నెలకొసారి ప్రగ్నెంట్ అవుతున్న హీరోయిన్..
on Dec 7, 2016
సినీ వినీలాకాశంలో హీరోయిన్లకు అవార్డులు, రివార్డులు, విమర్శలు, ప్రశంసలు కామన్..వాటితో పాటే వద్దన్నాసరే వచ్చే పుకార్లు అదనపు బోనస్. పలానా హీరోయిన్, ఆ హీరోతో డేటింగ్ చేస్తోందనో..నిర్మాత మాయలో అందాల తార అనో రకరకాల గాసిప్స్ నిత్యం హల్చల్ చేస్తూనే ఉంటాయి. వీటికి కొందరు అలవాటు పడిపోగా..కొందరు ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నారు. కాని తమ మీద గాసిప్స్ సృష్టించిన వారి అంతు చూసే వారు కొందరున్నారు వారిలో బాలీవుడ్ డర్టీ భామ విద్యాబాలన్ ఒకరు.
ఇటీవల విద్యకు భర్తతో విబేధాలు తలెత్తాయని, ఆమె విడాకులు తీసుకునేందని బోలేడు ప్రచారం జరిగింది..అలాగే విద్య గర్భవతి అని కూడా పలుమార్లు వార్తలు పుట్టించారు. ఇలాంటి పుకార్లపై మొదట్లో బాధపడ్డ విద్య తర్వాత వీటికి అలవాటు పడిపోయారు..కానీ అవి మరింత శృతి మించిపోవడంతో తనదైన స్టయిల్లో స్పందించింది. ఇలాంటి వార్తలు ఎవరు..ఎందుకు పుట్టిస్తారో తెలియదు. మేమిద్దరం చాలా సంతోషంగా ఉన్నాం.. నా ప్రెగ్నెన్సీ గురించి కూడా రాస్తున్నారు. మీడియా వాళ్లు ప్రతీనెల నన్ను గర్భవతిని చేసేస్తున్నారు. అంటూ ఫైరయ్యింది.