English | Telugu

అర్జున్ రెడ్డి కి హీరోయిన్ దొరికింది...

on Sep 6, 2017

 

అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ మంచి ఫామ్ లో ఉన్నాడు. వివాదాలతో మొదలైన ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ జోష్ తోనే విజయ్ మరో కొత్త సినిమా చేస్తున్నాడు.  'శ్రీరస్తు శుభమస్తు' అనే సినిమాతో హిట్ కొట్టిన పరశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇప్పుడు మళ్లీ అదే బ్యానర్లో అతనికి మరో ఛాన్స్ వచ్చింది. ఇందులో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. అయితే విజయ్ హిట్స్ కొట్టినా పాపం హీరోయిన్ ల కొరత మాత్రం బానే ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట లావణ్య త్రిపాఠిని అనుకున్నారు. కానీ లావణ్య త్రిపాఠి సినిమా నుండి తప్పుకోవడంతో సినిమా యూనిట్ కథానాయికగా కొంతమంది పేర్లను పరిశీలించి...చివరికి కన్నడ హీరోయిన్ 'రష్మిక మందన'ను సెలెక్ట్ చేశారట. రష్మిక మందన కన్నడ హీరోయిన్ 'కిరిక్ పార్టీ' హిట్ కొట్టడంతో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఆమెను సెలెక్ట్ చేయడంతో విజయ్ కు హీరోయిన్ దొరికింది. మరి ఈ హిట్ పెయిర్ ఎంత వరకూ హిట్ అవుతుందో చూద్దాం.

Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here