వెంకీతో 'జాతిరత్నాలు' దర్శకుడి మూవీ!
on Sep 19, 2021
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి టైటిల్ రోల్స్ లో నటించిన `జాతిరత్నాలు` ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హిలేరియస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో అనుదీప్ దర్శకుడిగా ఫస్ట్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ నేపథ్యంలో.. అనుదీప్ నెక్స్ట్ వెంచర్ పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. రీసెంట్ గా కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్ తో తెలుగు - తమిళ భాషల్లో అనుదీప్ ఓ బైలింగ్వల్ మూవీ చేయబోతున్నట్లు ప్రచారం సాగింది. అయితే, దానికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
లేటెస్ట్ బజ్ ఏంటంటే.. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేశ్ తో అనుదీప్ తదుపరి చిత్రం తెరకెక్కే అవకాశముందట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని సమాచారం. అంతేకాదు.. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తుందని వినికిడి. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానున్నది. మరి.. ఫక్తు వినోదాత్మక చిత్రాలతో పలుమార్లు విజయకేతనం ఎగురవేసిన వెంకటేశ్.. అనుదీప్ కాంబో మూవీతోనూ అదే తీరుని కొనసాగిస్తారేమో చూడాలి.
కాగా, వెంకీ నటించిన తాజా చిత్రం `దృశ్యం 2` విడుదలకు సిద్ధమైంది. మరోవైపు `ఎఫ్ 3`ని పూర్తిచేసే పనిలో ఉన్నారీ టాప్ స్టార్.
Also Read