`రౌడీ అన్నయ్య` స్టోరితో తమ్ముడు సినిమా!!
on Jul 16, 2019
విజయ్ దేవరకొండ తమ్ముడుగా `దొరసాని` సినిమాతో టాలీవుడ్ లోకి ఇంటర్ డ్యూస్ అయ్యాడు ఆనంద్ దేవరకొండ. ఈ సినిమాకు మిక్స్ డ్ టాక్ వచ్చినా కూడా నటుడుగా పాస్ మార్క్స్ కొట్టేసాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఇదే ఊపులో ఆనంద్ తన రెండో సినిమాను లైన్ లో పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఓ నూతన దర్శకుడు విజయ్ దేవరకొండ కోసం తయారు చేసిన కథను తమ్ముడు ఆనంద్ తో చేయబోతున్నాడట. భవ్య క్రియేషన్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం అందుతోంది. మొదటి సినిమా కాస్త స్లోగా , పర్ఫార్మెన్స్ కు స్కోపున్న పాత్రను ఎన్నుకున్న ఆనంద్ ఈ సారి రౌడీ అన్నయ్య విజయ్ దేవరకొండ తరహాలో పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఉన్న కాన్సెప్ట్ ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ ను తమ్ముడుకోసం అన్న విజయ్ సెట్ట చేసినట్లు సమాచారం. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజం ఉందనేది అధికారిక ప్రకటన వస్తే కానీ తెలియదు.
Also Read