అమ్మాయిలు ఆట బొమ్మలంటున్న విజయ్...
on Mar 1, 2018
"పెళ్లి చూపులు" సినిమాతో హిట్ కొట్టి "అర్జున్ రెడ్డి" సినిమాతో ఏకంగా ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ మరో డిఫరెంట్ కాన్పెప్ట్ తో వచ్చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ఏ మంత్రం వేశావే. ఈరోజు ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఇక ఈ ట్రైలర్ కూడా అందరికీ నచ్చేసింది. మరి ట్రైలర్ విషయానికొస్తే.. 'గేమింగ్ అతని ప్రపంచం. గాడ్జెట్స్ అతని జీవితం. ఇన్సెన్సిటివ్, ఇర్రెస్పాన్సిబుల్" అంటూ ఓ యువతి చెప్పే డైలాగ్స్‌తో ట్రైలర్ ప్రారంభం అవుతుంది. అమ్మాయిలంటే తనకు కేవలం ఆటబొమ్మలేనని, వారితో తాను ఆడుకుంటానని ''గర్ల్స్ ఆర్ జస్ట్ లైక్ టాయ్స్. ఐ కెన్ ప్లే గేమ్స్ విత్ దెమ్" చెప్పే డైలాగ్ యూత్ మధ్య క్రేజ్‌ను సంపాదించుకుంటోంది. అలాగే ''డోంట్ నో ఎబౌట్ లవ్. బట్ షీ మేక్స్ మీ ఫీల్ సమ్ థింగ్ ఇన్ సైడ్" అన్న విజయ్ డైలాగ్‌తో ట్రైలర్ ముగుస్తోంది. ఇక అర్జున్ రెడ్డి ఎఫెక్ట్ తో విజయ్ పై భారీ అంచనాలే ఉన్నాయి అందరికీ. మరి ఈ ట్రైలర్ అయితే అందరికీ నచ్చింది.. సినిమా మరి ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి..
కాగా విజయ్ దేవరకొండ , శివాని సింగ్, కోమ్య విరాక్, నీలాక్షి సింగ్ ప్రధాన పాత్రలలో తెరక్కిన ఈ చిత్రానికి శ్రీధర్ మర్రి దర్శకత్వం వహిస్తున్నాడు. మార్చి 9న ఈ సినిమా విడుదలకానుంది.
Also Read