English | Telugu

రౌడీ హీరోను బెదిరించిన రాశీ ఖన్నా!

on Feb 13, 2020

 

అవును. రాశీ ఖన్నా తనను బెదిరించిందని రౌడీ హీరో విజయ్ దేవరకొండ వెల్లడించాడు. ముంబైలో షూటింగ్‌లో ఉన్న తనను 'వరల్డ్ ఫేమస్ లవర్' ప్రమోషన్స్‌కు రావాలంటూ ఆమె రోజూ ఫోన్లు చేసి బెదిరించిందని బుధవారం రాత్రి విశాఖపట్నంలో జర్గిన ఆ మూవీ గ్రాండ్ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ చెప్పాడు. ఈ వేడుకకు వేలాదిగా విజయ్ ఫ్యాన్స్ తరలి వచ్చి, హంగామా సృష్టించారు. వాళ్లను చూసి ఉద్వేగానికి గురైన విజయ్ "నన్ను చూడ్డానికి, మా ఈవెంట్ చూడ్డానికి ఎక్కడెక్కడ్నుంచో వచ్చుంటారు. చాలా గ్రేట్‌ఫుల్‌గా ఫీలవుతున్నాను. మీరందరూ నేనెక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు. నేనేం చేసినా గుంపులు గుంపులుగా వస్తున్నారు. థియేటర్లు నింపుతున్నారు. ఇంతమందిని చూస్తే అందరినీ గట్టిగా కౌగలించుకోవాలని ఉంటుంది. నిన్ననే 'రౌడీ హగ్' అని ఒకటి కొత్తది ప్రారంభించాం" అంటూ వాళ్లను కౌగలించుకుంటున్నట్లు గాల్లో చేతులు చాపగానే అతని ఫ్యాన్స్ కూడా అతడ్ని కౌగలించుకుంటునట్లు చేతులు చాపారు.

ఈ సినిమాకి తాను ఎక్కువ ప్రమోషన్ చెయ్యలేదని విజయ్ అన్నాడు. "నా తొమ్మిదో సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' రిలీజవబోతోంది. అది నా ఆఖరి లవ్ స్టోరీ అని చెప్పాను. కానీ ఈరోజు దాని గురించి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను బాంబేలో షూటింగులో ఉండటం వల్ల ఈ సినిమాకి నేనెక్కువగా ప్రమోట్ చెయ్యలేదు. మా హీరోయిన్లు, ముఖ్యంగా రాశీ ఖన్నా అయితే, 'విజయ్ ఎప్పుడొస్తున్నావ్? నువ్వు రావాలి, బజ్ క్రియేట్ చెయ్యాలి, హైప్ క్రియేట్ చెయ్యాలి' అని రోజూ కాల్స్ చేస్తూ నన్ను బెదిరిస్తూ వచ్చింది. నేను హైదరాబాద్‌కు 6వ తేదీ వచ్చిన. ఆ రోజు ట్రైలర్ లాంచ్ చేసినం. అప్పుడే చెప్పిన, 'విజయ్ దేవరకొండ సినిమా అంటే ఒక బజ్, ఒక ఎగ్జైట్ మెంట్ ఉంటుంది. అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది' అని. మళ్లీ నేను బిజీ అయిపోయా. 9న ప్రి రిలీజ్ ఈవెంట్‌కు వచ్చా. అక్కడికి వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ అభిషేక్ వచ్చి, 'హైదరాబాద్ లో బుకింగ్స్ ఫుల్ అవుతున్నాయ్' అని చెప్పాడు. 'అట్లా ఎట్లా అవుతాయ్, ఇంకా ప్రమోషనే స్టార్ట్ చెయ్యలేదు' అని నేనడిగాను. 'లేదు, అవుతున్నాయ్' అన్నాడు. నేను చేసే సినిమాలు ఒకటైతే, ఆ సినిమాకి బజ్ ఉండేది మీవల్లే (ఫ్యాన్స్ వల్లే) అని నాకు అర్థమైంది. మీ రౌడీస్ వల్ల, తెలుగు సినిమా ఆడియెన్స్ వల్ల ఈ బజ్ క్రియేట్ అవుతోంది. నేను మీకిచ్చేది ఒకే ఒక గ్యారంటే. మీరు నా ఏ సినిమాకి వెళ్లినా ఒక కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది.

 

 

ఈ సినిమాలోనూ మీకొక కొత్త ఎక్స్‌పీరియెన్స్ గ్యారంటీ. ఒక చిన్న పల్లెటూరిలో జరిగే ప్రేమకథ,  ప్యారిస్‌లో జరిగే ఒక ప్రేమకథ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సిటీల్లో జరిగే ఓ ప్రేమకథ. ఈ వేలంటైన్స్ డేన నాలుగు ప్రేమకథలు నింపి మీ కోసం ఒక సినిమా తీసుకొస్తున్నాం. ఈ సినిమా ఏమవుతుందో జెన్యూన్‌గా నాకు తెలియదు. శుక్రవారం మీరే చెప్పాలి. మా పర్ఫార్మెన్సెస్ అయితే అన్నీ అదిరిపోతాయ్. మా యాక్టర్స్ అందరూ కష్టపడి సూపర్బ్‌గా చేశారు. ప్రతి యాక్ట్రెస్ సూపర్బ్‌గా చేసింది. ఈ వేలంటైన్స్ డేకి మీ అందరికీ స్వాగతం. థియేటర్స్‌కి రండి. ప్రేమలో పడండి, ప్రేమను ఎక్స్‌పీరియెన్స్ చెయ్యండి. 'వరల్డ్ ఫేమస్ లవర్' వరల్డ్‌ను ఎక్స్‌పీరియెన్స్ చెయ్యండి. మీరందరూ నా లైఫ్‌లో ఉండటం నాకు గిఫ్ట్" అని ఎమోషనల్‌గా మాట్లాడాడు విజయ్.

క్రాంతిమాధవ్ డైరెక్ట్ చేసిన 'వరల్డ్ ఫేమస్ లవర్'లో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరిన్ ట్రెసా, ఇజాబెల్లే లీటే హీరోయిన్లుగా నటించించారు. క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు ప్రెజెంట్ చేస్తోన్న ఈ సినిమా శుక్రవారమే (ఫిబ్రవరి 14) ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Cinema GalleriesLatest News


Video-Gossips