English | Telugu

ఫోర్బ్స్ జాబితాలో సెన్సేష‌నల్ హీరో!!!

on Dec 5, 2018

క్రేజీస్టార్ గా అతి త‌క్కువ కాలంలోనే  పాపులారిటీ సంపాదించుకున్న హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పెళ్లి చూపులు చిత్రంతో హీరోగా కెరీర్ ప్రారంభించి  అర్జున్ రెడ్డి, గీత గోవిందం, `టాక్సీవాలా` చిత్రాల‌తో త‌నేంటో ప్రూవ్ చేసుకున్నారు. అయితే ఈ హీరో 2018కి గానూ అత్య‌ధిక ఆదాయాన్ని పొందిన టాప్ 100 జాబితాలో ప్లేస్  సంపాదించుకున్నాడు. ఫేమ‌స్ మ్యాగ్జైన్ ఫోర్బ్స్ లో ఇటీవ‌ల ప్ర‌క‌టించిన జాబితాలో విజ‌య్ దేవ‌ర‌కొండ 14 కోట్ల‌తో 72 వ స్థానంలో నిలిచి మ‌రో మారు టాలీవుట్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యాడు సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌రకొండ‌.

 ఇక ఈ జాబితాలో సౌత్ నుండి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్ (50)కోట్ల‌తో ఫ‌స్ట్ ప్లేస్ లో నిల‌వ‌గా, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ (31.33 కోట్లు), త‌మిళ స్టార్ విజ‌య్ (30.33 కోట్లు), ఎన్టీర్ (28 కోట్లు), విక్ర‌మ్ 26 కోట్లు, మ‌హేష్ బాబు 24.33 కోట్లు, సూర్య 23.67 కోట్లు, విజ‌య్ సేతుప‌తి 23.67 కోట్లు, నాగార్జున 22.25 కోట్లు, కొర‌టాల శివ 20 కోట్లు, ధ‌నుష్ 17. కోట్లు, న‌య‌న‌తార 15.17కోట్లు, అల్లు అర్జున్ 15 కోట్లు, రామ్ చ‌ర‌ణ్ 14 కోట్లు ..ఇలా ఈ జాబితాలో ప్లేస్  సంపాదించుకున్నారు. ఈ 100 మంది జాబితాలో స‌ల్మాన్ ఖాన్ 253.25 కోట్లతో అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీ 228. 09 కోట్లు, అక్ష‌య్ కుమార్ 185 కోట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచి అంద‌రినీ అబ్బుర ప‌రిచారు.


Also Read



Latest News



Customer Service

Live Help 24/7Customer Care

teluguone.teluguone@gmail.com

Send your Queries to

support@teluguone.com

Follow Us Here