అందులో విజయ్ దేవరకొండ తప్పేం లేదు
on Mar 9, 2018
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఇట్స్ మై లైఫ్ లో ఒక చిన్న క్యారెక్టర్ లో కనిపించిన విజయ్ దేవరకొండ అనతి కాలంలోనే సక్సెస్ఫుల్ హీరో గా ఎదిగాడు. పెళ్లి చూపులు తో సోలో హీరోగా మొదటి హిట్ కొడితే, అర్జున్ రెడ్డి విజయ్ కి ఎనలేని స్టార్డమ్ సంపాదించి పెట్టింది. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీ గా ఉన్నాడు. ఇందులో దాదాపు సినిమాలన్నీ పేరున్న నిర్మాణ సంస్థలతో ఉండడం విశేషం. ఈ సమ్మర్ లో టాక్సీవాలా గా పలకరించనున్న విజయ్ తో పని చేయడానికి అగ్ర దర్శకులు సైతం ఇంటరెస్ట్ చూపిస్తున్నారు.
ఇదిలా ఉంటే, కొన్ని రోజుల క్రితం ఏ మంత్రం వేసావే ట్రైలర్ సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టింది. తీరా చూస్తే అందులో హీరో విజయ్ దేవరకొండ. అసలు ఈ సినిమాని విజయ్ ఎప్పుడు చేసాడు అని దీర్ఘాలోచనలో నెటిజన్స్ ఉండగా, అది దాదాపు అయిదు సంవత్సరాల క్రితం చేసిన సినిమాగా క్లారిటీ ఇచ్చాడు. రేపు విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించి యే ప్రమోషన్స్ లో కూడా విజయ్ పాల్గొనడం లేదు. ఇందుకు విజయ్ కి దర్శకుడు శ్రీధర్ మర్రి తో ఉన్న విభేదాలే కారణం అని వార్తలు వచ్చాయి.
అయితే, తనకు విజయ్ కి ఎలాంటి గొడవలు లేవని, సినిమా రిలీజ్ కి డిలే అవ్వడం... విజయ్ వేరే సినిమాలతో బిజీ గా ఉండడం వల్ల ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని వివరించాడు. అసలు ప్రతి అవకాశాన్ని క్యాష్ చేసుకోవాలని చూసే ఈ రోజుల్లో, ఇంత హానెస్ట్ గా ఉన్న శ్రీధర్ ని మెచ్చుకొని తీరాల్సిందే. మీరేమంటారు!