పీడు చూస్తుంటే విజయ్ను కూడా వెనక్కు నెట్టే ఛాన్సులు కనిపిస్తున్నాయి అంటున్నారు క్రిటిక్స్.