సైనిక కుటుంబాలకు అండగా విజయ్ దేవరకొండ!!
on Feb 16, 2019
ఇటీవల జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో నలభై మందికి పైగా సైనికులు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. సాధారణ ప్రజల నుండి సెలబ్రిటీస్ వరకు తమ సానుభూతిని ట్వీట్స్ ద్వారా తెలియజేస్తున్నారు. కానీ హీరో విజయ్ దేవరకొండ ఒక అడుగు ముందుకు వేసి సైనిక కుటుంబాలను ఆదుకొనడానికి సాయమందించి , ప్రజలందరినీ సాయం చేయమని కోరారు.
సైనికుల సాయానికి సంబంధించన సర్టిఫికేట్ ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశారు. విజయ్ ఎంత అమౌంట్ డొనేట్ చేశారో ఆ సర్టిఫికేట్ లో లేదు. ``సైనికులు మన కుటుంబాలకు రక్షణగా ఉన్నారని, మనం సైనిక కుటుంబాలకు అండగా ఉండాలని , ఏం చేసినా సైనిక ప్రాణాలకు విలువకట్టలేమని, తన వంతు సాయం చేశానని, అందరం కలిసి సైనిక కుటుంబాలకు ఒక సపోర్ట్ క్రియేట్ చేద్దాం`` అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు.