పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు...
on Nov 13, 2016
బాలీవుడ్ నటి విద్యాబాలన్ నిర్మాత సిద్దార్థ్ రాయ్ కపూర్‌ను విద్య 2012లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అసలు జీవితంలో ఆమె పెళ్లి చోసుకోవాలి అని అనుకోలేదట. ఈ విషయాన్ని స్వయంగా విద్యాబాలన్ చెప్పింది. ప్రస్తుతం విద్యాబాలన్ ‘కహానీ-2’ చిత్రంలో నటించి.. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె అసలు జీవితంలో పెళ్లి చేసుకోవాలని అనుకోలేదని.. జీవితంలో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేని సమయంలో సిద్దార్థ్ పరిచయమయ్యాడని.. అప్పుడే తాను నిర్ణయం మార్చుకున్నానని చెప్పింది. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా చేయాలనిపిస్తుందని.. అదే జీవితంలో ఓ మనిషి తోడుంటే చేసే ప్రతి పనికి ఉన్న విలువ అర్థమవుతుందని చెప్పుకొచ్చింది విద్యా.