అఫిషియల్.. మరోసారి విష్ణు మంచు, శ్రీను వైట్ల కాంబినేషన్!
on Nov 20, 2020
విష్ణు మంచు హీరోగా శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన 'ఢీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించడమే కాకుండా, విష్ణు కెరీర్లోనే ఫస్ట్ బ్లాక్‌బస్టర్ ఫిల్మ్‌గా నిలిచింది. ఆ సినిమాతో ఆయన కెరీర్ మరో మలుపు తిరిగింది. అలాగే ఆ సినిమాకు పనిచేసిన వాళ్లందరికీ అది ఒక మరపురాని చిత్రంగా నిలిచింది. ఆ సినిమా ఘన విజయంతో డైరెక్టర్ శ్రీను వైట్లకు పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలకు పనిచేసే అవకాశాలు లభించాయి. మాస్ యాక్షన్ సినిమాలే కాదు, కామెడీ ఎంటర్టైనర్స్లోనూ విష్ణు సూపర్బ్‌గా రాణిస్తారనే విషయాన్ని తెలియజేసిన సినిమా 'ఢీ'.
గేమ్ చేంజర్ లాంటి ఆ సినిమా వచ్చిన పదమూడు సంవత్సరాల తర్వాత మరో హిలేరియస్ ఎంటర్టైనర్ కోసం 'ఢీ' కాంబినేషన్ కలుస్తోంది. అవును. విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో మరో సినిమా రాబోతోంది. దీనికి సంబంధించిన ఎగ్జయిటింగ్ అప్డేట్ను విష్ణు బర్త్‌డే అయిన నవంబర్ 23న రివీల్ చేయనున్నారు.
ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ, "లక్షలాది సినీ ప్రియుల అభిమాన సినిమాల్లో 'ఢీ' ఒకటి. మొత్తం తారాగణం, టెక్నీషియన్లకు ఆ ఫిల్మ్ ఓ గేమ్ చేంజర్. ఆ టైమ్‌లో సరికొత్త తరహా సినిమాలకు ఓ ఊపునిచ్చింది. 'ఢీ' కంటే ఏది బెటర్?" అని తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా అనౌన్స్ చేశారు విష్ణు.
Also Read