రైటర్ విజయ్ దేవరకొండ!
on Jun 17, 2019
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రైటర్‌గా మారాడని టాలీవుడ్ టాక్. అతను రైటర్‌గా మారింది సినిమాకు కథలు రాయాలని కాదు, సినిమాలో క్యారెక్టర్ కోసం! క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అందులో అతనిది రైటర్ రోల్ అని టాక్. అతను రాసిన మూడు కథలు తెరపై వస్తాయి. ప్రతి కథలోనూ హీరోగా అతనే కనిపిస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం మారుతూ ఉంటుంది. ఇందులో రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానుంది. ఇది కాకుండా విజయ్ దేవరకొండ నటించిన మరో సినిమా 'డియర్ కామ్రేడ్' జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన చిత్రమిది.