బాలాకోట్ వైమానిక దాడిపై విజయ్ దేవరకొండ సినిమా?
on Sep 24, 2020
'అర్జున్ రెడ్డి' సినిమాతో విజయ్ దేవరకొండకి హిందీ ప్రేక్షకులలోనూ మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు చాలామంది అతడి గురించి మాట్లాడారు. అతడి క్రేజ్ గుర్తించిన కరణ్ జోహార్ అతడితో పాన్ ఇండియా సినిమా తీయడానికి ముందుకొచ్చారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'ఫైటర్'కి కరణ్ జోహార్ కూడా ఒక నిర్మాత. తెలుగు సహా హిందీ, ఇతర దక్షిణాది భాషలలో సినిమా తెరకెక్కుతోంది. దీని తరువాత విజయ్ దేవరకొండ స్ట్రయిట్ హిందీ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
సర్జికల్ స్ట్రయిక్ నేపథ్యంలో హిందీలో 'ఉరి' సినిమా తెరకెక్కింది. ఇప్పుడు పాకిస్తాన్లోని బాలాకోట్ ప్రాంతంపై భారత్ విమానిక దాడి నేపథ్యంలో దర్శకుడు అభిషేక్ కపూర్ ఓ సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నారట. అందులో హీరోగా విజయ్ దేవరకొండను అనుకుంటున్నారట. ప్రస్తుతం డిస్కషన్లు జరుగుతున్నాయని టాక్. ఈ సినిమాను సంజయ్ లీలా భన్సాలీ, భూషణ్ కుమార్ నిర్మిస్తారని తెలుస్తోంది. అభినందన్ వర్థమాన్ పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనున్నారు.
Also Read