ఎన్టీఆర్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన విద్యాబాలన్
on Jul 17, 2018
విద్యాబాలన్, సిల్క్ స్మిత జీవితం ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్ అనే చిత్రం ద్వారా తెలుగు ప్రజలకు దగ్గరైంది. ప్రస్తుతం ఆమె తెలుగులో విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎన్టీఆర్’లో నటించనున్నారు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ గా బాలకృష్ణ, ఆయన సతీమణి బసవతారకం పాత్రలో విద్యా బాలన్ నటిస్తున్నారు. బాలకృష్ణ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్టీఆర్ గురించి ఎంతోకొంత ఎవరికైనా తెలుస్తుంది కానీ ఆయన భార్య బసవతారకం గురించి ఎవరికీ పెద్దగా తెలిసే ఆస్కారం లేదు.
ఈ పాత్రలో నటించేందుకు ఓ నటిగా ఇదే నాకు ఆసక్తిని పెంచిందని,ఆమె పాత్ర కథలో చాలా కీలకం అందుకే ఈ సినిమాకు ఒప్పుకున్నా అని విద్యా బాలన్ తెలిపారు. ఎన్టీఆర్ జీవితం సినిమా ,రాజకీయాలకు ముడిపడి ఉంది.అందుకే ఇందులో అనేక మంది నటీనటులకు, రాజకీయ నాయకులకు చోటుంది. ఇప్పటికే కృష్ణ పాత్ర కోసం మహేశ్‌బాబును, అక్కినేని నాగేశ్వరరావు పాత్ర కోసం నాగచైతన్యను సంప్రదించినట్లు సమాచారం. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో రానా కనిపించనున్నారు. రాజశేఖర్, మోహన్‌బాబుతో పాటు పలువురు నటీ,నటులు నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షూటింగ్లో భాగంగా విద్యాబాలన్‌పై వచ్చే ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.