బావుంది కదూ!.. భలే ఛాన్స్ కొ్ట్టేసింది!
on Sep 6, 2017
ఈ అమ్మాయ్ ఎలా ఉంది? కుందనపు బొమ్మలా లేదు! ‘పాలతో... కడిగిన... పావురమా...’ అని ఓ పాటుంది వినే ఉంటారు. ఈ అమ్మాయ్ ని వర్ణించాలంటే ఆ అలాంటి మాటలే పడాలి. త్వరలో మన తెలుగు తెరపై మెరవనుంది ఈ అందాల భామ.
ఎప్పటికప్పుడు కొత్త అందాలు తెరపైకి రావడం కామన్. కానీ... ఈ అమ్మాయ్ గురించి అంత ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏం వచ్చిందా? అనేగా మీ ప్రశ్న. ఈ అమ్మాయ్ ‘ఓకే’అయిన సినిమా అలాంటిది మరి. సరే అసలు విషయానికొద్దాం.
దర్శకుడు పరశురామ్... ఓ లవ్ ఎంటర్టైనర్ తీయడానికి రెడీ అయ్యాడు. అందులో హీరోగా మన ‘అర్జున్ రెడ్డి’ ‘ఓకే’ అయ్యాడు. అదేనండీ... విజయ్ దేవరకొండ. అసలే లవ్ ఎంటర్టైనర్. మరి దానికి తగ్గట్టే అందమైన అమ్మాయ్ కూడా కావాలి కదా. అందుకే... ఈ అమ్మాయిని కథానాయికగా ఖరారు చేశాడు పరశురామ్. ఇంతకీ ఈ అమ్మాయ్ పేరు చెప్పనేలేదు కదూ. ‘రష్మికా మడన్నా’.
కొన్ని కాంబినేషన్లు సెట్ అవ్వగానే.. ఇది ‘హిట్’ అని చెప్పేయొచ్చు. ఇది కూడా అలాంటి కాంబినేషనే. పూరీ జగన్నాథ్ శిష్యుడు పరశురామ్. ఇది చాలామందికి తెలిసిన విషయమే. పరశురామ్ హీరోలు కూడా దాదాపు పూరీ హీరోల్లాగే బిహేవ్ చేస్తుంటారు. యారగెంట్ గా, మొండిగా, ఫన్నీగా.. ఇలా చాలా లక్షణాలు కనిపిస్తుంటాయ్. ఇక విజయ్ దేవరకొండ... ఈ కుర్రాడు కెమెరా ముందు అస్సలు నటించడు. బిహేవ్ చేస్తాడు. ‘అర్జున్ రెడ్డి’గా అతని అభినయాన్ని తేలిగ్గా మరిచిపోగలమా? పరశురామ్ దర్శకత్వంలో విజయ్ తేలిగ్గా ఇమిడిపోవడం ఖాయం. వీరికి తోడు ఈ అందం.. ఇది చాలదూ యూత్ కి.
ఏది ఏమైనా మంచి కాంబినేషన్ సెట్ అయ్యింది... ఇంకో అందమైన అమ్మాయ్ తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. బెస్ట్ ఆఫ్ లక్.