లుక్ మారింది..లక్ కలిసొస్తుందా..?
on Mar 21, 2017
తెలుగులో రీమేక్‌లకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చే పేరు విక్టరీ వెంకటేశ్. కెరీర్లో సూపర్ హిట్ మూవీస్‌లో చాలా వరకు రీమేక్‌లే. తన తోటి సీనియర్లంతా ఫామ్‌లోకి వచ్చి కలెక్షన్లు కొల్లగొడుతుంటే వెంకటేశ్ మాత్రం వరుస ఫ్లాప్‌లతో డీలా పడిపోయాడు..దీంతో మరోసారి తనను తాను నిరూపించుకోవడానికి రీమేక్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మాధవన్ హీరోగా తమిళ్, హిందీల్లో మంచి విజయాన్ని అందుకున్న "సాలా ఖద్దూస్"ను రీమేక్ చేస్తూ గురు అనే సినిమా చేస్తున్నాడు వెంకీ.
ఇందులో బాక్సింగ్ కోచ్‌గా నటిస్తున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో తనలో కొత్త కోణాన్ని చూపించాడు. ఎప్పుడూ సాఫ్ట్ లుక్‌లో కనిపించే వెంకటేశ్ ఈ సినిమా కోసం చాలా సీరియస్‌గా, రఫ్ అండ్ టఫ్ లుక్‌లో కనిపిస్తున్నాడు..ముఖ్యంగా ట్రైనింగ్ ఇచ్చే సమయంలో వెంకటేశ్ ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయాయి. గురు మీద అంచనాలు పెంచేందుకు కెరిర్‌లోనే తొలిసారిగా పాట కూడా పాడాడు. మరి వెంకటేశ్ పడిన కష్టం ఫలిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. నేషనల్ అవార్డ్ విన్నర్ సుధా కొంగర ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. రితికా సింగ్, ముంతాజ్ సర్కార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.