English | Telugu

నానిని టార్గెట్ చేసిన రౌడీలు...!

on Sep 6, 2018

కింగ్ నాగార్జున మరియు న్యాచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మల్టీస్టారర్ సినిమా ‘దేవదాస్’. ఈ సినిమాలో డాన్‌గా నాగార్జున నటించగా, ఆయన జంటగా ఆకాంక్ష సింగ్ నటిస్తోంది. ఇక డాక్టర్‌గా నాని నటిస్తున్న ఈ ‘దేవదాస్’చిత్రంలో ఆయన జోడీగా రష్మిక మందన నటించింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్ర నిర్మాణం చివరిదశలో ఉంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ మరియు సి.ధర్మరాజు సమర్పణలో అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానెల్ లో ఈ సినిమాలోని ‘వారు-వీరు’ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. మణిశర్మ స్వరాలు అందించిన ఈ పాటకు సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఈ పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ‘దేవదాస్’చిత్రంలోని రెండో లిరికల్ సాంగ్ విడుదలచేశారు చిత్రం బృదం. ‘సెట్టు కింద ప్లీడరు’ థీమ్ తో సాగిన ఈ పాటలో డాక్టర్‌గా నాని పడిన తిప్పలు బాగున్నాయి. ‘సిందర వందర సుందర వదనా’అంటూ మొదలైన ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రచించగా, పద్మలత ఆలపించింది. కొంత మంది రౌడీలు నానిని ఎడిపిస్తూ పాడే ఈ పాటలో నాని హావభావాలు ప్రేక్షకులకు వినోదాన్ని అందించే విధంగా ఉన్నాయి.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here