మహేష్ పోకిరి కాదు కదా విక్రమ్ సామీ!!
on Sep 10, 2018
హెడ్డింగ్ చూసి మహేష్ పోకిరికీ, విక్రమ్ `సామి` చిత్రానికి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. 2003లో చియాన్ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో `సామి` చిత్రం తెరకెక్కి బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఆ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా `నరసింహా ` పేరుతో రీమేక్ కూడా అయింది. మళ్లీ చాలా గ్యాప్ తర్వాత చియాన్ విక్రమ్ హీరోగా హరి దర్శకత్వంలో `సామి-2` చిత్రం తెరకెక్కుతోంది. ఈ ట్రైలర్ శనివారం విడుదలైంది. పోలీస్ ఆఫీసర్ గెటప్ లో విక్రమ్ అదిరిపోయాడు. హరి సినిమాల్లో కనిపించే వేగం ఈ ట్రైలర్ లో నూ కనిపించింది. ట్రైలర్ లో ఆఖరుగా ``నేను పోలీస్ ని కాదు పోకిరి` అంటూ విక్రమ్ ఫోర్స్ గా ఒక డైలాగ్ చెప్పడంతో ట్రైలర్ ముగుస్తుంది. ఆ డైలాగ్ విన్న వారంతా నువ్వు మహేష్ పోకిరి అయితే కాదు కదా అంటూ సరదాగా సెటైర్స్ వేస్తున్నారు. ట్రైలర్ లో విక్రమ్ వీరత్వం కనిపించినా... ట్రైలర్ చూస్తున్నంత సేపూ సింగం సీక్వెల్ కి ఈక్వల్ గా ఉన్నట్టుందే అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. పవర్ ఫుల్ పోలీస్ కథలను తెరపై ఆవిష్కరించడంలో దిట్టైన హరి ఈ సినిమా తో తన గురి తప్పడేమో అంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కీర్తి సురేష్ కొంచెం గ్లామర్ శాతం పెంచినట్టు ట్రైలర్ లో చూస్తే కనిపిస్తుంది. ఈ చిత్రం ఈ నెలలోనే రిలీజ్ కానుంది.
Also Read