విజయ్ మదిని బ్రోచేనా?
on Apr 6, 2020
యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ చేసింది రెండంటే రెండు చిత్రాలే. ఒకటి... 'మెంటల్ మదిలో'. రెండోది... 'బ్రోచేవారెవరురా'. రెండో సినిమా విడుదలై ఆరు నెలలు దాటినా మరో సినిమా స్టార్ట్ చేయలేదు. అయితే, ఈ గ్యాప్ లో ఇద్దరు హీరోల చేత కథలు ఓకే చేయించుకున్నాడని ఫిలింనగర్ టాక్. నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో వివేక్ ఆత్రేయ ఒక సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ గత నెలలో సినిమా ఓకే అయింది.
లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... విజయ్ దేవరకొండకు రీసెంట్గా వివేక్ ఆత్రేయ ఒక స్టోరీ లైన్ వినిపించాడట. అది విని ఇంప్రెస్ అయిన దేవరకొండ, ఫుల్ స్క్రిప్ట్ తో రమ్మని అడిగాడట. ప్రజెంట్ ఫుల్ స్క్రిప్ట్ రాసే పనిలో వివేక్ ఆత్రేయ బిజీగా ఉన్నాడట. క్వారంటైన్ టైమ్ ఫినిష్ అయ్యేలోపు బౌండ్ స్క్రిప్ట్ వినిపించి, దేవరకొండ మనసు బ్రోచి సినిమా ఓకే చేయించుకుంటాడో? లేదో? ఒకవేళ ఓకే అయితే, నాని సినిమా తర్వాత ఈ సినిమా ఉంటుంది.
Also Read