షర్టు లేకుండా విజయ్ దేవరకొండ...
on Aug 6, 2020
పెంపుడు కుక్కతో దిగిన ఫొటోను విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో షర్టు లేకుండా ఛాతికి కుక్కను అడ్డం పెట్టుకుని ఉన్నాడు. బేర్ బాడీతో ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, సినిమాలో యాక్ట్ చేయడం విజయ్ దేవరకొండకు అలవాటే. అయితే, ఈ ఫొటోలో కండలు తిరిగిన దేహంతో లేకపోవడమే అభిమానులకు కాస్త నిరాశగా ఉంది. సిక్స్‌ప్యాక్ లేదని కాస్త కలత చెందారు. ఎందుకంటే...
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అతడు బాక్సర్‌గా నటిస్తున్నాడు. కథానుగుణంగా కొన్ని సన్నివేశాలలో సిక్స్‌ప్యాక్‌తో కనిపించాల్సి ఉంది. సిక్స్‌ప్యాక్ కోసం ట్రై చేస్తున్నట్టు విజయ్ దేవరకొండ కూడా ఓసారి చెప్పాడు. ఇప్పుడు చూస్తే సిక్స్ ప్యాక్ ఎక్కడా లేదు. కరోనా కారణంగా షూటింగ్ జరగడం లేదు. సిక్స్ ప్యాక్ చేయడానికి టైమ్ కూడా దొరికింది. కానీ, విజయ్ దేవరకొండ చేసినట్టు లేదు. ఒకవేళ మజిల్ బాడీతో సిక్స్ ప్యాక్ లేకుండా షూటింగ్ చేస్తారేమో.